Advertisement
Guest User

తెలుగు సామెతలు by రెంటాల గోపాలకృష్ణ

a guest
May 15th, 2023
1,446
0
Never
Not a member of Pastebin yet? Sign Up, it unlocks many cool features!
text 378.32 KB | None | 0 0
  1. అకటా వికటపురాజు అవివేకపు ప్రధాని చాదస్తపు పరివారం.
  2. అంకెలేని కోతి లంకంతా చెరిచిందట.
  3. అక్కన్న అద్దంకి పోనూపొయ్యాడు రానూ వచ్చాడు.
  4. అక్కన్న మారన్నలు అందలం ఎక్కితే, సాటికి సరసపు చెరువుగట్టు ఎక్కాడట.
  5. అక్క మనదై తే మాత్రం బావ మనవాడా?
  6. అక్కరకు ఒడవని అర్ధమెందుకుు అక్కరకు రాని చుట్టమెం షుదుకు.
  7. అక్కరకు రాని చుట్టము అక్కరలేదు. మొక్కితే వరమీని దేవుడ క్కరలేదు.
  8. అక్కర తీరిన తర్వాత అల్లుడు తొత్తుకొడుకై నట్టు.
  9. అక్కరున్నంతవరకూ, ఆదినారాయణ అక్కర తీరింతర్వాత బాది నారాయణ
  10. అక్షయపాత్ర,
  11. అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్బుడినోట్లో శని ఉంది.
  12. అంగడాన్ని బట్టి గొడ్డు వంగడాన్నిబట్టి బిడ్డ.
  13. అంగడి అమ్మి గొంగళి కొన్నట్టు.
  14. అంగడి వీధిలో అబ్బా అంటే ఎవడికి పుట్టావురా కొడకా అన్నటు.
  15. అగడ్తలో పడ్డ పిల్లికి అదే వైకుంఠమట!
  16. అగసాలిని వెలయాలిని నమ్మకూడదు.
  17. అగస్త్య భ్రాత.
  18. అంగళ్లో అరువు తలమీద బరువు.
  19. అంగిట బెల్లం కడుపులో విషం.
  20. అగ్గిని మండించవచ్చు గాని మూర్చుణ్ణి మార్చలేమట!
  21. అగ్గి మీద గుగ్గిలం చల్లినట్లు!
  22. అగ్నికి వాయువు తోడై నట్టు.
  23. అగ్నిలో ఆజ్యం పోసినట్లు.
  24. అగ్ని శేషం, వణ శేషం, బుణశేషం, రణ శేషం ఉండ రాదు.
  25. అంచుడాబేకాని వంచెడాబులేదట.
  26. అంచుల అందాలు చూసి అందరూ మోసాల పాలయినట్టు.
  27. అచ్చమ్మ పెళ్ళిలో బుచ్చెమ్మ శోభనం.
  28. అచ్చి పెళ్ళి బుచ్చిచావుకు వచ్చిందట.
  29. అచ్చివచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు వుట్టాడట.
  30. అచ్చుపోసిన ఆబోతులాగా!
  31. అచ్చొచ్చిన భూమి అడుగడే చాలు.
  32. అజగరోపవాసం.
  33. అంటనప్పుడు ఆముదం రాచుకున్నా అంటదు.
  34. అంటాముటరాని అగ్రహారం.
  35. అటైతే కందిపప్పు ఇటైతే పెసరపప్పు
  36. అట్టువెట్టినమ్మకు అట్టున్నర!
  37. అంట్లుతోమచే అంకాక్షి అంకే అత్తరు రానుకోనీవే కుంకాక్షి అందట.
  38. అట్లుపో సే ఆమెకు ఆరుగురు అందివ్వాలట.
  39. అడకత్తెరలో పోకచెక్కలాగా.
  40. అడతడి నెత్తి బుడతడు కొడితే బుడతడి నెత్తి బుడోడు కొట్తాట్ల.
  41. అండపోయిన అల్లీసాయిబు పీలవబోయిన పీరుసాయిబూ పత్తాలేరు
  42. అండలుంటే కొండలు దాటవచ్చు.
  43. అండలేనీ ఊళ్ళో ఉండదోషం,ఆశలేనీ పుట్టింట అడగ దోషం.
  44. అడవి కాచిన వెన్నెల.
  45. అడవిలో ఉసిరికాయకి, సముద్రంలో ఉప్పుకూ సంబంధం.
  46. అడవిలో చెట్టుకాయ ఊరిలో ఉప్పురాయి కలిస్తే ఊరగాయ
  47. అడవిలో వెన్నెల సముద్రంలో వాన ఒకటే
  48. అడిగితేకాని అమ్మయినా వెట్టదన్నట్లు.
  49. అడిగితే చిరాకు, అడక్కపోతే వరాకు.
  50. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ.
  51. అడుక్కుతినే అమ్మకు అరవై ఆరు కూరలైతే వండుకున్న అమ్మకు ఒకరే కూర.
  52. అడుక్కు తినేవాడికి ఆలు భాగ్యవంతుడికి బానిన అయింది మేలు!
  53. అడుగులోనే హంసపాదు.
  54. అడును త్రొక్కనేల కాలు కడుగనేల.
  55. అడుసులో హంస ఆడింది,అడవిలో అమ్మ పాడింది ఒకటే!
  56. అడ్జెడు తవ్వెడు చియ్యమిచ్చి అమ్మా నీ ప్రసాదం అన్నట్లు.
  57. అడ్డం తప్పుకో అంటే గడ్డం పట్టుకో అన్నట్టు
  58. అడ్డాలనాడు బిడ్డలు కొని గడ్డాలనాడు బిడ్డలా?
  59. అణిగి మణిగి ఆకులో పిందెలాగ.
  60. అంతకు తగిన గంత, గంతకు తగిన బొంత.
  61. అతడికంటు ఘనుడు ఆచంట మల్లన్న.
  62. అంతం లేని చోటులేదు, ఆదిలేని ఆరంభం లేదు.
  63. అంతా అయిన వాళ్ళే కాని మంచినీళ్ళు పుట్టవు.
  64. అంతా కంత.
  65. అంతా తెలిసిన వాడులేడు. ఏమీ ఎరగని వాడు లేడు.
  66. అంతా మనమంచికే.
  67. అంతా మా వాళ్ళేకాని, అన్నానికి రమ్మన్న వారు లేరు.
  68. అంతా శ్రీ వైష్ణవులే కాని బుట్టెడు రొయ్యలూ ఏమై నాయో!
  69. అతి రహాస్యం బట్టుబయలు.
  70. అతివృష్టి అనావృష్టి ఏదయినా ఆకలిబాధ తప్పదు.
  71. అతుకుల కాపరం చితుకుల మంటలాంటిది.
  72. అతుకుల బొంత గతుకుల బాట!
  73. అత్త అవున్నదీ లేదు కోడలు కాదన్నాదీ లేదు!
  74. అత్త ఆడమంది, కోడలు కుంటమంది.
  75. అత్తకి అట్లతద్ది సరదా! కోడలికి కోటప్పకొండ సరదా
  76. అత్తకు అల్జుడాశ బాపడికి పప్పాశ,
  77. అత్తకొట్టిన కుండ అడుగోటి కుండ, కోడలు కొట్టిన కుండ కొత్తకుండ.
  78. అత్తగారి ఆరళ్ళు కోడరి గారి వేవిళ్ళు.
  79. అత్త చచ్చిందని అత్త చీరకట్టుకుంకే చచ్చినాక దయ్యమైపట్టిందట
  80. అత్త చచ్చిన ఆరు మాసాలకు కోడలు ఏడ్చిందట!
  81. అత్తచేసే పనులకు ఆరళ్ళే లేవట.
  82. అత్తతనంలో మంచితనం, ఆడంగిలో మగతనం వుంటాయా?
  83. అత్తదానం న్వర్గానికి, కోడలి దానం నరకానికి
  84. అత్తను అమ్ముకోమన్నారు కోడల్ని కొనుక్కోమన్నారు
  85. అత్తను ఏడిపించిన కోడలు అత్త అయితే బలేగుందట
  86. అత్తను కొట్టి అటకెక్కిందట. మొగుణ్ణి కొట్టి మొగసాల కెక్కిందట.
  87. అత్తను చూసి దాచుకోవడం, పిల్లని చూసి పారేసుకోవడం.
  88. అత్త పగలగొడితే పాత కుండ కోడలు పగలగోడితే కొత్త కుండ
  89. అత్త పెట్టేఆరళ్ళే కనపడతాయి కాని కోడళ్ళు చేసే కొంటె పన్లు కనపడవట.
  90. అత్త బుద్ధి కోడలు బుద్ది. ఒకటవుతాయా?
  91. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు.
  92. అత్తముండ కన్న ఉత్తముండ మేలు.
  93. అత్తలేని కోడలుత్తమురాలు, కోడలులేని అత్త గుణవంతురాలు!
  94. అత్తలో మంచీలేదు, వేములో తీపీ లేదు.
  95. అత్తవల్ల దొంగతనం, మొగుడివల్ల రంకుతనం నేర్చుకున్నట్లు.
  96. అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్టు.
  97. అత్తా అత్తా అన్నం పెట్టత్తా అంటే సున్నం పెడతానే అందట.
  98. అత్తా అత్తా ఎప్పుడు నిద్రపోతావంటే నిన్ను చూసిపోతా అందట
  99. అత్తా అత్తా కొడుకును కంటానంటే,వద్దంటానా అందట
  100. అత్తా అత్తా రోకలి ఎత్తమంటే అమావాసరానీమందట
  101. అత్తా ఒకింటి కోడలే.
  102. అంత్య నిష్టూరంకన్నా ఆది నిష్టూరం మేలు.
  103. అందం ఉంటే ఆయనా, అదృష్టం ఉండొద్దా!
  104. అందచందాలు లేని మొగుడు మంచంనిండా ఉన్నాట్టు.
  105. అందని ద్రాక్షపళ్ళు వుల్లన అన్నట్టు.
  106. అందని మాని పండ్లకు అర్రులు చొచినట్టు
  107. అందరి కాళ్ళకు మొక్కినా అత్తగారింటికిపోక తప్పదు.
  108. అందరికీ అట్ట పండగ, మనకు ముట్ట సండగ.
  109. అందరికీ అన్ని రోగాలున్నాయిగాని అడ్డెడు తప్పాలకు ఏ రోగం లేదట.
  110. అందరికీ నేను లోకువ. నాకు నంబి సింగరాయ లోకువ.
  111. అందరికీ శకునం చెప్పే బల్లి కుడితి తొట్లో పడిందట.
  112. అందరూ అందలమెక్కితే మోసేవాళ్ళెవరు?
  113. అందరూ ఒక ఎత్తెతే అగస్త్యుడు ఒక్కడూ ఒక ఎత్తు అతని కమండలం ఒక ఎత్తు.
  114. అందరూ శ్రీవైష్టవులే బుష్టిడు రొయ్యలు ఏమైనట్టు.
  115. అది కడుపా, చెరువా.
  116. అది కుమ్ము, ఇది దుమ్ము, పదరా పందిట్లోకి అన్నాట్ట.
  117. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు.
  118. అదిగో పులి అంతే, ఇదిగో తోక అన్నట్టు.
  119. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు.
  120. అందితే జుట్టు, అందకుంటే కాళ్ళు.
  121. అదృష్టం చెప్పరాదు, దురదృష్టం చెప్పీ పోదు.
  122. అదృష్టవంతుణ్ణి చెడగొట్టవాడు లేడు (భ్రష్ణుణ్ణ్‌ బాగుపరచే వాడులేడు.
  123. అదృష్టవంతుల్ల చెడగొట్టేవాడు, దురద్భష్ట్రనంతుల్ల బాగువరిచే వారు లేరు!
  124. అద్దంలో ముడుపు అరచేతి స్వర్గం.
  125. అద్భష్టం చెప్పీరాదు, దురదృష్టం చెప్పీపోదు.
  126. అధముడికి ఆరి అయ్యేదానికంటే బలవంత్తుడికి బానిస కావటం మేలట.
  127. అంధుడికి అద్దం చూపినట్లు.
  128. అనగా అనగా రాగం, తినగా తినగా రోగం.
  129. అనిత్యాని శరీరాణి అందరిసామ్మూ మనశేరానీ..
  130. అనిత్యాని శరీరాని అందరి సొమ్ము మనకేరాని!
  131. అనుమానం ప్రాణ సంకటం.
  132. అనుమానం ముందుపుట్టి ఆడది తర్వాత పుట్టిందట.
  133. అనుమానం మొగుడు ఆలిని వీపుకు కట్టుకుంటే, పెళ్ళాం ముండ మొగుణ్ణి కొప్పులో వెట్టుకుందట.
  134. అనుములు తింటూ మినుములు పెట్టినట్టు.
  135. అనువయిన భూమి అరచేయంత చాలు
  136. అనువుగాని చోట అధికుల మనరాదు.
  137. అనువుగానిచోట అధికులమనరాదు.
  138. అనూరాధలో తడిస్తే ఆడది మొగవాడవుతాడట.
  139. అన్నం ఉడికిందో లేదో అంతా పట్టి చూడక్కరలేదు.
  140. అన్న చారవేకాని ఆక్షర చొరవలేదు.
  141. అన్నం తిన్నవాడు తన్నులు తిన్నవాడు మరిచిపోడు.
  142. అన్నదమ్ముల కలహం బావ మరుదుల సరసం
  143. అన్నదమ్ముల శత్రుత్వం, అక్కచెల్లెళ్ళ మిత్రత్వం.
  144. అన్న దేషం బహ్మద్వేషం పనికిరాదంటారు.
  145. అన్నపు చొరవేకాని ఆక్షరపు చారవలేదు.
  146. అన్నం పెట్టిన వాడింటికి కన్నం వేసినట్టు.
  147. అన్న వస్త్రాలకు పోతే ఉన్నవస్త్రం కాస్తా ఊడిపోయిందట.
  148. అన్నం వెడితే అరిగిపోతుంది, చీరపెడితే చినిగిపోతుంది,వాత పెడితే కలకాలం ఉంటుంది.
  149. అన్నాలన్నీ సున్నాలు, అప్పాలన్నీ కప్పాలు.
  150. అన్నీ ఉన్న ఆకు అణిగి పడిఉంటుంది ఏమీలేని అకు ఎగిరెగిరి పడుతుంది.
  151. అన్నీ ఉన్నాయిగాని ఒక్క అయిదో తనమే లేదట.
  152. అన్నీ తెలిసిన అత్త అమావాస్యనాడు చచ్చిందట.
  153. అన్నీ తెలిసినవాడు అమావాస్య నాడుచస్తే, ఏమీ తెలియని వాడు ఏకాదశి నాడు చచ్చాట్టు
  154. అన్నీ తెలిసినవాడూ లేడు. ఏమీ తెలియని వాడూ లేడు.
  155. అపశబ్ద భయం భయం నాస్తి నాస్తి, తిష్టన్‌ అప్పలాచార్య సన్నిధౌ అనాచార. మూత్రస్య సన్నిధౌ.
  156. అప్ప ఆరాటమే గాని బావ బతికే లక్షణం కనపడలేదట.
  157. అప్పిగా చెప్పులెక్కడరా అంటే ఆకాశాన కనపడలేదన్నాట్ట
  158. అప్పిచ్చినాడు బాగు కోరతాడు తీసుకున్నవాడు చెడుకోర తాడు.
  159. అప్పుచేసి పప్పు కూడు తిన్నట్టు.
  160. అప్పున్నవాడితోటీ, చెప్పులున్న వాడితోటీ వెళ్ళకూడదంటారు.
  161. అప్పులేకపోతే ఉప్పు గంజైన మేలే.
  162. అబద్దాలాడితే ఆడపిల్లలు పుడతారు.
  163. అబద్ధమాడితే అన్నంపుట్టుదు, నిజం చెపితే నీళ్ళు పుట్టవు,
  164. అబద్ధమాడినా గోడ పెట్టినట్లుండాలి.
  165. అంబరితాగేవాడికి మీసాలు ఎగబట్ట వాడొకడు.
  166. అంబలి త్రాగేవారు కొందరై తే మీసాలు ఎగబ్ట్రేవారు కొంద రట,
  167. అబ్బడి నెత్తి దిబ్బడు కొడితే, దిబ్బడి నెత్తి సుబ్బడు కొట్టాట్ట.
  168. అబ్బడి నెత్తిన సుబ్బడు కొడితే. సుబ్బడి నెత్తి సూరీడు కొట్టాడట
  169. అబ్బ బావి తవ్విస్తే, అబ్బాయి పూడ్చించాడట.
  170. అబ్బరాన బిడ్డ పుడితే ఆముదంతో ముడ్డి కడిగిందట.
  171. అబ్బలేని బిడ్డ, గట్టులేని చేను.
  172. అబ్బురానికి బిడ్డ పుడితే, గడ్డపార తేరా చెవులు కుడతాన న్నాడట.
  173. అంభంలో కుంభం ఆదివారంలో సోమవారం.
  174. అభాగ్యుడికి ఆకలెక్కువ, నిర్భాగ్యుడికి నిద్ర ఎక్కువ.
  175. అభ్యాసం కూసు విద్య
  176. అమరం నెమరుకు వస్తే కావ్యాలెందుకు కాల్చనా.
  177. అమరితే ఆడది, అమరకుంటే గాడిది.
  178. అమావాన్యకు అట్టు, పున్నానికి బూరెలు.
  179. అమావాస్య నాడు అట్టు పెట్టాను పున్నమి నాడు పూర్ణాలు పెట్టాను. నాగులచవితికి నాకేం వెడతవన్నట్లు
  180. అమ్మ కడుపు చూస్తుంది, ఆలు వీవు చూస్తుంది.
  181. అమ్మ కన్న సంతానమంతా నిక్షేప రాయుళ్ళే.
  182. అమ్మ గూటికి, అయ్య కాటికి.
  183. అమ్మ గృహప్రవేశం అయ్య అగ్ని ప్రవేశం.
  184. అమ్మ "పెట్టాపెట్టదు. అడుక్కుతినా నివ్వదు.
  185. అమ్మబోతే అడివి కొనబోతే కొరివి.
  186. అమ్మ వుట్టిల్ద మేనమామ దగ్గరా.
  187. అమ్మా తల్లి అంతే అప్పాలన్నీతినేసిందట
  188. అమ్మాయి పుట్టిందంకే ఆయువు సగం మింగినట్లు.
  189. అమ్ముకో అమ్ముకో అంటే కొనుక్కో కొనుక్కో అన్నట్టు
  190. అయితే ఆడబిడ్డ కాకుంటే మొగబిడ్డ అన్నాట్ట.
  191. అయితే ఆతుకూరు లేకపోతే పోలేపల్లి.
  192. అయితే ఆదివారం కాకపోతే సోమవారం అన్నట్టు.
  193. అయిందన్మూ పెళ్ళి అణిగేనమ్మా రంధి.
  194. అయినవారికి ఆకుల్లో, కానివారికి కంచాల్లో వెట్టినట్లు.
  195. అయిపోయిన పెళ్ళికి మేళమెందుకు.
  196. అయుష్న గట్టిదై తే అడివిలో ఉన్నా, అయోధ్యలో ఉన్నా ఒకటే.
  197. అయ్యకు విద్యాలేదు, అమ్మకు గర్వంలేదు.
  198. అయ్యగారిని చెయ్యబోతే కొయ్య గారైనట్లు.
  199. అయ్యగార్ని చెయ్యబోతే కోతి అయినట్టు.
  200. అయ్య దేశ సంచారం, అమ్మ గ్రామ సంచారం.
  201. అయ్యవార్లవారి నట్టిల్లు లాగా.
  202. అరగని కూడు జరగని మాట.
  203. అరచి గీవెట్టినా,
  204. అరచేతికి పండ్లొచ్చినట్టు.
  205. అరచేతిలో బెల్లం పెట్టి మోచేతి వరకూ నాకించినట్టు.
  206. అరచేతిలో వైకుంఠం, కలత నిద్రలో కైలాసం
  207. అరచేతిలో వైకుంఠం చూపినట్టు.
  208. అరటాకు మీద ముల్లు పడ్డ, నుల్లు మీద అరటాకు పడ్డ అరటాక్కే నష్టం.
  209. అరటిసండొలిచి చేతిలో పెట్టినట్టు.
  210. అరణ్యరోదనం.
  211. అరనిముషం భోగానికి ఆరునెలలు రోగం.
  212. అరవం అధ్వాన్నం, తెలుగు తేట, కన్నడం కస్తూరి.
  213. అరవ చాకిరి.
  214. అరవ చెరుచుు పాము కరుచు.
  215. అరవబోకే చెల్లీ అంటే, కరవబోకే అక్కా అన్నదట
  216. అరవలేని దేశం, కాకిలేని ఊరు లేదు.
  217. అరవై ఏళ్ళాస్తే చదువుకోక చస్తాడా!
  218. అరికాలి ముల్లు అరచేతి వుండు
  219. అరికాలి ముల్లు చరిలేని గొల్లు.
  220. అరిచే కుక్క కరవదు.
  221. అరిటాకొచ్చి ముల్లుమీద పడ్డా ముళ్టొచ్చి అరిటాకు మీద పడా అరిటాకుకే నష్టం.
  222. అరిష్టానికి అంగారకుడు, పాపానికి భైరవుడు,
  223. అరుంధతి కనవడలేదంటే ఆరువేలప్పు కనిపించిందా అన్నట్టు
  224. అరువు బేరంనాడు ఆత్మీయులు, వసూలునాడు బూతులు
  225. అరువు సొమ్ములు బరువుకు చేటు.
  226. అర్జీల వల్ల పనులూ కావు, ఆశీర్వాదాల వల్ల బిడ్డలూ పుట్టురు.
  227. అర్హరాత్రి వేళ అంకమ్మ శివాలన్నట్టు.
  228. అర్హరాత్రి వేళ మద్దెల దరువు.
  229. అలకపాన్సు.
  230. అలవాటులేని అవపోసన చెయ్యబోతే, మూతి మీసాలన్నీ తెగ కారినయట.
  231. అలికిన ఇంట ఒలికినా అందమే
  232. అలిగి అత్తగారింటికెళ్ళేకంటే చెడి చెల్లిలింటికి వెళ్ళడ మేలు.
  233. అలిగిన కోడలు, సోలిన అత్త గుట్టుగా వుంటారు.
  234. అలిగే బిడ్డతో వెలిగే గొద్దుతో వేగడం కష్టం.
  235. అలి నోట్లో ఆముదం మొగుడి నోట్లో మినపగింజ
  236. అలివిగాని ఆలినిచేనుకొని మురిగిచచ్చెరా ముండాకొడుకు.
  237. అల్డుడు చుట్టమూకాడు ఆముదం చెట్టు వృక్షం కాదు.
  238. అల్పుడికి ఐశ్వర్యం వస్తే అర్హరాత్రి వేళ గొడుగు పట్టమన్నాట్ల.
  239. అల్పుడెవుడు పలుకు ఆడంబరము గాను.
  240. అల్లుడికి అత్తాశ, బాపడికి పప్పాశ, గొడ్డుకు దూడాశ.
  241. అల్లుడికి బెట్టు, ఇల్లాలికి గుట్టు ఉండాలి.
  242. అల్లుడికి వండిన అన్నం కొడుక్కు పెట్టిందట.
  243. అల్లుడి మంచితనం పొల్లున దంచిన బియ్యం లేవు.
  244. అవలక్షణాలున్నవాడికి అక్షింతలు ఇస్తే అవతలకు పోయి నోటోరొ వేనుకున్నాట్ట,
  245. అవివేకితో స్నేహంకన్నా వివేకితో విరోధం మేలు.
  246. అవ్రులున్న వాడి వెంట, చెప్పులున్న వాడి వెంట పోకూడదు.
  247. అవ్వని పట్టుకొని, వసంతమాడినట్టు.
  248. అవ్వ లేని మనిషి పిప్పిలేని పగడం ఉండునా.
  249. అవ్వ వడికిన నూలు తాత మొలత్రాడుకే సరిపోయిందట.
  250. అవ్వా కావాలి బువ్వాకావాలి అంతే ఎట్టా?
  251. అషాఢ మాసం అరిసెలొండని పొద్దే ఉండదు.
  252. అసలే కోతి. అద్దం చూపిస్తే వూరుకుంటుందా?
  253. అస్థరిత బ్రహ్మచారి.
  254. 'ఆ అంటే అపశబ్దం, 'నారాయణా అంటే బూతుమాట
  255. ఆ ఇంటి కాకి ఈ ఇంటి మీద వాలదు, ఈ ఇంటి కాకి ఆ ఇంటి మీద వాలదు
  256. ఆ ఇంటికి తలువూ లేదు ఈ ఇంటికి ద్వారబంధం లేదు
  257. ఆ ఇంటికి దడీలేదు, ఈ ఇంటికి గడియలేదు.
  258. ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో, ఈ ఊరు ఆ ఊరికి అంతే దూరం
  259. ఆకలి ఆకాశమంత గొంతు సూది బెజ్జమంత,
  260. ఆకలి రుచి ఎరుగదు,. నిద్ర సుఖమెరుగదు, వలపు సిగ్గెరగదు.
  261. ఆకలి వేస్తుంది అత్తగారూ అంతే రోకలి మింగచే కోడలా అన్నదట.
  262. ఆకాశ రామన్న,
  263. ఆకాశవీధిలో కొంగలు, అంగడి వీధిలో దొంగలు .
  264. ఆకాశాన వరద గూడు, అత్త గారింట్లో వానగోడు.
  265. ఆకాశానికి నిచ్చెన వేసినట్లు.
  266. ఆకు కందక పోకకు పొందక ఏమవుతుంది?
  267. ఆకులు ఎత్తరా అంటే విస్తళ్ళు లెక్క పెచ్టాట్టు.
  268. ఆగ్రహాన అనపెట్టుకున్నట్టు.
  269. ఆచారానికి అంతంలేదు. అనాచారానికి ఆదిలేదు.
  270. ఆటాపాటా మాఇంట మాపటి భోజనం మీఇంట.
  271. ఆటునుంచి ఇటు నరుక్కు రమ్మన్నారు!
  272. ఆటు-పోటు.
  273. ఆడండి ఆడండి అంటే పాడండి. పొడండి అన్నారట.
  274. ఆడదాని అబద్దం గోడ కట్టినట్లు వుందట
  275. ఆడదానికి మొగవాడు మొగుడు, అప్పుల వాడికి షావుకారు మొగుడు.
  276. ఆడదాని చేతి అద్దం, మగాడే చేతి బిడ్డ బ్రతకదట.
  277. ఆడదాని నోట్లో నువ్వు గింజ నానదు.
  278. ఆడదాని మాట నీటిలో మూటా ఒకేనట.
  279. ఆడది బొంకితే గోడపెట్టినట్టు మొగవాడు బొంకితే తడిక కటినటు.
  280. ఆడ పెత్తనం తంబళ్ళ దొరతనం.
  281. ఆడబోయిన తీర్ధం ఎదురొచ్చినట్లు.
  282. ఆడలేక మద్దెల మీద పడ్డట్టు.
  283. ఆడలేని అమ్మాయిలు మద్దెల ఓటిదన్నారట
  284. ఆడవి కాచిన వెన్నెల.
  285. ఆడితప్పారాదు. పరికి బొంకారాదు.
  286. ఆడింది ఆట పొడింది పాట.
  287. ఆడేకాలు పాడేనోరు.
  288. ఆ తండ్రి కొడుకు కాడా.
  289. ఆత్మస్తుతి, పరనింద, అర్జాపేక్ష లేని వాడు మహానుభావుడే.
  290. ఆపదలు కాపలాలుండవు.
  291. ఆపోది మాటలకు అర్ధంలేదు. గుడ్డికంటికి చూపూలేదు.
  292. ఆమడలు దూరమైతే అంతఃకరణాలు దూరమవుతాయా.
  293. ఆముదపు విత్తులు ఆణిముత్యాలవుతాయా.
  294. ఆముదాల బేరం, కామెర్ల రోగం నమ్మరాదు.
  295. ఆయనగొరుంటే మంగలాడితో పనేమిటి.
  296. ఆయానం ఒకరిది అనుభవం మరొకరిది.
  297. ఆయుష్హు తీరిన వాడు ఆరు నెల్లకు చస్తే అనుమాన పడే వాడు అప్పుడే చచ్చాట్ట.
  298. ఆరంభ శూరత్వం
  299. ఆరంభశూరుడికి అర్భాటమెక్కువ.
  300. ఆరు దుక్కల వర్షం కురిస్తే ఆరువేల కప్పలు అరుస్తాయట
  301. ఆరుద్రకు అడ్డెడు చల్లితే పునాసకు పుట్టడు పండుతుందట
  302. ఆరుద్ర కురిస్తే దారిద్ర్యం లేదు.
  303. ఆరుద్రలో వర్షం అమృతంతో సమానం
  304. ఆరుద్ర వానకు ఆమ్రాలు పండుతాయంటారు.
  305. ఆరునూరైనా అదంతే.
  306. ఆరునెల్లకు చస్తాడనగా అసలు గుణం మారుతుందట.
  307. ఆరునెల్లు సాముచేసి మూలనున్న ముసలిదాన్ని కొట్టినట్టు.
  308. ఆరునెల్లు స్నేహం చేస్తే వారు వీరవుతారట.
  309. ఆరో కాన్పు ఆడపిల్లయితే అత్తనారింటికి లక్ష్మి అట.
  310. ఆరోగ్యమే మహాభాగ్యం.
  311. ఆర్చేవారు లేరు తీర్చేవారు లేరు అడుగున బడితే లేవ దీసేవారు లేరు,
  312. ఆర్చేవారేకాని తీర్చేవారు లేరు.
  313. ఆర్తి దుఖం ఆరునెల్టు. కడుపు దుఃఖం కలకాలం.
  314. ఆలస్యం చేస్తే అమృతం విషమవుతుందట?
  315. ఆలికి అదుపు ఇంటికి పొదుపు.
  316. ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉవకారమా.
  317. ఆలి రహన్యం బట్ట బయలు.
  318. ఆలి వంక వారు ఆత్మబంధువులు, తల్లి వంక వారు తగినవారు, తండ్రి వంకవారు దాయాదులు
  319. ఆలు ఏడ్చిన ఇల్ల, ఎద్దు ఏడ్చిన సేద్యం ముందుకు రావట.
  320. ఆలు లేత, నారు ముదురు కావాలట
  321. ఆలూలేదూ చూలూలేదు,కొడుకు పేరు సోమలింగమట.
  322. ఆవగింజంత సందుంటే అరవై గారెలు తినేవాడట.
  323. ఆవలింతకు అన్నలున్నారుకాని తుమ్ముకు తమ్ముళ్ళు లేరట.
  324. ఆవలి'స్తే పేగులు లెక్క పెట్టినట్టు.
  325. ఆవాహన లేదు, విసర్ణన లేదు.
  326. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?
  327. ఆవు తొలిచూలు,గేదె మలిచూలు.
  328. ఆవు నలుపైతే పాలు నలుపా,.
  329. ఆవుపాడి ఎన్నాళ్ళు,ఐశ్వర్యం ఎన్నాళ్ళు. బట్టిపాడి ఎన్నాళ్ళు, భాగ్యమెనాళ్ళు
  330. ఆవులను మళ్ళించినవాడే అర్జునుడు.
  331. ఆవులూ ఆవులూ పోట్లాడితే లేగదూడల కాళ్ళు విరిగినట్టు.
  332. ఆ వూరివారు ఈ వూరికి రారంకే ఈ వూరివార్సు ఆ వూరు పోరన్నారట,
  333. ఆశ ఆలి మీద పడక చాప మీద.
  334. ఆశకు అంతూ లేదు. గోచికి మించిన దరిద్రం లేదు.
  335. ఆశ దోషమెరుగదు పూటకూళ్ళమ్మ పుణ్యమెరుగదు.
  336. ఆసనాలు వేస్తే పాసనాలు పుట్టాయట.
  337. ఆసుకోలా ఆనుకోలా అంటే పరుగుతీ నావెంటరా అందిట.
  338. ఆస్తిపంపకంతో చావులు, అయ్య చావుతో విందులు
  339. ఆహారం దగ్గర, వ్యవహారం దగ్గర మొగమాటం పనికిరాదు.
  340. ఇక్కడ మునిగి అక్కడ తేలేవాడు.
  341. ఇక్ష్వాకుని కాలం.
  342. ఇంగువ కట్టిన గుడ్డ బెల్లం వండిన పొయ్యి.
  343. ఇంగువ కట్టిన గుడ్డ వాసనపోదు.
  344. ఇచ్చిండి ఇచ్చి పుచ్చిన దాన్ని కొన్నట్లు,
  345. ఇచ్చింది పోయింది అసలు రాదు.
  346. ఇచ్చిన దాతకు ఒక్క దణ్ణం నిలిచిన పీతకు వేయి దణ్జాలు
  347. ఇచ్చేవాడికి పత్రం, చచ్చేవాడికి మందూ అక్కర్లైదు.
  348. ఇచ్చేవాడు దాత ఇవ్వనివాడు రోత.
  349. ఇచ్చేవాణ్ణి చూస్తే చచ్చేవాడైనా లేస్తాట్ట.
  350. ఇంటగెలిచి రచ్చ గెలవమన్నాడు.
  351. ఇంటదానికి ఇత్తడి గొలుసు, బజారుదానికి బంగారు గొలుసు
  352. ఇంటికన్నా గుడి పదిలం.
  353. ఇంటికి దీపం ఇల్లాలే.
  354. ఇంటిగుట్టు లంకకు చేటు.
  355. ఇంటింట ఇటుక పొయ్యి, మాఇంట మట్టి పొయ్యి
  356. ఇంటింటికీ ఒక పొయ్యి మా ఇంటికి మరో పొయ్యి
  357. ఇంటిదీపంగదా అని ముద్దాడితే మూతి కాలకుండా ఉంటుందా
  358. ఇంటి దీపమని ముద్దాడితే మూతి మీసాలన్నీ తెగ కాలాయట.
  359. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టులేడు.
  360. ఇంటి పేరు ఇంగువ వీధి పేరు గింగువ
  361. ఇంటిపేరు కస్తూరి వారు, ఇల్లు గబ్బిలాల కంపు.
  362. ఇంటిలో ఈరక్క పెరటిలో పేరక్క
  363. ఇంటిలో పోరు వీధిలో జోరు.
  364. ఇంటి వాడిలా చేసేవాడు, బయటివాడిలా తినేవాడు,
  365. ఇంటీ వెనకాల ఇంగువ చెట్టు ఎంత కోసినా గుప్పెడు కొదు
  366. ఇటుక లాడికి రవిక పెడితే కంపకు పెట్టి చింపుకున్నదట.
  367. ఇంటే గుట్టు రచ్చకెక్కినట్టు.
  368. ఇంట్లో ఇల్లారి పోరు, బయట బాకీల పోరు.
  369. ఇంట్లో ఈగల మోత బైట పల్లకేల మోత.
  370. ఇంట్లో పిల్లలు మంచంలో నల్దులు
  371. ఇంట్లో పొయ్యి. చావిట్లో నుయ్యి
  372. ఇంట్లో వస్తు బయట వస్తు.
  373. ఇంత బతుకూ బతికి ఇంటి వెనకాల చచ్చినట్టు.
  374. ఇత్తొకటి వే స్తే చెట్టొకటి మొలుస్తుందా!
  375. ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టు.
  376. ఇదేంటీ రా తాడెక్కావంటే ఇదిగిదిగో దూడమేత అన్నాట్ట,
  377. ఇద్దరు పెళ్ళాల మొగుడు
  378. ఇన్నాళ్ళూ బ్రతికి ఇంటి వెనుక చచ్చినట్టు.
  379. ఇపా వైపా
  380. ఇబ్లు గుట్టు రోగం రట్టు.
  381. ఇరుగు ఇంగలం పొరుగు మంగలం
  382. ఇరు పోటీల ఇల్లు చెడుతుంది వాత నొప్పుల ఒళ్ళు చెడు తుంది.
  383. ఇరుసున కందెన పెట్టక పరమేశ్వరుడి మండైనా పారదు
  384. ఇఱ్ఱి కొమ్ము అంశు,బఱ్ఱె కొమ్ము అన్నట్టు.
  385. ఇఱ్ఱిని చూసి బఱ్ఱి వాత పెట్టుకున్నట్లు
  386. ఇల్టు వెళ్ళగొడితే విడుపుల శృంగారం, మొగుడు వెళ్ళగా డితే మొత్తల శృంగారం,
  387. ఇల్ణు ఇందు వారం,పొయ్యి బుధవారం.
  388. ఇల్ల నారాయణమ్మ అంటే వెళ్ళు గోవిందా అన్నట్లు.
  389. ఇల్లరికం కన్నా మాలరికం మేలు
  390. ఇల్లరికం వద్దు కొడకా అంటే సన్నాసంవుంటా అన్నట్టు
  391. ఇల్లరికితే పండకవుతుందా? తోరణం కడితే వెళ్ళవుతుందా?
  392. ఇల్లు అలుకగానే పండగైందా
  393. ఇల్లు ఇరకటం ఆలి మరకటం
  394. ఇల్లుకట్టి చూడు పెళ్ళిచేసి చూడు.
  395. ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే ఒళ్ళు కాలి ఒకడేడ్చినట్లు.
  396. ఇల్లు కాలిపోతూంది ఈర్రాజూ అంటే నాదేం పోయింది నరసరాజూ అన్నాట్ట
  397. ఇల్లు గాలుతున్నది అంతే చుట్టముక్కలు కాలుకుంటానన్నట్టు
  398. ఇల్లు, చూసి ఇల్లాలును చూడమన్నారు.
  399. ఇల్లు చూస్తే చాలు ఇల్గాలు శుభవృత్తి తెలుస్తుంది.
  400. ఇల్లు చూస్తే తెలుస్తుంది ఇల్లాలి అందం.
  401. ఇల్లుపీకి పందిరి వేసినట్లు.
  402. ఇల్లే తీరం, వాకిలే వారణాసి, కడువే కైలాసం,
  403. ఇవ్వాళ చస్తే రేపటికి రెండు.
  404. ఇశ్వర్యానికి అంతేలేదు
  405. ఇష్టమయితె ఈపరాలు కష్టమయితే కంపరాలు
  406. ఇష్టమైన వస్తువు ఇంగువతో సమానం.
  407. ఇష్టారాజ్యం భరతుడి పట్టుం.
  408. ఇసక తక్కెడే ఈరక్కా అంటే పేడతక్కెడ పేరక్క అందిట
  409. ఇసుక తక్కెడపేడ తక్కెడ
  410. ఇసుకలో తైలం వుండదు ,బంకలో బంగారం వుండదు.
  411. ఇస్తానన్న వాణ్ణి వస్తానన్న దాన్ని నమ్మరాదు.
  412. ఇస్తినమ్మ వాయనం వుచ్చుకుంటినమ్మ వాయనం అన్నట్లు.
  413. ఇస్తే చెడేది లేదు, చస్తే వచ్చేదీ లేదు.
  414. ఇస్తే పెళ్ళి పోతే పెటాకులు.
  415. ఈ ఇంటికాకి ఆ ఇంటీ మీద వాలదు.
  416. ఈ ఊరి రెడ్డి పొరుగూరికి పారి కాపు,
  417. ఈ ఊళ్ళో పెద్ద లెవరంటే తాళ్ళు, దాత లెవరంకు చాకళ్ళు అన్నట్టు
  418. ఈ కంటికి ఈ రెప్పలడ్డమా.
  419. ఈడు చూచి పిల్ల నివ్వు, పిడి చూచి కొడవలివ్వు.
  420. ఈడ్పు కాళ్ళ వాడికి ఇద్దరు భార్యలు ఒకటి ఈడువ. ఒకటీ ఏడవ.
  421. ఈత చెట్టు ఇల్టూకాదు తాటి చెట్టు తల్లీకాదు.
  422. ఈత చెట్టు కింద నిల్చొని పాలు త్రాగినా కల్లే నంటారు.
  423. ఈత వచ్చిన వాడికి లోతులేదు.
  424. ఈదాడంటే కోదాడన్నట్లు
  425. ఈదిలో ఈరంగం పేటలో పేరంటం
  426. ఈనగాచి నక్కల పాలైనట్లు.
  427. ఈనాడు ఇంట్లో రేపు మంట్లో.
  428. ఈనినపులి.
  429. ఈ నెల వడ్డీ లేదు వచ్చే నెల అనలూలేదు.
  430. ఈరు తీస్తే పేను వచ్చినట్లు.
  431. ఈ వేలుకు ఆ వేలు ఎడం.
  432. ఈశ్వరా ఈశ్వరా ఎన్నాళ్ళూ అంటే, పూజారిని చూడలేదా అన్నాడట
  433. ఉంచుకున్నవాడు మెగుడూకాదు, పెంచుకున్నవాడు కొడుకూ కాదు
  434. ఉచ్చ గుంటలో చేపలు పట్టినట్లు
  435. ఉంటే అమీరు, లేకుంకే పకీరు
  436. ఉంటే ఊరు, పోతే పాడు.
  437. ఉంటే లిక్కి, లేకపోతే కొడవలి
  438. ఉట్టికట్టుకుని ఊరేగు.
  439. ఉట్టి కెక్కలేనమ్మ న్వర్గానికెక్కుతుందా?
  440. ఉట్టిమీద కూడు, ఊరిమీద నిద్ర
  441. ఉండ ఇల్లూ లేదు, పండ మంచమూలేదు
  442. ఉడకకే ఉడకకే ఓ ఉల్లిగడ్డా నీ వెంత ఉడికినా నీ కంపుపోదు.
  443. ఉండడానికి స్థలమిస్తే వండుకోను మంచమడిగాట్ట
  444. ఉడతా భక్తి.
  445. ఉండనిస్తే పండుతుంది ఊడదీస్తే ఎండుతుంది.
  446. ఉత్త చెనికన్నా తాటాకు చెవి మేలు.
  447. ఉత్త ముండకన్నా అత్త ముండ మేలు.
  448. ఉత్తర ఉరిమినా, పాము తరిమి కరిచినా తిరగదు
  449. ఉత్తరకుమార ప్రజ్ఞలు.
  450. ఉత్తరచూసి ఎత్తర గంప
  451. ఉద్యోగం పురుషలక్షణం అదిపోతే అవలక్షణం
  452. ఉద్యోగికి దూరభూమిలేదు
  453. ఉన్న ఊరు కన్నతల్లి లాంటిది.
  454. ఉన్నది గట్టు పోయినది పొట్టు.
  455. ఉన్నది పోదు, లేనిది రాదు.
  456. ఉన్నదీ పోయింది ,ఉంచుకున్నదీ పోయింది.
  457. ఉన్నదే మనిషికి పుష్టి ,తిన్నదే వసరానికి వుష్టి
  458. ఉన్నమాటకు ఉలుకెక్కువ.
  459. ఉన్న మాటంటే ఊరు అచ్చిరాదు.
  460. ఉన్నవాడు ఉన్నవాడికే పెట్టే, లేనివాడూ ఉన్నవాడికే పెట్టే
  461. ఉన్నవాడు ఊరికిపెద్ద ,చచ్చినవాడు కాటికి పెద్ద
  462. ఉపకారానికి పోతే అపకారం వచ్చినట్లు
  463. ఉపాధ్యాయుల వారు ఏం చేస్తున్నారు అంటే రాసిన తప్పులు దిద్దుకుంటున్నారట.
  464. ఉపాయం చెప్పవయ్యా అంటే ఉరితాడు తెచ్చుకో అన్నాట్టా
  465. ఉప్పుతో ముఫ్పై ఆరు ఉంటే ఉత్తముండైనా వండుతుంది
  466. ఉప్పువాడు చెడే, పప్పువాడు చెడే, తమలపాకులవాడు తమాం చెడె
  467. ఉభయ భ్రష్టత్వం, ఉపరి సన్యాసం
  468. ఉమ్మడి బేరం, ఉమ్మడి సేద్యం ఉభయులకూ చేటు
  469. ఉయ్యాల్లో బిడ్డమంచి ఊరంతా వెతికినట్లు
  470. ఉరిమిన మబ్బు కురవక మానదు
  471. ఉరుకు ఉరకమనే వారే కాని కూడా ఉరికేవారు లేరు
  472. ఉరుమురిమి మంగలం మీద పడ్డట్టు
  473. ఉల్లిచేసిన మేలు తల్లి చేయదు
  474. ఉల్లి మల్లీ కాదు, ఉంచుకున్నది వెళ్లామూ కాదు
  475. ఊక దంపుడు కబుర్లు.
  476. ఊరంతా ఉల్లీ, నీవెందుకే తల్లీ.
  477. ఊరంతా నాన్నకు వణికితే, నాన్న అమ్మకు వణీకినట్టు
  478. ఊరందరిది ఒక దోవ,ఉలిపి కట్టెది ఒక దోవ
  479. ఊరిక రారు మహాత్ములు
  480. ఊరికి పాయ్యేవాడికి లేకపోయినా బహిర్భూమికి వెళ్లేవాడికి భత్యం కట్టుమన్నాట్టు.
  481. ఊరికే పెట్టే అమ్మను నీ మెగుడితోపాటు పెట్టమన్నట్టు
  482. ఊరి జబ్బు చాకలి ఎరుగు, ఉద్యోగి జబ్బు బంట్రొతు ఎరుగు
  483. ఊరినిండా అప్పులూ, తలనిండా బొప్పులు
  484. ఊరి ముందరి చేను కాకుల్ల పాలు,
  485. ఊరి ముందరి చేను కాకుల్లపాలు, ఊల్లో వియ్యమ్ము కయ్యముల పాలు
  486. ఊరి ముందరి దాకా వచ్చి వెళ్ళాం! బిడ్డలు ఎట్టున్నారని అడిగాట్ట
  487. ఊరి మొహం గోడలే చెపుతాయి
  488. ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది
  489. ఊర్మిళ నిద్ర.
  490. ఊసరక్షేత్రంలో దూసరి తీగ.
  491. ఊసర క్షేత్రంలో పైరు, నీళ్ళులేని చెరువు క్రింద సేద్యం
  492. ఊసర వెల్లిలా రంగులు మార్చేవాడు.
  493. ఊళ్ళేలే కొమరుడి కన్నా ఉపాదాన మెత్తే పెనిమిటి మేలు
  494. ఊళ్ళో అధికారమైనా ఉండాలి ఊరంచున పొలమైనా ఉండాలి
  495. ఊళ్ళో పెళ్ళైతే కుక్కలకు హడావుడిలాగా
  496. ఊళ్ళో వియ్యం కయ్యముల పాలు.
  497. ౠషి మూలం, నది మూలం, స్త్రీ మూలం విచారించరాదు
  498. ఎంకివెళ్ళి సుబ్బి చావుకు వచ్చిందిట.
  499. ఎక్కడకు పోతావు విధవమ్మా అంటే వెంటనస్తాను పదవమ్మా అన్నదట
  500. ఎక్కడా దిక్కులేక పోతే అక్క మొగుడే దిక్కు
  501. ఎక్కడున్నావే గొంగళి అంటే. వేసిన చోట ఉన్నాను కంబళీ అన్నదట
  502. ఎక్కితే గుర్రపు రౌతు, దిగితే కాలిబంటు
  503. ఎక్కిరించబోయి వెల్లకిల పడ్డాడట
  504. ఎంగిరికి ఎగ్గులేదు, తాగుబోతుకి సిగూలేదు
  505. ఎంగిలి చేత్తోకాకిని కూడా తోలని వాడు భిక్షం పెడతాడా
  506. ఎండాకాలంలో ఏకులు వడికి, వానా కాలంలో వడ్లు దంచినట్లు
  507. ఎండా వానా కలఠిసివస్తే కుక్కలకూ నక్కలకూ వెళ్ళి.
  508. ఎడ్డి, మడ్డి బంగారు కడ్డి.
  509. ఎడ్డెమంటే తెడ్డమన్నట్టు
  510. ఎంత చెట్టుకు అంత గాలి.
  511. ఎంత చేసినా సమకాలం వారు మెచ్చరు కదా
  512. ఎంత దయో దాసులవై
  513. ఎంత పెరిగినా గొర్రెకు బెత్తెడే తోక
  514. ఎంత పొద్దుండగా లేచినా తుమ్మగుంట వద్దనే తెల్లారుతుంది,
  515. ఎంత ప్రాప్తమో అంతే ఫలం
  516. ఎంత మంచి గొల్లవాడైనా వేపకాయంత వెర్రి ఉంటుంది.
  517. ఎంతలావు మొగడైనా ఆడదానికి లోకువే
  518. ఎంతవారలైనా కాంతదానులే
  519. ఎద గొడ్డుకు బెదరుండదు
  520. ఎదట ఉన్నది మాట, ఎదాన పెట్టినది రాత
  521. ఎదుట ఉన్నవాడే పెండ్లి కొడుకు
  522. ఎద్దు ఈనిందంటే కొట్టాన కట్టమన్నాడట
  523. ఎద్దు ఎండకు లాగ, దున్న నీడకు లాగ
  524. ఎద్దు ఏమెరుగురా అటుకుల రుచి గాడిద ఏమెరుగురా గంధపు వొసన
  525. ఎద్దునెక్కినవాడు లింగడు గద్దెనెక్కినవాడు రంగడు
  526. ఎద్దు పుండు కాకిని ముద్దా
  527. ఎనుబోతు మీద వాన కురిసినట్టు.
  528. ఎముక లేని చెయ్యి
  529. ఎరువుల సొమ్ము బదువుల చేటు, తీయ పెట్ట తీపుల చేటు, అందులో ఒకటి పోతే అప్పుల చేటు
  530. ఎలుకకు పిల్లి సాక్ష్యం
  531. ఎలుక తోలు తెచ్చి ఎందాక ఉతికినా. నలుపు నలుపే కాని తెలువు కొదు
  532. ఎవడబ్బ సొమ్ముకురా ఎకెక్కి ఏడ్వడం
  533. ఎవడి పిచ్చి వాడికానందం
  534. ఎవడివల్ల చెడ్డావోయ్ వీరన్న అంటే, నోటి వల్ల చెడ్డానోయ్ పేరన్న అన్నాడట
  535. ఎవడీ కంపు వొడి కింవు.
  536. ఎవడు తవ్వుకున్న గోతిలో వాడే 'షడేతాడు
  537. ఎవరికి వారే యమునా
  538. ఎవరి పాపాన వాళ్ళే పోతారు
  539. ఎవరిపైగుడ్డ వారికి బరువా
  540. ఏ ఎండకా గొడుగు పట్టినట్టు.
  541. ఏగాని ముండకు డబ్బున్నర క్షవరం.
  542. ఏ గూటి చిలక్కు ఆ గూటి పలుకు.
  543. ఏ చెట్టూ లేని చోట ఆముదపు చెట్టే మహావృక్షం.
  544. ఏటి ఈతకు, లంక మేతకు సరి
  545. ఏటిదరిమాకు.
  546. ఏట్లొ పారే నీళ్ళు ఎవరు త్రాగితే నేం
  547. ఏడ్చేదాని మెగుడొస్తే, నా మెగుడొస్తాడు
  548. ఏనుకు మింగిన వేలగ పండు
  549. ఏనుగంత తండ్రి ఉండడం కన్నా, ఎలుకంత తల్లి ఉండడం మేలు
  550. ఏనుగు చచ్చినా బ్రతికినా వెయ్యివరహాలే.
  551. ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు
  552. ఏ పుట్టలో ఏ పామున్నదో
  553. ఏమీలేనమ్మకు ఏడ్పుల శృంగారం, కలిగినమ్మకు కడుపుల శృంగారం
  554. ఏ రాయి అయితేనేం పళ్ళూడగొట్టు కోవడానికి,
  555. ఏరు ఎడామడా ఉండగనే పంచవిప్పి చంకన పోయినట్టు
  556. ఏరు ఎన్ని వంకలు తిరిగినా చివరికి సముద్రం లో పడాల్సిందే
  557. ఏరు దాటి తెప్ప తగలేసినట్టు
  558. ఏరు ముందా ఏరువాక ముందా
  559. ఏరుముందా ఏరువాక ముందా
  560. ఏరుముందా, ఏరువాక ముందా, ఏకాదశి ముందా,పున్నమి ముందా
  561. ఏలడానికి ఊళ్ళులేక పోయినా ఎత్తుకు తినడానికి ఊళ్ళు లేక పోతాయా.
  562. ఏలేవాడి ఎద్దు పోతేనేం , కాసేవాడి కన్ను పోతేనేం
  563. ఒక ఊరి కాపు, మరొక ఊరికి వెట్టి
  564. ఒక కంచాన తిని ఒక మంచాన పడుకునేవారు
  565. ఒక కంట సున్నం ఒక కంట వేన్న పెట్టుకున్నట్టు
  566. ఒక కొడుకు కొడుకూ కాదు, ఒక కన్ను కన్నూ కాదు
  567. ఒక చెంప కొడితే పాలు, మరో చెంప కొడితే నీళ్ళు
  568. ఒక చెయ్యి తడితే చప్పుడౌతుందా
  569. ఒక చేత పసుపు, మ్రోచేత ముసుగు
  570. ఒక చేతి వేళ్ళే ఒకటి గా లేవు
  571. ఒకటి చేయబోతే మరొకటి అయునట్లు
  572. ఒకణ్ణి చూస్తే పెట్టబుద్ది, ఇంకొకణ్ణి చూస్తే మెట్టబుద్ది
  573. ఒకనాటి భోగం, ఆరు నెల్ల రోగం
  574. ఒకనాటు పెళ్ళికి మెగమంతా కాటుక
  575. ఒక నాడు ధారణ, ఒక నాడు పారణ
  576. ఒక పూట తినేవాడు యోగి, రెండు పూటలు తినేవాడు భోగి, మూడు పూటలా తినేవాడు రోగి
  577. ఒకరి కలిమికేడిస్తే ఒక కన్ను పోయింది, తన కలిమికేడిస్తే రెండో కన్ను పోయింది
  578. ఒకరిద్దరిని చంపితే కాని వైద్యుడు కాదు
  579. ఒక వరలో రెండు కత్తులుండవు
  580. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు
  581. ఒక్కొక్క రాయి తీస్తుంటే,కొండైనా తరుగుతుంది
  582. ఒజ్జల వుచ్చకాయ.
  583. ఒల్లని మెగుడికి తలంబ్రాలు పోసినట్టు
  584. ఒళ్ళు ఒంగనమ్మ కాలి మట్టెలకు కందిపోయిందట
  585. ఒళ్ళో గింజలున్నా, వద్ద భార్య ఉన్నా ఊరుకోబుద్దికాదు
  586. ఒళ్ళో పెడుదునా దళ్ళో పెడుదునా అన్నట్ట
  587. ఓంకారం రానివాడు ఒంట్లు గుణించ్నట్లు
  588. ఓటి కుండలో నీళ్ళు పోసినట్టు
  589. ఓడ ఎక్కేదాగా ఓడ మల్లన్న, ఓడ దిగాక బోడి మల్లన్న
  590. ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి
  591. ఓడు ఓడంటే కంచమంతా ఓడన్నట్లు
  592. ఓపలేని అత్తకు ఒంగలేని కోడలు
  593. ఓలి తక్కువని గుడ్డీదాన్ని పెళ్ళాడితే,పొంత కుండలన్నీ పగల కొట్టిందట
  594. ఔనన్నా కాదన్నా అత్తకే అధికారం కాని కోడలికేముంది
  595. ఔషధం కానిది అవనిలో లేదు
  596. కక్కిన కూటికి ఆశపడ్డట్టు.
  597. కంచం అమ్మి మెట్టులు కొన్నట్లు.
  598. కంచం పొత్తేగాని మంచం పొత్తు లేదు.
  599. కంచి గరుడ సేవ.
  600. కంచు మోగినట్టు కనకమ్ము మోగునా.
  601. కంటికి కలక వంటికి పోటు
  602. కంటికి రెప్ప కాలికి చెప్ప.
  603. కట్టన ఇల్లు, పెట్టిన పొయ్యి.
  604. కట్టుకున్న భార్య అయినా చెయ్యాలి,కన్నతల్లి అయినా చెయ్యారి
  605. కట్టుకున్న మొగుడు, పెట్టుకున్న నగలు.
  606. కట్టె వంక పొయ్యి తీరుస్తుంది.
  607. కట్టె వంక పొయ్యి తీరుస్తుంది.
  608. కట్టె వంకర పొయ్యి, కుట్రబుద్ది కాష్టం తీరుస్తాయి.
  609. కంఠ గీత ప్రాణం.
  610. కడచిన దానికి వగచిన లాభమేమిటి?
  611. కడివెడంత గుమ్మడి కాయైనా కత్తిపీటకు. లోకువే.
  612. కడుపా చెరువా ?
  613. కడుపు కాలి ఏడుస్తుంటే మనోవర్తి ఏమిస్తావన్నదట
  614. కడుపు చించుకుంటే కాళ్ళమీద పడుతుంది.
  615. కడుపు నిండిన బేరం.
  616. కడుపు నిండిన వాడికి గారెలు చేదు.
  617. కడుపునింపినవాడు కొడుకు,కడతేర్చిన వాడు కుంక
  618. కడుపులో చల్ల కదల కుండా.
  619. కడుపే కైలాసం, ఇల్లే వైకుంఠం
  620. కడువు కూటికేడిస్తే, కొప్పు పూల కేడ్చిందట
  621. కడువుచించు కుంటే కాళ్ళ మీద పడుతుంది.
  622. కడువుతో ఉన్నమ్మ కనకమానదు ఒండుకున్నమ్మ తినక మానదు
  623. కడువులో లేంది కావలించుకుంటే వస్తుందా?
  624. కతల మారి మొగుడు కమ్మలు చేయిస్తే అప్పుల కూటి మొగుడు అమ్ముకు తిన్నాట్ట.
  625. కతీకితే అతకదు..
  626. కత్తికి ఎదురు లేదు. మాటకు తిరుగులేదు.
  627. కత్తికి మెత్తన, అత్తకు మంచి లేదు.
  628. కత్తిపోటు తప్పేనా, కలం పోటు తప్పదు.
  629. కత్తి మీద సాము.
  630. కథ కంచికి మన మింటికి.
  631. కథకు కాళ్ళు లేవు ముంతకు చెవులు లేవు.
  632. కథలెల్లా వెతలాయె, కావురాలు రెండాయె.
  633. కందకు లేని దురద కత్తిపీటకెందుకు?
  634. కందకు లేని దురద చేమకెందుకు.
  635. కంద చెప్పిన వాడే కవి, పందిని పొడిచిన వాడే బంటు.
  636. కందాల రాజు.
  637. కంది పండితే కరువు తీరుతుందట.
  638. కదిపితే కందిరీగల తుట్టె
  639. కదిలిప్తే గచ్చపొద
  640. కదురాడినన్నాళ్ళు కరువుల్లేవు
  641. కదురుకు ఆరాటం పుటితే ఏరాటానా నిలవదు.
  642. కదురూ కవ్వం ఆడితే కరువే లేదు.
  643. కననిది బిడ్డాకాదు, కట్టంది బట్టాకాదు.
  644. కనుమ నాడు కాకైనా ప్రయాణం చేయదు
  645. కనుముకి కాకర, భోగికి పొట్ల
  646. కన్నతల్లి అంతే కడుపుచూచేది,కొంటె పిల్ల అంటే కన్ను కొట్టేది
  647. కన్నతల్లి కాదన్నా కట్టుకున్నది కాదన్నా బ్రతుకే వ్యర్థం
  648. కన్న తల్లికి కంటతడి, చవతితల్లికి కన్నుకుట్టు
  649. కన్నతల్లి కైనా కమమరుగుండాలి.
  650. కన్నతల్లి తట్టి గమిడిదాటదు.
  651. కన్నతల్లిని కాళ్ళు పట్టి ఈడ్చి, పీనతల్లికి పిండ్యప్రదానం చేసి
  652. కన్నతల్లి బంగారమైనా కంసాలి వదలడు.
  653. కన్నంలో దొరికిన దొంగ గతి
  654. కన్నం వేసిన దొంగకు తేలు కుట్టినట్టు
  655. కన్నాన బోయి కన్నాన వచ్చేరకం
  656. కన్ను ఎర్రబడ్డా, మిన్ను ఎర్రబడ్డా కారక మానదు,
  657. కన్ను చూసి కాటుక పిర్ర చూసి పీట
  658. కన్నె తనం పోయినా, అన్న మాట పోయినా బతుకే భారం
  659. కన్నె సిగ్గు కనడం కోసం.
  660. కన్నేల కన్నేల పోయెనోయి కనక లింగమా అంటే చేసుకున్న కర్మమోయి శంభులింగమా అన్నాట్టు
  661. కప్పల తక్కెడ.
  662. కబంధహస్తం.
  663. కంబళ్ళో తింటూ రోమాలు లెక్కించినట్టు.
  664. కమ్మగుట్టు గడపదాటదు.
  665. కమ్మని, తుమ్మని నమ్మరాదు.
  666. కమ్మరి ఇంట్లో బొగ్గులు దొరకనట్టు
  667. కమ్మలు నప్పేవాడుపైన తాళ్ళుపొడిచే వాడు కింద.
  668. కయ్యానికైనా, వియ్యానికైనా సమ ఉజ్జీ ఉండాలి
  669. కరణం మోసం చేస్తే కొంపలు కూల్తాయి.
  670. కరణానికి తిట్టుదోషం లేదు, చాకలికి ముట్టుదోషం లేదు.
  671. కరణాన్ని, కంసాలిని కాటికి పోయినా నమ్మరాదు.
  672. కరలిపి కొట్టరా కావేటి రంగా.
  673. కరవమంటే కప్పకు కోవం, విడవమంకే పాముకు కోపం.
  674. కరిమింగిన వెలగవండు.
  675. కరువులో అధిక మాసం.
  676. కరువులో అధిక మాసం. లేమిలో అధిక సంతానం
  677. కర్టుడులేని భారతం.
  678. కర్ణుడు లేని భారతం, శొంఠి లేని కషాయం.
  679. కర్మ ఛండాలుడి కంటే జాతి ఛండాలుడు మేలు.
  680. కర్మ తప్పించటం బ్రహ్మతరం కూడా కాదు.
  681. కర్ర ఎవడిదో బర్రె వాడిది
  682. కర్రలేని వాణ్ణి గొర్రైనా కరుస్తుంది
  683. కర్ర విరగకుండా, పాము చావకుండా.
  684. కలకాలం బతికినా కాటికి పోక తప్పదు.
  685. కలగూర గంప.
  686. కలతల మారి కొంప, జగడాల మారి వూరు.
  687. కల నిజమవుతుందా? కాకి కోకిలవుతుందా!
  688. కల ఫలించిందంటే అదృష్టం మనదే
  689. కలబందకు ఎండు, కోడలికి కొత్త లేదు.
  690. కలలో కనిపించింది కోట, ఇలలో దొరికింది గొయ్య
  691. కలలో జరిగింది ఇలలో జరగదు.
  692. కలలో పరమాన్నం ఇలలో గంజినీళ్ళు
  693. కలవారి ఆడపడుచుకు కాకర కాయైనా కానరాదు
  694. కలవారి ఇంటికి కటగొట్టు కోడలు కన్నా, పేదవారింటికి పెద్దకోడలవడం మేలు.
  695. కలహమున్న కొంపలో కల్టుబట్టలుండవు,
  696. కలిగిన నాటి చుట్టాలు, కావాలన్నప్పుడు కనపడరు
  697. కలిగిన వారికి అందరూ చుట్టాలే.
  698. కలిగిన వారి పిల్లకు కాలి చెప్పు అరువా?
  699. కలిమి ఉన్నంత "సేవు బలగం, కండ ఉన్నంతసేపే మిండడు.
  700. కలిమిలేములు కొవడి కుండలు.
  701. కలిమి వస్తే బలం వస్తుంది. కలిమి పోతే బలం పోతుంది.
  702. కలిసివచ్చే కాలానికి నడిచి వచ్చే బిడ్డలు వుడతారు.
  703. కలుపు తీసిన చేను కనుల పండుగ.
  704. కలువు తీయక పోతే పైరుకు చేటు
  705. కలో గంజో దొరికిందే అదృష్టం
  706. కల్పవృక్షం క్రింద గచ్చపొద ఉన్నట్టు.
  707. కల్పవృక్షం క్రింద గచ్చపొద, మంచి గంధం చుట్టూ నాగుపాము.
  708. కల్పవృక్షం పెరట్లో, పాదు వాకిట్లో
  709. కల్లు తాగిన కోతిలాగా
  710. కవితకు మెప్పు, కాంతకు కొప్పు అవసరం,
  711. కవిత నేర్పు యతి కూర్పే చెప్పుతుంది.
  712. కష్టం కూలీది, ఫలితం కామందుది
  713. కష్టపడి ఇల్టుకట్ట్రి, కల్టుతాగి తగుల బెట్టినట్లు.
  714. కష్టపడి సుఖపడమన్నాడు.
  715. కష్టసుఖాలు కావడి కుండలవంటిీవి
  716. కష్టే ఫలి.
  717. కష్టే ఫలి అన్నారు పెద్దలు
  718. కంసారి పెంచిన గుర్రం చక్క పెళ్ళుతిన్నదట
  719. కంసాలి కూడు కాకులు కూడా ముట్టవు
  720. కళ్ళార్చే అమ్మ ఇల్లార్సుతుంది.
  721. కాకి కూసేవి కారుకూతలు, కోకిల కూసేవి కవితలు
  722. కాకి గూటిలో కోకిలలాగా.
  723. కాకి గూట్లోకోకిల పిల్ల రెక్కలు రాగానే ఎగిరిపోతుంది.
  724. కాకిగూట్లో కోయిలగుడ్డు.
  725. కాకిగోల.
  726. కాకి చస్తే కొకులు ఎన్నో ఏడుస్తాయి. కొనివాడు చస్తే ఏడ్చేవాడుండడు
  727. కాకి చావు కనకమ్మ చావు
  728. కాకి తన్నిందంటే కీడు మూడినట్టు
  729. కాకి తన్నిందంటే పేగు కదులుతుంది.
  730. కాకి తెలుపు తోలు తెలుపు ఎక్కడన్నా వుందా?
  731. కాకి పిల్ల కాకికి ముద్దు.
  732. కాకి ముక్కుకు దొండపండులాగా.
  733. కాకిలా తిరిగాడు, హంసలా ఈదాడు.
  734. కాకులను కొట్టి గద్దలకు వేసినట్టు.
  735. కాకులలెక్క కరణాల లెక్క
  736. కాకులు నూరు కూసినా, ఒక కోకిల కూత మేలు
  737. కాకుల్ని కొట్టి గద్దలకు వేసినట్లు.
  738. కాకుల్లో జెముడు కాకి-కూతల్లో కోకిల కూత గొప్ప
  739. కాకుల్ళో. తెలుపు, అల్లుళ్ళలో మంచీ ఉండదు.
  740. కాకై కలకాలం ఉండేకంటే హంసై ఆరునెలలున్నా చాలు.
  741. కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు.
  742. కాగితంతో పులి, ఏకుల్తో ఏనుగు,
  743. కాచిన చెట్టుకే కర్ర దెబ్బలు.
  744. కాడు రమ్మంటుంది. ఊరు పొమ్మంటుంది.
  745. కాంత, కనకాలే కయ్యానికి మూలం.
  746. కాంతాన్ని కనకాన్ని కోరనిదెవరు.
  747. కాదంటే కర్రా బుర్రా నాకు పారేయండి.
  748. కాదు కాదు అంటే నాది నాది అన్నాట్ట.
  749. కాని కాలం లో కాని డబ్బు అప్పు పుట్టదు
  750. కానున్నది కాక మానదు. రానున్నది రాక మానదు,
  751. కాపుల జాతకాలు కరణాల కెరుక.
  752. కామమ్మ మెగుడంటే కాబోలు అనుకున్నా, కాదంటే కావడి కుండలు బయటపెట్టండి.
  753. కామానికి వళ్ళు లేవు, గుడిపేటికి గుణమూ లేదు.
  754. కామిగాక మోక్ష కామిగాడు.
  755. కారణం లేని కార్యం, వూర్ణం లేని బూరె, వీరణం లేని వెళ్ళి ఉండవు.
  756. కారం రాస్తే మంట, వెన్న రాస్తే తంట,
  757. కారికోసం చెప్పులు ఒళ్ళో పెట్టుకోవారి.
  758. కార్తెముందర ఉరిమినా, కార్యం ముందు తొందరపడినా చెడుతుంది.
  759. కార్తెలు మోసం చేస్తే కరువులు వస్తాయి.
  760. కార్యం గదిలో పెళ్ళికొడుకు అలకట!
  761. కార్యం నాడు తలొంచుకుంటే కలకాలం తలెత్తుకు తిరగవచ్చు.
  762. కాలం, కర్మం కలిసి రాకపోతే కమల బాంధవుడికైనా కష్టాలు తప్పవు.
  763. కాలనేమి జపం.
  764. కాలబెట్టి నేల రాచినట్టు.
  765. కాలికి ఆనె, చెంబుకు చిల్లి.
  766. కాలికి చుట్టుకున్న పాము కరవక మానదు.
  767. కాలికి దూరమైతే కంటికి దూరమా.
  768. కాలికి వేస్తే వేలికి వేలికి వేస్తే కాలికి.
  769. కాలితే మచ్చపడుతుంది. కాచితే మెత్తపడుతుంది
  770. కాలి దూరం వేరు కంటి దూరం వేరు
  771. కాలిలో ముల్లు చెవిలో జోరీగ
  772. కాలు కాలిన పిల్లి నోరు గాలిన కుక్క
  773. కాలు కొలిన పిల్లిలాగా.
  774. కాలు చెయ్యి తిన్నగా వున్నంత కాలం మహరాజే
  775. కాలు చేయి ఉన్నంత కాలం కొలం గడుస్తుంది.
  776. కాలు జారితే తీసుకోగలం గాని నోరు జారితే తీసుకోగలమా.
  777. కాలు జారిన పిల్ల బతుక్కు నోరు జారిన పెద్ద బతుకు వ్యర్థం
  778. కాలు తొక్కిన వేళ కంకణం కట్టిన వేళ మంచిది కావాలి,
  779. కాలు పట్టుకొని లాగితే చూరు వట్టుకొని వేళ్ళాడినట్టు.
  780. కాలే కడుపుకు మండే గంజి.
  781. కాలే కడువుకు గంజే పానకం.
  782. కాశికి పోయినా కర్మం తప్పదు.
  783. కాశీకి పోయి గాడిద గుడ్డు తెచ్చినట్లు.
  784. కాశీకి పోయినా శనీశ్వరం వదల్లేదట
  785. కాశీలో కొబ్బరికాయ కాని అన్నట్టు
  786. కాసుకు గతిలేదు. కోటికి కొడి వేశాట్టు.
  787. కాస్త ఓడంటే కంచమంతా ఓడన్నట్లు
  788. కాళిదొసు కవిత్వం కొంత నా వైత్యం కొంత,
  789. కాళ్ళ దగ్గర కొచ్చిన బేరం కాశికి వెళ్ళినా దొరకదు.
  790. కింద పడ్డా పై చేయి నాదే అన్నట్టు.
  791. కీడెంచి మేలెంచ మన్నారు.
  792. కీలు ఎరిగి వాత పెడితే వైద్యం.
  793. కీలెరిగి వాత, వీలెరిగి మాటు.
  794. కుంకాక్షి పెళ్ళికి ఏంకాక్షి ఆశీస్సులు
  795. కుక్కకాటుకు చెప్పు దెబ్బ.
  796. కుక్కకు పెత్తనమిస్తే కుండలు కెలకదా!
  797. కుక్క గోవు కాదు, కుందేలు పురీ కాదు.
  798. కుక్క తెచ్చేవన్నీ బొమికళే.
  799. కుక్క తోక ఎప్పుడూ వంకరే.
  800. కుక్క. తోక పట్టి ఎదురీద మన్నట్టు
  801. కుక్కతోక పట్టి గోదావరీదినట్టు.
  802. కుక్క దాలిగుంట సామెత
  803. కుక్కనడిగితే కుంకుమ పెడుతుందా?
  804. కుక్కని కొడితే బుద్దొస్తుంది. కూూలిని కొడితే బుద్దాస్తుందా
  805. కుక్కను చంపిన పాపం గుడికట్టినా పోదు.
  806. కుక్క పని గాడిద చేస్తే నడ్డి విరిగిందట
  807. కుక్క బదులుగా గాడిద మొరిగిందట.
  808. కుక్క బుద్ధి దాలిగుంటకు తెలుసు
  809. కుక్క మాంసం తినే రకం
  810. కుక్క ముట్టిన కుండ అక్కరకు రాదు.
  811. కుక్క ముట్టె చల్లన, కోతి ముట్టె వెచ్చన
  812. కుక్క మూతి పిందెలు.
  813. కుక్కల నక్కల పెళ్ళికి కుందేలు మంత్రాలు చదివిందట
  814. కుక్కలు చింపిన విస్తరిలాగా.
  815. కుక్క సింహం కాదు, కుందేలు తోడేలు గాదు
  816. కుంచాలమ్మ కూడబెడితే మంచాలమ్మ మాయు దంట
  817. కుచేల సంతానం.
  818. కుంజర యూధమ్ము దోమ కుత్తుక జొచ్చినట్లు
  819. కుంటకట్టమీద కుర్చీ వేస్తే కూచొని లేచేసరికి కట్ట మింగింది.
  820. కుంటికులానం ఇంటికి మోసం.
  821. కుడవబోతూ కుర్రాకు రుచి అడిగినట్టు.
  822. కుడిచి కూర్చన్నమ్మ కూతురి పిర్రలు తెగ చెక్కిందట.
  823. కుడిచేత చేసిన దానం ఎడమచెయ్యి ఎరగరాదు.
  824. కుడితే తేలు కుట్టుకుంటే కుమ్మరి పురుగు.
  825. కుడువబోతూ కూరాకు రుచి అడిగినట్లు.
  826. కుందనపు బొమ్మరూపు, కాలభైరవుడుబుద్ది.
  827. కుదిరింది వైద్యం, మానింది మందు.
  828. కుందేటి కొమ్ము సాధించినట్లు.
  829. కుంభకర్ణుడి నిద్ర.
  830. కుంభకోణం
  831. కుమ్మరి, కంసాలి పాలికి వేసిన పొలం పంటలాగా
  832. కుమ్మరికి కుండ కరువు, సాలెకు బట్టు కరువు
  833. కుమ్మరికి కుండల కొదవన్నట్లు
  834. కురిస్తే వానై కురవాల, వేస్తే పైరు వేయాల
  835. కుర్రకాకికి ఏమి తెలుసురా ఉండేలు దేబ్బ.
  836. కులం కట్టు కలం పట్టు
  837. కులం కులం అని కూడు పోగొట్టు కుండే కులం పిలిచి కూడు పెట్టలేదట.
  838. కులం గుణంలేని రంభకన్నా, కులం వున్న కోతిమేలు.
  839. కులట బిడ్డ కొడుకవుతాడా, మెరుపుతీగ దీపమవుతుందా.
  840. కులం తక్కువని కూడెట్టనన్నారట,
  841. కులం తప్పిననాడు బంతికి ముందు కూరగాయలవాడు సంతకు ముందు
  842. కులమింటి కోతైనా మేలు.
  843. కులమెరిగి చుట్టుం, స్టలమెరిగి వాసం.
  844. కులం లేని వాడికి గుణం లేని వాడికి పిలిచి పిల్లనిస్తారా
  845. కుల విద్యకు సాటిలేదు గువ్వలచెన్నా.
  846. కులికేది కోడలు, అరిచేది అత్త
  847. కూచమ్మ కూడ బెట్టింది. మాచమ్మ మాయం చేసింది
  848. కూచిపూడి కుక్క మొరిగినా సంగితమే.
  849. కూటికి తక్కువైనా కులానికి తక్కువా.
  850. కూటికి లోకువయితే, కులానికి లోకువా
  851. కూటికోసం కోటి విద్యలు.
  852. కూడిందమ్మ గుణం, కుదిరిందమ్మా పెళ్ళి
  853. కూతురు మీద ప్రేమ కోడలి మీద ఉంటుందా?
  854. కూనలు కూటికేకేడుస్తుంటే, అవ్వరంకు మొగుడి కేడ్చిందట.
  855. కూపస్టమండూకం.
  856. కూరకు తాలింప్పు గుడ్డకు జాడింపు.
  857. కూరిమి కల దినములలో నేరము లెన్నడు కలుగనేరవు
  858. కూర్చుంటే లేవలేడు, కూటి కుండ దించలేడు, వాడు కొట్టొస్తాడే నాకు నవ్వొస్తాదే
  859. కూర్చొన్న వాడికి కుప్పలు తెలియని వాడికి తిప్పలు.
  860. కూర్చొవి తింటుంళే కొండైనా కరిగిపోతుంది.
  861. కూలి ఎంతైనా కూడుకాదు.
  862. కూలి చేస్తే గడవంది కూర్చుంటే గడుస్తుందా
  863. కూసుముండ నోరు కుట్టు పెట్టినా నిలవదు
  864. కూసే గాడిద వచ్చి మేసేగాడిదను చెడగొట్టందట.
  865. కృత్తికలో విత్తి,తే, కుత్తుకలు నిండవు.
  866. కృష్ణాస్నానానికి కొండుభొట్లు ఆజ్ఞా.
  867. కొకమ్మది కాకి బలగం, కోటయ్యది కోతి బలగం
  868. కొక్కిరాయి కొక్కిరాయి ఎందుకు పుట్టావంటే చక్కని వాళ్ళను ఎక్కిరించడానికి అన్నదట
  869. కొంగకు ఒక చెరువు లేదు, కోమటికి ఒక ఊరూ లేదు.
  870. కొంగ జపం చేపల కోసమే.
  871. కొంగు తగిలితే చాలు, కోటి వరహాలు.
  872. కొంగు తడిస్తే చలిగాలి, కోకంతా తడిస్తే చలేమిటి?
  873. కొచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు..
  874. కొట్టినా వంగని కొడుకు, తిప్పినా తిరగని మీసం వ్యర్హం.
  875. కొండ అద్ద మందు కొంచమై ఉండదా.
  876. కొండ కట్టెలు, కోనేటి నీళ్ళు మోసినట్టు.
  877. కొండ కదలదు, కోననీరు నిలవదు.
  878. కొండకు వెంట్రుక కడితే వస్తే కొండ వస్తుంది, పోతే వెంట్రుక పోతుంది,
  879. కొండంత దేవుడికి కొండత పత్రి పెట్టగలమా.
  880. కొండంత మొగుడు పోగా పిడికెడు బొచ్చుకేడ్చిందట
  881. కొండనాలికకు మందువేస్తే ఉన్ననాలిక ఊడిందట.
  882. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు.
  883. కొండ మంగలాడు గొరిగినట్టు.
  884. కొండ మంగలి క్షవరం.
  885. కొండమీద గోలేమిటంటే కోమట్లు రహస్యాలనాట్ట.
  886. కొండలా వచ్చి మంచులా తేలినట్టు,
  887. కొండలు మింగేవాడికి గోపురాలడ్డమా
  888. కొండవీటి చాంతాడు.
  889. కొండ వెనక అరువు లేంటి అంటే కోమట్లు రహస్యము అన్నాట్టు.
  890. కొడుకు మనవాడై నా కోడలు మనదవుతుందా.
  891. కొడుకు మిన్న కోడలు సన్న
  892. కొడుకు ముద్దు, కోడలు మొద్దు.
  893. కొడుకుల్నికంటానత్తమ్మా అంటే వద్దంటానా కోడలమ్మా అందట.
  894. కొత్త అప్పుకు పోతే పాత అప్పు వైన పడిందట.
  895. కొత్త ఆవకాయ, కొత్త వెళ్ళాము రుచి.
  896. కొత్త ఆవకాయ మోజు, కొత్త పెళ్ళాం మోజు.
  897. కొత్త ఒక వింత పాత ఒక రోత.
  898. కొత్తగా సిరివస్తే, అర్హరాత్రి గొడుగు పట్టుమన్నాట్టు.
  899. కొత్త బిచ్చగాడు పాద్దెరగడు.
  900. కొత్త వైద్యుడి కన్నా పాతరోగి మేలు.
  901. కొత్త శ్రీమంతుణ్ణోయి బంగారు కత్తితో బరుకు అన్నాట్ట.
  902. కొత్తొక వింత పాతొక రోత.
  903. కొన్నది వంకాయ, కొసిరేది గుమ్మడికాయ.
  904. కొన్నాళ్ళు చీకటి కొన్నాళ్ళు వెన్నెల.
  905. కొంప అంటుకుపోతుంటే నీళ్ళ బాన నిప్పు దగ్గర వెట్టిందట.
  906. కొంప ఏకుతావురాసుపుత్రా అంటే సందేహమెందుకు నాన్న అన్నాట్ట
  907. కొంప కాలుతోందిరా అంటే నీళ్ళు కాచుకుందాం అన్నాట్ట
  908. కొంప తగలడుతున్నది తమ్ముడూ అంటే చలికొచుకుందాం అన్నాట్ట.
  909. కొంప తీస్తానా రామన్నా అంటే అందుకు సందేహమా అన్నాట్టా
  910. కొప్పు ఉన్నామె ఎటు తిప్పినా అందమే.
  911. కొప్పులేని సతికి పిలకలేని పంతులు
  912. కొప్పు వుంటేనేగా పూలు పెట్టుకునేది.
  913. కొమ్ములు చూచి బేరమాడినట్లు.
  914. కొయ్యరా కొయ్యరా పోరిగా అంతే టంగుటూరి మిరియాలు తాటికాయంత అన్నట్టు
  915. కొరివితో తల గోక్కున్నట్లు
  916. కో అంటే కోటిమంది.
  917. కోటలో పాగా వేసినట్టు.
  918. కోటికి పడగెత్తిన భోగం కొరివి కాలిన రోగం సమానం,
  919. కోటి దండాలు పెట్టొచ్చు కోరిక తీరితే
  920. కోటి మొక్కినా మొగుడి బుద్ది మారలేదట
  921. కోడరికి కొడుకు ముద్దు, అత్తకి అల్లుడు ముద్దు
  922. కోడలా కోడలా నీభోగ మెన్నాళ్లే అంటు మా అత్తీ మాల పల్లికి పోయొచ్చిందాకా.
  923. కోడలికి బుద్ది చెప్పి ఆత్త రంకు పోయిందట.
  924. కోడలు కొట్టిన కుండ కొత్త కుండ, అత్త కొట్టిన కుండ అడుగోటి కుండ.
  925. కోడలు కొడుకును కంటానంటే వద్దనే అత్త ఉంటుందా!
  926. కోడల్ని కొట్టినవాడు అత్తని కొట్టలేడా?
  927. కోడి, కుంపటే లేకపోతే తెల్లవారదా?
  928. కోడిగుడ్డంత బంగారం లేనివాడున్నాడా?
  929. కోతికి కొబ్బరి కాయ దొరికినట్టు
  930. కోతికి వుండైతే గోకా నాకా..
  931. కోతి కోతీ నీ పిల్లలెందరు అంటే ఆకాశంలో చుక్కలన్నీ నాపిల్లలే అందట
  932. కోతిపుండు బ్రహ్మరాక్షసి, నాలిముచ్చు వుండు రంపరాక్షసి.
  933. కోమటికి లేమి కంసాలికి కలిమి ఉండదు.
  934. కోమటి సాక్ష్యం,
  935. కోరి పిల్ల నిస్తామంకే కులం తక్కువ అన్నాట్ట.
  936. కోర్టుకెక్కి ఓడినవాడు కోర్టులో ఏడిస్తే, గెలిచినవాడు ఇంటికొచ్చి ఏడ్చాట్టా.
  937. కోర్టు కెక్కిన వాళ్ళు ఒకడు ఆవుకొమ్మును పట్టుకుంటే ఇంకొకడు తోక పట్టుకుంటే మధ్య వకీలు పొదుగు దగ్గర కూర్చున్నాట్ట.
  938. కోల ఆడితే కోతి ఆడుతుంది.
  939. కౌగిలించుకుంటే (ప్రియురాలు, కసిరి కొడితే కిర్రాలు.
  940. క్రింద పడ్డా వై చెయ్యి అన్నట్టు.
  941. క్షణం చిత్తం క్షణం మాయ అన్నట్టు.
  942. క్షవరం చేస్తే మంగలి తిరుక్షవరంచేస్తే వెంగలి.
  943. క్షీరసాగరంలో శేషావతారం, లవణసొగరంలో మత్స్యావతారం
  944. క్షేత్రమెరిగి విత్తనం పాత్రమెరిగి దానం.
  945. క్షేత్రయ్యలో వైరాగ్యం లేదు, సిద్దేంద్రుడులో శృంగారంలేదు.
  946. క్షేత్రయ్యవదం గోపాలుడికిష్టం త్యాగయ్యగేతం శ్రీరాముడి కిష్టం
  947. క్షేమంగా పోయి లాభంగా రమ్మన్నట్టు.
  948. ఖానా నహీ ఎల్లీకి బులావ్‌.
  949. గంగకు ఇద్దరి మేలు, అద్దరి కీడునుంగలదే.
  950. గంగకు, సొంగకు, ఒంగకు తప్పులేదు.
  951. గంగగోవు పాలు గంటెడైనను చాలు కడివిడైనను ఏమి ఖరము పాలు
  952. గంగలో అస్థికలు, గయలో పిండం.
  953. గంగలో మునిగినా కాకి హంస అవుతుందా.
  954. గంగ స్నానం తుంగా పాశం.
  955. గచ్చ పొదలాగా
  956. గచ్చపొదలాగా గలగలలాడే రకం.
  957. గజం మిధ్య, పలాయనం మిధ్య అన్నట్టు.
  958. గంజాయి వనంలో తులసిమొక్క లాగా
  959. గంజి తాగినా లంజ కావాలన్నాట్టు
  960. గంజిలోకి ఉప్పులేదు మావా అంటే పాలల్లోకి పంచదార తెమ్మన్నాట్టు.
  961. గంజిలోకి ఉప్పేలేకుంకు పాలల్లోకి పంచదార కావాలన్నాట్టు.
  962. గజ్జి ఉన్నవాడికి లజ్జ ఉండనట్లు
  963. గట్టిని విడిచి పొట్టుకు పోరాడినట్లు
  964. గండం గడిచి పిండం బయట పడినట్టు
  965. గడించే దొకడు, గుణించే దొకడు
  966. గంతకు తగిన బొంత.
  967. గతజల సేతు బంధనం.
  968. గంతా బొంతా కలిసి గాడిద మోతైనట్టు.
  969. గతించిన దానికి చింతించిన ఏల
  970. గతిలేనమ్మకు గంజే పానకం
  971. గతిలేని వాడికి. మతిలేని వెళ్ళాం.
  972. గద్దెకు పోతే సుద్దులకు తక్కువే.
  973. గంధపు పొడి పోసినా గాడిద గాడిదే
  974. గయ్యాళి గచ్చపొద ఒకటే.
  975. గరుడాయ లెస్స అంటే శేషాయలెస్ప అన్నాట్ట.
  976. గర్బాదానంనాటి కబుర్లు అంఖణాలలో తలచుకున్నట్లు,
  977. గాజుల బేరం భోజనానికి నరి.
  978. గాడి తప్పిన బండి లాగా
  979. గాడితప్పిన బండి వూబిలో దిగిందట.
  980. గాడిదకు గడ్డి ఆవుకు కుడితి,
  981. గాడిదకు గడ్డివేసి ఆవును పాలిమ్మన్నట్లు
  982. గాడిదకేం తెలుసు గంధపు పొడి వాసన.
  983. గాడిద గుడ్డు గరుడ స్తంభం
  984. గాడిద గుద్దు వెడుతుందా? గద్ద పిల్లని కంటుందా?
  985. గాడిద పిల్ల కోమలం
  986. గాడిద పుండుకు బూడిద మందు
  987. గాడిద సంగీతం, ఒంటె అందం.
  988. గాఢాలింగన సౌఖ్యం, ప్రౌఢాంగన ఎరుగుగాని బాల ఏమెరుగు?
  989. గాదెక్రింద పంది కొక్కులాగా
  990. గాదెలో గింజలు గాదెలో ఉండాలి బిడ్డలు మాత్రం దుడ్డు ల్లాగొ ఉండాలి.
  991. గానుగలో చెయ్యి పెట్టు పెరుమాళ్ళు కృప అన్నాట్ట.
  992. గాను గెద్దులాగా
  993. గాలికి పోయిన పేలపిండి రామార్పణమన్నట్టు
  994. గాలికి పోయే కంపను కాలికి తగిలించుకున్నట్లు
  995. గాలికి వుట్టి ధూళికి పెరిగినట్టు.
  996. గాలిని మాట కట్టువచ్చుగాని గయ్యాళి నోరు కట్టులేము.
  997. గాలిపాటు,కలిమితేట
  998. గాలి మేడలు కట్టినట్లు
  999. గాలిలో దీపం పెట్టి దేవుడా నీ మహిమన్నట్లు
  1000. గాలిలో మాటరాసాడు నీటిలో మూటకట్టాడు.
  1001. గిలాశాసనం, ఫలాపాదకం.
  1002. గుంట ఓనమాలు.
  1003. గుట్టు చప్పుడు కాకుండా.
  1004. గుడ గుడ శబ్దం కుండకు నష్టం.
  1005. గుడిని మింగేవాడు గుడిని, గోపురాన్ని, ధ్వజస్తంభాన్ని మింగేవాడికి తక్కువ.
  1006. గుడిపూడి జంగాలు.
  1007. గుడి మింగేవాడికి గుళ్ళో లింగ మోలెఖ్టా.
  1008. గుడిలో దేవుడికన్నా గుడి పూజారి ముఖ్యం.
  1009. గుడెద్దు చేలో పడ్డట్లు.
  1010. గుండెల మీద కుంపటి.
  1011. గుడ్డకు జాడింపు, కూరకు తాలింపు ,కోడలికి సాధింవు,లేకపోతే ఇంపులేదు.
  1012. గుడ్డికన్నా మెల్ల మేలు.
  1013. గుడ్డి కన్ను తెరిచినా ఒకటే మూసినా
  1014. గుడ్డెద్దు చేలో పడ్డట్టు
  1015. గుడ్డొచ్చి పిల్ల నెక్కిరించినట్టు.
  1016. గుండ్లు తేలి బెండ్డు మునిగినట్టు.
  1017. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్న ట్లు.
  1018. గురిగింజ ముడ్డిక్రింద నలు పెరగదు.
  1019. గురువుకు మించిన శిష్యుడు.
  1020. గురువులేని విద్య గుడ్డి విద్య.
  1021. గువ్వ గూడెక్కితే రాజు మేడెక్కెడంట
  1022. గువ్వ గూడెక్కె, అవ్వ మంచమెక్కె,
  1023. గుళ్ళో దేవుడికి నైవేద్యం లేకున్నా పూజారి పులిహోర కేడ్చాడట
  1024. గూటిలోని రామచిలుక.
  1025. గొంగట్లో అన్నం తింటూ వెంట్రుక లేరుకున్నట్లు
  1026. గొడ్డుకొక దెబ్బ, మనిషికొక మాట.
  1027. గొడ్డొచ్చినవేళ బిడ్డొచ్చిన వేళ.
  1028. గొడ్రాలికేం తెలుసు బిడ్డనొప్పి.
  1029. గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టు.
  1030. గొరెకు బెత్తెడే తోక.
  1031. గొరెల గోత్రాలు గొల్లల గోత్రాలు తోడేళ్లు చూస్తాయి.
  1032. గొర్రె కసాయివాణ్ణే నమ్ముతుంది.
  1033. గొల్ల నుద్దులు, పిల్ల ముద్దులు.
  1034. గొల్లల గోత్రాలు గొర్రెలకెరుక, గొర్రెల గోత్రాలు గొల్లల కెరుక.
  1035. గొళ్ళెంలేని తలుపు కళ్లెం లేని గుర్రం.
  1036. గోకుడుకు గీకుడే మందు.
  1037. గోచికి పెద్ద, అంగవ,స్త్రానికి చిన్న.
  1038. గోచి పాతకు మించిన దరిద్రం లేదు.
  1039. గోచిపాతరాయుడు దొంగలకు మిండడు.
  1040. గోడపెట్టు చెంప పెట్టు.
  1041. గోడమీది పిల్లి వాటం.
  1042. గోప్రదక్షణ భూ ప్రదక్షణ మంద ఫలమిచ్చినట్టు.
  1043. గోముఇఖ వ్యాఘ్రం,
  1044. గోరంత దీపం కొండంత వెలుగు.
  1045. గోరింతలు కొండంతలు చేసినట్లు.
  1046. గోరీ దగ్గర వెళ్ళి గోడ పక్క గర్భాదానం.
  1047. గోరుచుట్టు పై రోకటి పోటు.
  1048. గోవులను కోసి చెప్పులను దానం చేసినట్టు.
  1049. గోవు లేదురా గోపన్నా అంటే గోదారిలో ఉన్నాయి పాపన్నా
  1050. గోవులేని ఊళ్ళో గొడ్డు గేదే శ్రీమహాలక్ష్మీ.
  1051. గౌతముడి గోవు.
  1052. గ్రాసం లేని కొలువు. రసం లేని కావ్యం.
  1053. గ్రాసంలేని బంటుకు రోశం ఎక్కువ
  1054. ఘంటాకర్ణుడికి అష్టాక్షరి ఉపదేశం చేయబోయినట్టు.
  1055. ఘటాలెన్నైనా గగన మొకటే.
  1056. ఘడియకు హాజీ ఘడియకు ఫాజీ
  1057. ఘడియ తీరుబాటు లేదు, దమ్మిడీ ఆదాయం లేదు.
  1058. ఘోటక బ్రహ్మచారి
  1059. చంక ఎక్కిన పిల్ల చచ్చినా దిగదు.
  1060. చంకన పిల్ల కడుపులో పిల్ల.
  1061. చంక నెత్తుకుంటే ముద్దు, నెత్తినెత్తుకుంటే నడమంత్రం.
  1062. చంకలో పిల్ల నుంచుకొని నంతంతా వెతికి నట్టు.
  1063. చక్కగా కూకోరా చాకలి నాయుడా, అంటే విన్నావటోయ్ ఈడగ నాయుడా మంగలి నాయుడి సరసమన్నాట్టు.
  1064. చక్కదనాలకు లొట్టి పిట్టు, సంగీతానికి గాడీద
  1065. చక్కనమ్మ చిక్కి నా అందమే.
  1066. చక్కనమ్మ చిక్కినా చక్కనయ్య సొక్కిన అందం చందం.
  1067. చక్రవర్తి చేస్తే శృంగారం,అదే చాకలి చేస్తే వ్యభిచారం.
  1068. చచ్చిం తర్వాత తెలుస్తుంది శెట్టి చేసిన ధర్మం.
  1069. చచ్చిం తర్వాత తెలుస్తుంది శెట్టి బండారం.
  1070. చచ్చిన వాడి కండ్లు పత్తి కాయలంత.
  1071. చచ్చినవాడి కళ్ళు చారెడేసి అన్నారట.
  1072. చచ్చినవాడికి పిండివంటలు, బతికినవాడికి బండెడు అప్పులు.
  1073. చచ్చిన వాడు ఏడ్చినా రాడు.
  1074. చచ్చినాడి అందం బతికినోడి బంధం
  1075. చచ్చే కాలానికి సత్యభామ వేషం వేసినట్టు.
  1076. చచ్చే కాలానికి సమర్త కట్నాలు.
  1077. చచ్చేటప్పడు సంధి మంత్రం.
  1078. చచ్చేటప్పుడు నారాయణా అనమంటే సీసా అన్నట్టు.
  1079. చచ్చేటప్పుడు శంభో శంకరా అంటే
  1080. చచ్చేటప్పుడు సంధ్య మంత్రమా?
  1081. చచ్చేదాకా బ్రతికితే వెళ్ళి చేస్తానన్నాట్ట.
  1082. చచ్చేవాడి పెళ్ళికి వచ్చినంత కట్నం.
  1083. చదవక ముందు కాకర కొయ చదివిన తర్వాత కీకర కాయ.
  1084. చదవేస్తే ఉన్నమతి పోయినట్టు.
  1085. చదిచేది రామాయణం, పడగొట్టేది దేవాలయం.
  1086. చదువు కంటే తెలివి - చాకిరేవుకు బానకి తెలుసు
  1087. చదువురాని మొద్దు, కదల లేని ఎద్దు.
  1088. చదువూలేదు, సంధ్యాలేదు, సంతానం మాత్రం మెండు.
  1089. చద్దామని చద్ది అన్నం తింటు చల్లగా నిద్ర వచ్చిందట.
  1090. చద్దికూడు తిన్నమ్మ మొగుడి ఆకలి ఎరుగదు.
  1091. చంద్రుడికో నూలు పోగు
  1092. చంద్రుణ్ణి చూసి కుక్కలు మొరెగినట్లు.
  1093. చనువు చేసిన ఆలు చంక నెక్కుతుంది.
  1094. చన్నీళ్ళకు వేళ్లీళ్ళు తోడు.
  1095. చన్ను కుడిచి రొమ్ము గుద్దినట్టు.
  1096. చల్లకుండకు చంటి బిడ్డకు చాటుండాలి.
  1097. చల్లకొచ్చి ముంత దాచట మెందుకు
  1098. చల్లా చేయి గొల్లాభామా, ముడ్డీ తిప్పూ ముసలిభామ.
  1099. చవి ఎరిగిన కుక్క చావ గొట్టినా పోదు.
  1100. చస్తే ఒక ఏడుపు బతికితే బతుకంతా ఏడుపు.
  1101. చాకరి కొత్త మంగలి పాత.
  1102. చాకలి అత్త, మంగలి మామ,కొడుకు సాలెవాడైతేనేం,సాతానోడై తేనేం.
  1103. చాకలిది సందెరుగదుు మాలది మంచమెరుగదు.
  1104. చాకలి, మంగలి పొత్తు ఇంటికి రాదు విత్తు.
  1105. చాకిరేవుకి వెనకపడింది. బంతి కూటికి ఏడిసింది.
  1106. చాదస్తం మొగుడు చెపితే వినడు, చెప్పకుంకే కరుస్తాడు.
  1107. చాపమీద జరిగింది సరసం, పస్టైమంచంమీద జరిగింది ప్రణయం.
  1108. చాప సరసంతో సాతాని దంపతులు తెల్లారి వున్నట్టు.
  1109. చాబెడు తిని చెడ్డాడు, వాకిలి దాటి పడ్డాడు.
  1110. చాలువై చాలు దున్నితే చచ్చు చేనైనా పండుతుంది.
  1111. చావుకన్నా గండంలేదు, గోచిపాత కన్నా దరిద్రం లేదు.
  1112. చావు కబురు చల్లగా చెప్పాడు.
  1113. చావు తప్పి కన్ను లొట్ట బోయినట్టు.
  1114. చావుదలకు లావు దుఃఖం
  1115. చావృకు పెడితే గాని లంఖణాలకు రాదు.
  1116. చిటికి ప్రాణం వ్రాలు.
  1117. చింత చచ్చినా పులుపు చావదు.
  1118. చింతచెట్టుకు చిగురొచ్చింది. చిన్నదానికి పొగరొచ్చింది.
  1119. చిత్త కార్తెలో కుక్కలాగా.
  1120. చిత్త జల్లు స్వాతి వాన
  1121. చిత్తడి చేల చినుకులు. చిన్నదాని చిందులు.
  1122. చిత్తలో చల్లితే చిత్తుగా పండుతుంది.
  1123. చిత్తలో తొలకరైతే తట్ట తగలెయ్యాలి
  1124. చిత్తం శివుని మీద, భక్తి చెప్పుల మీద.
  1125. చిదంబర రహస్యం.
  1126. చిదంబర రహస్యం ఎవరికి తెలుస్తుంది?
  1127. చిన్న ఇంట్లో పెద్ద కాపురం.
  1128. చిన్న ఇల్లు కట్టుకున్నా పెద్ద కాపురం చెయ్యాలి.
  1129. చిన్నక్క చిలక, పెద్దక్క గిలక, చూస్తే చుక్క, రేగితే కుక్క.
  1130. చిన్నత్త చిన్న పిశాచి పెద్దత్త పెద్ద పిశాచి,
  1131. చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టాలి.
  1132. చిన్నవాడు తింటే చిరుతిండి, అదే పెద్ద వాళ్ళు తింటే ఫలహారం.
  1133. చిన్ని నా పొట్టకు శ్రీరామరక్ష.
  1134. చిలక చిలకా పేరు సెప్పు అంటే కీ కీ అందంట.
  1135. చిలక ముక్కుకు దొండ పండు.
  1136. చిలకల కొలిక్కి సిగ్గులేదు, చిర్రె త్తిందానికి ఎగ్గులేదు.
  1137. చిలికి చిలికి గాలి వాన అయినట్టు.
  1138. చిలుము వదిలితే గాని ఛిద్ర మొదలదు.
  1139. చిల్లర కొట్టు శ్రీమహోలక్త్మీ అన్నట్టు.
  1140. చిల్లర శ్రీ మహాలక్ష్మి.
  1141. చిల్లి కాదు, తూటు అన్నాట్ట.
  1142. చీకటి కొన్నాళ్ళు, వెన్నెల కొన్నాళ్ళు.
  1143. చీకటి రహస్యం, వెన్నెల్లో బయట పడింది.
  1144. చీకట్లో చిందులాట.
  1145. చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరవైనయట్టు.
  1146. చీర సింగారించేటప్పటికి పట్నం కొల్ల బోయిందట.
  1147. చీర సింగారించేసరికి ఊరు మాటు మడుగుతుంది.
  1148. చుక్కెదురు.
  1149. చుట్టం మీద తీపా బియ్యం మీద తీపా..
  1150. చుట్టమై చూడవస్తే దయ్యమై పట్టుకున్నాట్టు.
  1151. చుట్టుంగదా అని చూడబోతే దయ్యమై పట్టుకుందట.
  1152. చూచిగాని తాగకూడదు, చదివి గాని సంతకం వెట్టగూడదు.
  1153. చూచి రమ్మంకే కాల్చి నచ్చినట్టు.
  1154. చూడ చుట్టము మొక్క దైవము లేదు.
  1155. చూపితే మానం పోయె, చూపక పోతే ప్రాణం పోయె.
  1156. చూసి మురుసుకుంది చెప్పి ఏడ్చుకుంది.
  1157. చూస్తే నీది, చూడకుంటే నాది.
  1158. చెట్టు చెడే కాలానికి కుక్కమూతి పిందెలు పుడతాయి.
  1159. చెట్టు నాటిన వాడు నీళ్ళుపోయడా.
  1160. చెట్టును బట్టి కాయ.
  1161. చెట్టును బట్టి కాయ చేనును బట్టి పంట.
  1162. చెట్టు పేరు చెప్పి కాయలమ్ము కున్నట్లు.
  1163. చెట్టు ముందా విత్తు ముందా అన్నట్లు.
  1164. చెట్టై వంగనిది మానై వంగుతుందా,
  1165. చెడిపోయి చెన్నపట్నం చేరమన్నాట్టు.
  1166. చెడిపోయి స్నేహితుడింటికి వెళ్ళొచ్చు గాని చెల్లెరింటికే వెళ్ళకూడదు.
  1167. చెడిబతికిన వాడి చెంపలు చూడు, బతికి చెడిన వాడి బట్టలు చూడు.
  1168. చెడ్డాపడ్డా చేబ్రోలే(శ్రికాకుళమే) గతి.
  1169. చెప్పడం సులభం చేయడం కష్టం.
  1170. చెప్పుక్రింది తేలు లాగా.
  1171. చెప్పుడు మాటలు చేటు.
  1172. చెప్పుడు మాటలు చేటు, చక్కని మాటలు ఘాటు.
  1173. చెప్పుతో కొట్టి శఠగోపం పెట్టినట్టు.
  1174. చెప్పుతో రాస్తే గాని ధనియాలు జాతి మొలవదు
  1175. చెప్పులోని రాయి, చెవిలోని జోరీగ, ఇంటిలోని పోరు ఇంతింత కాదయా.
  1176. చెప్పే వాడికి సిగ్గు లేకపోతే వినే వాడికైనా వివేకముండొద్దా.
  1177. చెప్పేవానికి సిగ్గులేదు, వినేవాడికి ఎగ్గులేదు.
  1178. చెయ్యి తిరగ చేసినా చాటనిండా పెట్టరు.
  1179. చెయ్యి దాచుకోగలంగాని కులం దాచుకోగలమా.
  1180. చెరపకురా చెడేవు.
  1181. చెరుకా బెల్లం పెట్టమంటే పెడుతుందా?
  1182. చెరుకు తీపి వెన్ను ఎండితే పోతుంది.
  1183. చెరుకు పిప్పికి చీమలు మూగినట్టు.
  1184. చెరువుకు చేరువగాను చుట్టాలకు దూరంగాను ఉండాలి.
  1185. చెరువు నిండితే కప్పలు చేరతాయి.
  1186. చెరువు మీద అలిగితే ఎవరికి నష్టం?
  1187. చెరువు మీద అలిగి ముడ్డి కడుకో గాకుండా పోయినట్టు.
  1188. చెలిమితో చేదు తినిసించవచ్చుగాని, బలిమితో పాలు తాగించలేము.
  1189. చెల్లని కాసుకు గీత లెక్కువ.
  1190. చెవి కోసిన మేక లాగా.
  1191. చెవిటి వాడి ముందు శంఖమూదినట్టు.
  1192. చెవి దగ్గర జోరీగలాగా.
  1193. చెవిలో జోరిగా, కాలిలో ముల్లు,
  1194. చెవుడు చెవుడంటు తవుడు తవుడన్నాట్టు.
  1195. చెవుల పిల్లి ఎదురైతే చేటు వస్తుంది.
  1196. చేట భారతం.
  1197. చేటు కాలానికి చెడ్డ బుద్దులు.
  1198. చేత కానమ్మకు చేష్టలు మెండు, చెల్లని రూకకు గీతలు మెండు.
  1199. చేతగానమ్మకు శౌర్య మెక్కువ.
  1200. చేతగాని మొగుడు ఇంట్లో ఉన్నా వీధిలోఉన్నా ఒకటే.
  1201. చేతి చమురు భాగవతం.
  1202. చేతిలో ఉంటే అర్దం, చేరువలో ఉంటే పెళ్ళాం.
  1203. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటు లాభమేమిటి?
  1204. చేతులో పనివుంటే కడుపులో బువ్వుంటుంది.
  1205. చేతులో పనివున్న నోటిలో నాలుకుండాలా.
  1206. చేదోడు, వాదోడు.
  1207. చేనుకు గట్టు, ఊరికి కట్టు ఉండాలి.
  1208. చేనుకున్న కర్మమోయ్‌ శంభులింగమా అంటే అనుభవించక తప్పదోయ్‌ అబ్బులింగమా అన్నాట్ట.
  1209. చేసిన పాపం చెపితే పోతుంది.
  1210. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ.
  1211. చేసేవి శివ పూజలు దూరేవి దొమ్మరి గుడిసెలు.
  1212. చొప్పదంటు ప్రశ్నలు.
  1213. చొప్ప వామిలో నిప్పు దాచుకున్నట్టు.
  1214. చోళ్ళు విసిరే తిరగలి జొన్నలు విసురుతుందా.
  1215. ఛిఛి అనేదీ ఈ నోరే, శివ గిన అనేదీ ఈనోరే.
  1216. ఛిఛి కుక్కా అంటే ఏమే అక్కా అందట.
  1217. జగడ మెట్లా వస్తాది జంగం దేవరా అంటే బిచ్చం పెట్టవే బొచ్చు ముండా అన్నాట్ట
  1218. జంగమాయన తాళం దాసరాయన సంగీతం
  1219. జగమెరిగిన బ్రాహ్మడికి జందెమేల అన్నాట్ట,
  1220. జంగానికి బిడ్డలు పుడితే ఊరందరికీ ఉపాధి.
  1221. జననినీ, ధరణినీ, నమ్మి చెడినవారు లేరు.
  1222. జనని పాలు త్రాగి ధరణి నీళ్లు త్రాగి ధన్యుడవాలి.
  1223. జన వాక్యం జరగక తప్పదు.
  1224. జన్మానికంతా శివరాత్రి అన్నట్లు.
  1225. జయమున్నంత వరకూ భయం లేదు.
  1226. జయాపజయాలు దైవాధీనాలు.
  1227. జరిగే వరకు జయభేరి, జరక్కపోతే రణభేరి.
  1228. జరుగుబాటుంటే జ్వరమున్నంత సుఖంలేదు.
  1229. జరుగు బాటు తక్కువ, అదిరిపాటు ఎక్కువ.
  1230. జాతి కొద్ది బుద్ధి, కులం కొద్దీ ఆచారం.
  1231. జాతి బుద్ధి జాతిది, కులం బుద్ధి కులానిది
  1232. జానెడు ఇంట్లో మూరెడు కర్ర.
  1233. జానెడు పొట్టకోసం జన్మంతా ఆరాటం.
  1234. జియో జియో అంటే కుయ్యో కుయ్యో అందట.
  1235. జిల్లేడు చెట్టుకు మామిడి కాయాలా?
  1236. జిల్లేళ్ల సీమలో మల్లేతోట అందమట.
  1237. జిల్లేళ్ళకు మల్లెలు పూసాయా.
  1238. జిహ్వకో రుచి పుర్రెకో బుద్ది.
  1239. జీడి తింటే జివ్వుమంది గారె తింటే గావుమంది.
  1240. జీతగాడికిి నేతగాడికి చావులేదు.
  1241. జీతం, బత్తెం లేని ఉద్యోగం.
  1242. జీలకర్రలో కర్రలేదు, నేతి బీరలో నెయ్యిలేదు.
  1243. జీలకర్ర, సింగి నాదం.
  1244. జీవన్మృతులు, మృత జీవులు.
  1245. జుట్టుంటే ఏకొప్పయినా పెట్టుకోవచ్చు.
  1246. జుట్టున్నమ్మ ఎన్ని జడలైనా వేయవచ్చు.
  1247. జొన్నగింజ ఊచదియ్యం, వరిగింజ అటుకు బియ్యం
  1248. జొన్న వెరిగితే జాడు, వరి పెరిగితే వడ్డు.
  1249. జోగీ జోగి రాచుకుంటే బూడిద రాలిందట.
  1250. జోడు లేని బ్రతుకు, తాడు లేని బొంగరం.
  1251. జోలె భుజాన వుంటే జగమంతా తిరగవచ్చు.
  1252. టక్కరి బావకు జిత్తులమరదలి సైగ.
  1253. టక్కరి మరదలకు జిత్తులబావ సైగ.
  1254. టంగుటంగు మంటుంది కుండ కంగుకంగు మంటుది బిందె.
  1255. టంగుటూరి మిరియాలు తోకమిరియాలు.
  1256. టంగుటూరి వెద్దమాలను తగవు తీర్చమంటే తనకు ఇద్ద రన్నారట.
  1257. టాటోడు గాడికి దధ్యన్నం, విశ్వాసపొత్రుడికి చద్ది అన్నం.
  1258. టెంకాయ కచ్చికొండ.
  1259. టెంకాయ చెట్టుకు మడిగుడ్డ కట్టగానే అది దొంగ కడ్డమా.
  1260. టెంకాయ చెట్లు ఎందుకెక్కావురా అంటే దూడ గడ్డి కోసం అన్నట్టు.
  1261. డబ్బిచ్చి తేలు కుట్టించుకున్నట్టు
  1262. డబ్బు ఇవ్వనివాడు ముందుగా పడవెక్కాడట
  1263. డబ్బుకు, ప్రాణానికి లంకె.
  1264. డబ్బుగలవాడిది బంగారు వుంగరం డబ్బు లేదంటే ఇత్తడి వుంగరం.
  1265. డబ్బుంటే చాలు కొండమీద కోతైనా దిగి వస్తుంది
  1266. డబ్బుంటే ఢిల్లీ భోగాలు, డబ్బు లేకుంటే ఎలవడాలు.
  1267. డబ్బును చూసి భయంగాని, బుద్దిచూసిగాదు.
  1268. డబ్బు పాపిష్టిది.
  1269. డబ్బు ముడ్డిలో దేవుడున్నాడు
  1270. డబ్బు రాని విద్య దరిద్రానికే
  1271. డబ్బు లేదంటే తొరగా పొమ్మన్నాట్టు.
  1272. డబ్బులేనివాడి బడాయి చేతగాని బడాయి.
  1273. డబ్బు లేని వాడు డుబ్బుకు కొరగాడు.
  1274. డబ్బు వుంటే ఏడబ్బా వాయించినా ఫరవాలేదు.
  1275. డబ్బు సభ గట్టుకు ముద్ద నోటి గుట్టుకు
  1276. డవులు దస్తు పెళ్ళాం పస్తు
  1277. డాబుసరి బావా అంటే డబ్బు లేదు మరదలా అన్నాడట
  1278. డూడూ బసవన్నా అంటే తలూపినట్టు
  1279. ఢిలీ కి ఢిల్లి, పల్లెకు పల్లె
  1280. తక్కువ నోములు నోచి ఎక్కువ ఫలం రమ్మంటే వస్తుందా
  1281. తగిలిన వేలికే మళ్ళీ తగులుతుంది.
  1282. తగు దాసరికి,మెడ పూసలకి,అమ్మగన్న సంతానానికి,అయ్య ఇచ్చిన మనువుకు సమ్మ సరిపోయింది
  1283. తంగేటి జున్ను.
  1284. తంగేటి జున్నును దాచటమెందుకు
  1285. తంగేడు పూసినట్టు.
  1286. తడిగుడ్డతో గొంతులు కోస్తారు
  1287. తడిసి గాని గుడిసె కట్టడు,తాకి కాని మొగ్గడు
  1288. తడిసి ముప్పందుము మోసినట్టు
  1289. తండ్రి సేద్యం,కొడుకు వైద్యం , కూడు మద్యం
  1290. తద్దినం కొని తెచ్చుకున్నట్టు
  1291. తద్దినం పెట్టేవాడి తమ్ముడి లాగా
  1292. తద్దినానికి తక్కువ, మాసికానికి ఎక్కువ
  1293. తద్దినానికి భోజనానికి పిలుస్తే, రోజూ మీ ఇంట్లో ఇలాగే జరగాలని దీవించాడట
  1294. తన కంపు తనకింపు, ఒకరి కంపు ఓకరింపు
  1295. తనకు కానిది కూసు ముండ
  1296. తనకు మాలిన ధర్మం మెదలు చెడ్డ బేరం
  1297. తనకు లేదని ఏడిస్తే ఒక కన్ను పోయింది. ఎదుటివాడికి ఉన్నదని ఏడిస్తే ఇంకొకకన్ను పోయింది
  1298. తన కోపమె తన శత్రువు తన శాంతమె తనకు రక్ష.
  1299. తనతో వచ్చింది తనియాలు, రానన్నది వెలయాలు
  1300. తన దాకా వస్తే గాని తల నొప్పి బాధ తెలియదు
  1301. తనది తాటాకు, ఇవతలి వాడిది ఈతాకు.
  1302. తన దీపమని ముద్దు పెట్టుకుంటే తన మీసాలు కాలకుండా ఉంటాయా
  1303. తనను కట్ట తాళ్ళు తానే తెచ్చుకున్నట్టు.
  1304. తన పిల్ల తమిటికేడిస్తే, లంజ పిల్ల రాగి రేకుకు ఏడ్చిందట
  1305. తన పుట్టిల్లే తనకు కైలాసం.
  1306. తన పెరటి చెట్టు మందుకు పనికి రానట్లు.
  1307. తన బంగారం మచిదైతే కంసాలి ఏం చేస్తాడు
  1308. తన బలిమికన్నా స్థాన బలం మేలు
  1309. తన ముడ్డి కాకపోతే కాశీ దాకా దేకమన్నాడట
  1310. తనయుడి పుటుక తల్లికి తెలుసు
  1311. తన సొమ్ము అల్లం, పెరవారి సొమ్ము బెల్లం.
  1312. తన సొమ్ము సోమవారం, మంది సొమ్ము మంగళవారం.
  1313. తనువిచ్చింది , మనసిచ్చింది - ఇంకేముంది ఇవ్వటానికి.
  1314. తనువు చేసింది - మనను చేసింది మంచిదే అయింది.
  1315. తన్నులాటలూ వద్దు - గుద్దులాటలూ వద్దు.
  1316. తప్పతాగి కులం మరిచినట్లు.
  1317. తప్పు చేసిన వాడికి అప్పు చేసిన వాడికి ముఖం చెల్లదు
  1318. తప్పు లెన్ను వారు తండోప తండాలు,
  1319. తప్పులెన్నే వారు తమ తప్పులెరుగరు,
  1320. తంబళ అనుమానం-తలతిక్క.
  1321. తమలపాకు కట్ట, పొగాకు మట్టు, హరిదాసు పొట్టు ఎప్పడూ తడుపుతూ వుండాలి.
  1322. తమ్మన్న బంతికి రమ్మంటారు కాబోలు.
  1323. తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పాలి
  1324. తలకు మించిన శిక్ష, గోచికి మించిన దరిద్రం లేదు
  1325. తలకోసి మొల వేసినట్టు.
  1326. తలక్రింది కొరివి
  1327. తలగుడ్డకు తక్కువ గోచిపాతకు ఎక్కువ.
  1328. తలచి నప్పుడే తాతకు పెళ్ళి.
  1329. తలంత బలమున్నా, తల కొరివి పెట్టేవాడు లేడు
  1330. తలప్రాణం తోక కొచ్చినట్లు.
  1331. తలంబ్రాలకు, తద్దినానికి ఒకే మంత్రమా,
  1332. తలరాత ఎవరూ తప్పించ లేరు,
  1333. తలలు బోడులైతే తలుపులు బోడులైతాయా
  1334. తలలో నాలుక, వుూసల్లో దారం.
  1335. తలవెంట్రుకలంత బలగ మున్నా తలకొరివి పెళ్టేవాడు లేలేడు.
  1336. తలా,తోక లేని కథ, ముక్కు, మొహము లేని పిల్ల.
  1337. తలుపు లేని ఇంట కుక్కలు దూరవా
  1338. తల్లి కడుపు చూస్తుంది భార్య వీపు చూస్తుంది
  1339. తల్లికి కూడు వెట్టని వాడు తగుదునమ్మా అని తగువు తీర్చడానికి వచాట్ట.
  1340. తల్లికి బొల్లి ఉంటే పిల్లకు చుక్కెవా ఉంటుంది.
  1341. తల్లి చస్తే తరం బాసే, తండ్రి చస్తే బుణం బాసె
  1342. తల్లి తర్పణానికే తక్కువైతే పినతల్లికి పెట్టరా పిండ ప్రదానం అన్నాట్టు.
  1343. తల్లిదైవం, తండ్రి ధనం.
  1344. తల్లిని చూసి పిల్లను, పాలను చూచి బర్రెను కొనాలి.
  1345. తల్లిని నమ్మిన వాడు ధరణిని నమ్మిన వాడు చెడిపోడు.
  1346. తల్లిని బట్టు పిల్ల, విత్తును బట్టి పంట.
  1347. తల్లి పుట్టిల్లు మేనమామ ఎరగడా.
  1348. తల్లి బంగారమైనా కంసాలి దొంగిలిస్తాడు.
  1349. తల్లి లేని పిల్ల, ఉల్లిలేని కూర.
  1350. తల్లి విషం, పెళ్ళాం బెల్లం.
  1351. తవ్పెట కొర్చేవాడు దాసరి, శంఖమూదేవాడు జంగం.
  1352. తాకట్ల మొగుడా తంటాల మొగుడా నీ తనువుండగానే నన్ను మనువిచ్చిపోరా.
  1353. తాగడానికి ముందు,వ్రాతకు వెనుక ఉండాలి.
  1354. తాగబోతే మజ్జిగలేదంటే పెరుగుకోసం చీటీ రాయమన్నాట్ట.
  1355. తాగితే గాని మొగ్గడు, తడిస్తే గాని . కప్పడు.
  1356. తాగిన వాడిదే పాటు, సాగిన వాడిదే అట.
  1357. తాగిన వాడు, తప్పిన వాడు ఒకటే.
  1358. తాజెడ్డ కోతి వనమెల్దా చెరిచిందట.
  1359. తాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళు బెదురుతాయా?
  1360. తాటి చెట్టుకు గంధం పూసినట్టు,
  1361. తాటి చెట్టుక్రింద పాలుతాగినా కల్లే అంటారు.
  1362. తాటి చెట్టు నీడ నీడాకాదు, తగులుకున్న ముండ పెళ్ళామూ కాదు,
  1363. తాటీ చెట్లలో పొద్దుకూకినట్టు.
  1364. తాడు తెంచడానికి ముహార్తం వెట్టినట్లు
  1365. తాడూ లేదు, బొంగరం లేదు
  1366. తాడెక్కే వాడికి తలదన్నే వాడుంటాడు.
  1367. తాతకు దగ్గులు నేర్పినట్టు.
  1368. తాత బొచ్చె తరతరాలు.
  1369. తాతల నాడు నేతులు తాగాం మా మూతుల వాసన చూడమన్నాల్డు
  1370. తాతాచార్ల ముద్ర భుజం తప్పినా వీపు తప్పదు.
  1371. తాతా తాతా సెళ్ళాడతావా అంటే నాకెవడిస్తాడురా అబాయి అన్నాడట
  1372. తాదూర కంతలేదు, మెడకోడాలు అన్నాట్ట.
  1373. తానాకటి తలిస్తే దైవమొకటి తలుస్తాడు.
  1374. తాను తవ్వుకున్న గోతిలో తానే పడ్డట్టు.
  1375. తాను తిన తవుడు లేదు, వారాంగనకు వడియాలు కావా అన్నాట్ట.
  1376. తానుపట్టిన కుందేటికి మూడేకాళ్ళు.
  1377. తానే తుమ్మి తానే శతాయుష్షు అనుకున్నాడట.
  1378. తానొకటి తలిస్తే దైవమొకటి తలచినట్లు.
  1379. తామరాకుపై నీటి బొట్టులాగా.
  1380. తాలుగింజ లోయి దాసరీ అంటే రాలిన వరకే గోవిందా అన్నాల్టు.
  1381. తావలచింది రంభ తా మునిగింది గంగ
  1382. తాళం నీ దగ్గర, చెవి నా దగ్గర.
  1383. తాళిబొట్టు బలంవల్లయ తలంబ్రాల వరకూ బ్రతికాట్టు.
  1384. తాళ్ళపాక వారి కవిత్యం కొంత,తన పైత్యం కొంత.
  1385. తింటే ఆయాసం, తినకుంటే నీరసం.
  1386. తింటేగాని రుచి తెలియదు,దిగితేగాని లోతు తెలియదు.
  1387. తింటే మీగడ తినాలి, వింటే బేగడ (రాగం) వినాలి.
  1388. తిండికి ఠికాణాలేదు, ముండకు బులాకీ కావాలి అన్నాట్ట.
  1389. తిండికి తిమ్మరాజు,పనికి పోతురాజు.
  1390. తిండికి వచ్చినట్టా, తీర్ధానికి వచ్చినట్టా.
  1391. తిడితే గాలికిపోతాయి, తింటే లోనికి పోతాయి.
  1392. తిడితే చచ్చిన వాడూ లేడు, దీవిస్తే బతికిన వాడూ లేడు
  1393. తిండిలేనమ్మ తిరుణాళ్లకు పోతే ఎక్కనూ దిగనూ సరిపోయిందట
  1394. తినగా తినగా గారెలు చేదట.
  1395. తినగా తినగా వేము తీయగా ఉంటుందట.
  1396. తినబోతూ రుచి అడిగినట్టు.
  1397. తిన మరిగిన కోడి ఇళ్లెక్సి కూసెందట.
  1398. తినేది గొడ్డు మాంసం, చేసేది దేవతార్చన.
  1399. తినేవరకూ తింటికుట్టు, తిన్న తర్వాత దండికుట్టు.
  1400. తిన్న ఇంటీ వాసాలు లెక్క పెట్టినట్టు.
  1401. తిమ్నన్న బంతికి రమ్మన్నారు కాబోలు.
  1402. తిమ్నిని బమ్మిని, బమ్మిని తిమ్మిని చేసినట్టు.
  1403. తిమ్మన్నా, తిమ్మన్నా నమస్కారమంటే నాపేరు నీకెల తెలిసిందంకే నీముఖం చూడగానే తెలిసింది అన్నాట్ట.
  1404. తిమ్మిని బెమ్మిన్సి బెమ్మిని తిమ్మిని చేసేవాడు.
  1405. తిరపతి మంగలి వాడి క్షవరం.
  1406. తిరిగి ఆడది, తిరక్క మగాడు చెడ్డాట్ట.
  1407. తిరిగేకాలు, తిట్టేనోరు ఊరుకోదు.
  1408. తిరిపెం పెట్టే అమ్మను నీమొగుడితోపాటు పెట్టమన్నట్లు.
  1409. తిరువతికి పోగానే తురక దానరికాడు.
  1410. తిలా పాపం, తలా పిడికెడు.
  1411. తీగలాగితే డొంకంతా కదిలినట్టు.
  1412. తీగెకు కాయ బరువవుతుందా.
  1413. తీతువు పిట్ట రాయబారం.
  1414. తీయగా తీయగా రాగం, మూల్గగా మూల్గగా రోగం.
  1415. తీర్హం, స్వార్తం కలిసొచ్చినట్టు.
  1416. తుక్కు తుక్కుగా కోస్తే తట్టకెత్తేస్తా అన్నది.
  1417. తుంగేడు పూచినట్టు
  1418. తుంటిమీద కొడితే మూతి వళ్ళురాలాయట.
  1419. తుని తగువు.
  1420. తుమ్మితే ఊడిపోయే ముక్కు.
  1421. తుమ్ముకు తమ్ముడు ఆవలింతకు అన్న,
  1422. తురక, మరక తిరగేసి నరక.
  1423. తులసి వనంలో గంజాయి మొక్కలాగా.
  1424. తూగి ముందుకు పడకు తాగి వెనకకు పడకు.
  1425. తూ.చ. తప్పక.
  1426. తూట్లు మూసి తూములు తెరచినట్లు.
  1427. తూనీగ లాడిడే తూమెడు వర్షం.
  1428. తూర్పున వరద గూడు వేస్తే తుంగపోచైనా తడవదు.
  1429. “తూ” శాబొడ్డుంబాల్‌.
  1430. తెగించిన వాడికి తెడ్డే లింగం.
  1431. తెగిన గాలిపటం లాగా.
  1432. తెగేదాకా బిగించకూడదు.
  1433. తెచ్చుకుంటే భోంచేయి జగన్నాయకా, లేకుంటే ఊరకుండు జగన్నాయక.
  1434. తెజచిరాజు.
  1435. తెడ్డుకేం తెలుస్తుంది కూర రుచి
  1436. తెలగాణ్యుకు టెక్కు, నియోగికి నిక్కు.
  1437. తెలివి ఒకరి సొమ్మా తొండపు నుబ్బమ్మా.
  1438. తెలివిగల వాడికి మూడుచోట్ల అంటిందట.
  1439. తెలివి తక్కువ, ఆకలెక్కువ.
  1440. తెలిసేవరకూ బ్రహ్మ విద్య, తెలిసింతర్వాత కూసువిద్య.
  1441. తెల్లనివన్నీ పాలా? నల్లనివన్నీ నీళ్ళా?
  1442. తేనెలో పడ్డ ఈగలాగా.
  1443. తేలే నమ్మకు తీపులు మెండు.
  1444. తొక్క లేనమ్మ తొక్కులో నీళ్ళు పోసిందట.
  1445. తొడబలముంటే తొంభై మంది.
  1446. తొండముదిరి ఊసరవెల్లి అయినట్లు.
  1447. తొత్తు క్రింద బడి తొత్తు,
  1448. తొత్తులాగా పాటుపడి, దొరలాగా తినాలి.
  1449. తొందరగా రమ్మంటే తిరగమోత వేసి వస్తానన్నదట.
  1450. తొలకరి చెరువు నిండినా, తొలి చూలుకు కొడుకు పుట్టినా లాభం.
  1451. తొలి వెళ్ళాం తోటకూర, మరిపెళ్ళాం మామిపండు, మూడవ పెళ్లాం ముంతమామిడీ పప్పు.
  1452. తోక తెగిన నక్కలాగా,
  1453. తోక తొక్కిన తాచులాగా.
  1454. తోక ముడుచుకున్నట్లు.
  1455. తోక వెంబడి నారాయణా అన్నట్లు.
  1456. తోచీ తోచనమ్మ తోటికోడలి పుట్టింటికెళితే, అదేత్రోవన తోచనమ్మ ఆడబిడ్డ అత్తగారింటి కెళ్లిందట.
  1457. తోడు లేక పోందే రాచ పీనుగ.
  1458. తోరణం లేని వెళ్ళి వీరణం లేని బాజాలు.
  1459. తోసిరాజు.
  1460. త్రిశంకు స్వర్గం,
  1461. త్రోవన పొయ్యే వాడొకడు, దొబ్బులు తినే వాడొకడు.
  1462. దగ్గరకు పిలిచి దాసరీ అంకే నీ కన్నులొట్ట అన్నట్టు.
  1463. దగ్గు, సిగ్గు దాచినా దాగవు.
  1464. దండగలో పండగ వచ్చిందట.
  1465. దండమయ్యా బాపనయ్యా అంటే నీ తండ్రి నాటి పాత బాకీ ఇచ్చి పొమ్మన్నాట్టు.
  1466. దండుకు పోయిన వాడి వెళ్ళాం ఏనాటికైనా ముండమోపే,
  1467. దంపి నమ్మకు బొక్కిందే కూడు.
  1468. దప్పిగొన్నప్పుడు బొవి తవ్వినట్టు.
  1469. దమ్మిడీ ఆదాలేదు, క్షణం తీరికలేదు.
  1470. దమ్మిడీ పెళ్ళికి ఏగాణి భోగం మేళం.
  1471. దమ్మిడీ ముండకు ఏగాణి క్షవరం.
  1472. దయ్యాల ముందర బిడ్డలు బతుకుతారా.
  1473. దరిద్రానికి ఆకలెక్కువ.
  1474. దరిద్రానికి మాటలెక్కువ, తద్దినానికి కూరలెక్కువ
  1475. దరిద్రుడికి పిల్లలెక్కువ.
  1476. దరిలేని బావి, దావులేని కొంప.
  1477. దశకొద్ది దొరికాడు దిశమొల మొగుడు.
  1478. దశకొద్ది పురుషుడు, దానంకొద్ది బిడ్డలు.
  1479. దాతలేని ఊరు దయ్యాల పేట.
  1480. దానకర్ణుడు.
  1481. దానరి పొట్టు దైవాని కెరుక.
  1482. దానిమ్మ చెట్టుకు మడిగుడ్డ కాపాలిక!
  1483. దాయాది ఉంటే నిప్పెందుకు.
  1484. దారికితే దొంగ, దొరక్కపోతే దొర,
  1485. దారి తెలియని వాడు బాటసారి కాడు.
  1486. దారిన పొయ్యే దానయ్య.
  1487. దారినపోయే తద్దినమా మా ఇంటికిరా అన్నట్టు.
  1488. దారినపోయే శనేశ్వరాన్ని కొనుక్కొని తెచ్చుకున్నట్లు
  1489. దారినపోయో ధర్మయ్య దర్మం చద్దువు రావయ్య
  1490. దారిలో దొరికింది ధర్మానికి పోయింది.
  1491. దాసరి తప్పు దండంతో సరి.
  1492. దాసి కొడుకైనా కానులు కలవాడే రాజు.
  1493. దాసిదాని కొడుకు అప్పుడు ,దానకర్ణుడు యిప్పుడు
  1494. దిక్కు మొక్కులేని దివాణం.
  1495. దిక్కులేని వాడికి దేవుడే దిక్కు.
  1496. దిత్తులు తీసిన కోడె, ఈకలు తీసిన కోడి.
  1497. దినదిన గండం, నూరేళ్ళాయుష్షు.
  1498. దిపావళికి దీపమంత చలి.
  1499. దివిటీ క్రింద దీపం.
  1500. దింవుడు కళ్ళమాశ.
  1501. దిశమొల వాడి దగ్గరకు దిగంబరుడు వచ్చి బట్ట అడిగాడట
  1502. దీపముండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి.
  1503. దీపావళి వర్షాలు ద్వీపాంతరం దాటుతాయి.
  1504. దున్నకుండా వేసిన ఆముదాలు, మాదిగవాడికి ఇచ్చిన అప్పు తిరిగిరాదు.
  1505. దున్ననివాడికి గడ్డ ఎందుక్కు ఏలనివాడికి పెళ్ళా మెందుకు.
  1506. దున్నపోతు ఈనిందంకే దూడను కట్టేయమన్నట్టు.
  1507. దున్నపోతువై వాన కురిసినట్లు.
  1508. దురాశ దుఃఖం చేటు.
  1509. దురాశ దుఖం చేటు, దుష్టుణ్ణి చూచి దూరంగా తొలగాలి
  1510. దుష్టచతుష్టయం.
  1511. దుష్టుడికి దూరంగా ఉండారి.
  1512. దూడ కుడిచినట్టా దుత్తలో పడ్డట్టా.
  1513. దూడలేని పాడి దుఃఖవు పొడి.
  1514. దూరవు కొండలు నునుపు.
  1515. దెబ్బకు దయ్యం పారిపోయినట్లు.
  1516. దేవుడని మొక్కితే దయ్యమై పట్టుకున్నట్టు.
  1517. దేవుడికి ముడువు, దయ్యానికి మంత్రం.
  1518. దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలే,
  1519. దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వడు.
  1520. దేశ భాషలందు తెలుగులెస్స.
  1521. దైవాధీనం జగత్సర్వం.
  1522. దొంగకు తేలుకుట్టినట్లు.
  1523. దొంగ చేతికి తాళాలిచ్చినట్టు.
  1524. దొంగల సామ్ము దొరలపాలు.
  1525. దొంగలు దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్టు.
  1526. దొంగలు దోచిన కొంప.
  1527. దొంగలు పడ్డ ఆరునెలలకు కుక్కలు మొరిగినట్లు.
  1528. దొడ్డినిండా గొడ్డు, ఇంటినిండా బిడ్డలు, ఇంకే కావాలి ఇరకొటానికి.
  1529. దొందూ దొందే.
  1530. దోసకాయలు తిన్న కడుపు, దొంగలు పడ్డ ఇల్లు ఒకటే.
  1531. దౌర్భాగ్య దామోదరుడు.
  1532. ధర్మానికి దండగలేదు, వెట్టికి వైసాలేదు.
  1533. ధర్మానికి పోతే కర్మం చుట్టుకున్నదట.
  1534. ధీరుడైనా కావాలి, దీనుడైనా కావాలి.
  1535. ధూపం వేస్తే పాపం పోతుందట.
  1536. ధైర్యే సాహసే లక్ష్మి. (--)
  1537. నక్క ఎక్కడ, నాగలోకమెక్కడ.
  1538. నక్క జిత్తులన్నీ నొదగ్గరుండగా తప్పించుకు పోయెరా తాబేటి బుర్ర అన్నట్టు.
  1539. నక్క జిత్తులు, నారదుడి ఎత్తులు.
  1540. నక్కజిత్తులు నారాయణుడెరుగు.
  1541. నక్కను తొక్కి వచ్చినవాడు.
  1542. నక్క పోయిన తరువాత బొక్క నట్టుకుని ఏడ్చాడట.
  1543. నంక్రాంతికి చంకలెత్తకుండా చలి.
  1544. నక్షత్రకుడిలా వెంటపడ్డాడు.
  1545. నంగనాచి నవ్వు నాలుగంధాల చేటు.
  1546. నగుబాట్ల పెళ్ళికి నాడే నాగవల్లి.
  1547. నట్టేట ముంచినట్టు.
  1548. నట్టేట్ట వుట్టి ముణిగినట్టు.
  1549. నట్టేట్లొ పడ్డసొమ్ము నట్టింటికి వచ్చినట్టు.
  1550. నట్టేట్లొ వేసినా ఎంచి మరీ వెయ్యాలి.
  1551. నడమంతరపు సిరిగాడు సింహాలబండి అడిగాట్ట.
  1552. నడమంత్రవు సిరి నరాలమీది కురుపు.
  1553. నడవలేనమ్మకు నాలుగు పక్కలా సవారి.
  1554. నత్త నడక.
  1555. నత్తనడక తాబేలు షరుగు.
  1556. నందంటే నంది, పందంటే పంది.
  1557. నందాయ సందాయ అంటే చిచ్చాయ, చిచ్చాయ అన్నదట.
  1558. నందిని చెయ్యబోయి పందిని చేసినట్లు,
  1559. నందిని చెయ్యవయ్యా ఆచార్య అంటే పందిని చేసాట్టా.
  1560. నందోరాజా భవిష్యతి.
  1561. నంద్యావందనం చేస్తే వుణ్యం లేదు, చెయ్యకపోతే పాపం పోదు.
  1562. నన్ను కొడితే కొట్టావుగాని మా బావను కొట్టు చూద్దాం అన్నాట్ట,
  1563. నన్ను నమ్ము నారాయణ అంటే నక్కను నమ్మతా అన్నాట్ట.
  1564. నన్ను ముట్టుకోకు నామాలకాకి.
  1565. నపుంసకుడికి రంభ దొరకదు, గొడ్రారికి నంతాముండదు.
  1566. నపుంసకుడికి రంభ దొరికినట్టు.
  1567. నంబి, తంబళి, నాగుబాము, చెవులపిల్లి ఎదురుపడితే చేటు వస్తుంది.
  1568. నంబి పెట్టిందే ప్రసాదం.
  1569. నమిలే వాడికన్నా మింగేవాడే ఘనుడు.
  1570. నముద్రమైనా ఈద వచ్చుకాని సంసారం ఈదలేం.
  1571. నమ్మితే ఇమ్ము, నమ్మకుంటే అమ్ము.
  1572. నయాన, భయాన
  1573. నయానభయాన చెప్పాలిగాని నాలుకకోస్తే ఎలా?
  1574. నరంలేని నాలుక నాలుగు విధాలు..
  1575. నరాలమీది పుండు, నడమంత్రపు సిరి మాలావుతీపు.
  1576. నరుడు కన్ను వడితే నల్లరాయి బద్రలవుతుంది.
  1577. నలభీమపాకం.
  1578. నలుగురితో చావు పెళ్ళితో సమానం.
  1579. నలుగురితో పాటు నారాయణా, కులంతో పాటు గోవిందా.
  1580. నలుగురు నడిచే దారిలో గడ్డిపోచైనా మొలవదు.
  1581. నలుగురు నడిచేది దారి, పదుగురు చెప్పేది నీతి.
  1582. నలుగురు నడిచేదే బొట, నలుగురు పలికేదేమాట. (--)
  1583. నలుపు నాలుగు వంకలను తెస్తుంది. ఎరుపు ఏడు వంకలను దాస్తుంది.
  1584. నల్లనివన్నీ నీళ్ళుకాదు, తెల్లనివన్నీ పాలుకాదు,
  1585. నల్లబాపడు నాభి కంటు విషం.
  1586. నల్లరాయిమీద బొగ్గుగీత, తెల్లరాయిమీద సున్నవుగీత.
  1587. నల్లేరు మీద బండిపోయినట్టు.
  1588. నవ్విన నావచేనే పండుతుంది.
  1589. నవ్వు నాలుగు విధాల చేటు.
  1590. నవ్వే ఆడదాన్ని ఏడ్చే మొగాళ్లీ నమ్మరాదు.
  1591. నవ్వే నోటిలో ముత్యాలు ఏడ్చేనోటిలో బొగ్గులు,
  1592. నంసారం గుట్టు వ్యాధి రట్టు.
  1593. నా ఇంటికి నేనే పెద్ద, పిల్లికి పెట్టరా పంగనామాలు.
  1594. నాకు సిగ్గూలేదు నీకు ఎన్నూలేదు
  1595. నాకోడీ, కుంపటీ లేకపోతే ఎట్లా తెల్లారుతుందో చూస్తానన్నదట.
  1596. నాగవల్లి నిష్టూరం.
  1597. నా చెవులూ కంసొలే కుట్టాడు.
  1598. నాచేతి మాత్ర వైకుంఠయాత్ర.
  1599. నాడు కుట్టాలేదు, నేడు చించాలేదు.
  1600. నాతికి వయసొచ్చిందంటే కనీసం కోతి మొగుడన్నా కావాలి.
  1601. నాథుడు లేని రాజ్యం నానాదారులు.
  1602. నాదముంటే గంటా వాదముంటే తంటా.
  1603. నాదం లేని గంట నాములేని పంట.
  1604. నానాజికీ తీసికట్టు నాగంబొట్టు.
  1605. నానాప చేనుగదా అనుకుంళకే వుంగడి తగిరిందంట.
  1606. నామం పెడితే కామం తగ్గుతుందా.
  1607. నామాల కాకి, విభూది గద్ద, సిద్దుడి కయినా దొరకవు.
  1608. నామాలు పెట్టినంత మాత్రనే చావు బుద్దులు పోతాయా?
  1609. నా మొగుడు గిల్లింది నాబుగ్గ ,నీ మొగుడు గిల్లింది నీ బుగ్గ.
  1610. నాయనమ్మ ఏంచేస్తూంది అంటే ఒలకబోసి ఎత్తుకుంటోదన్నట్టు.
  1611. నారు పోసీనవాడు నిరుపోయడా,
  1612. నాస్తినారాయణమ్మ.
  1613. నిజం చెప్పరావమ్మా అంటే కూనకు పీల్లపుట్టింది అన్నట్టు.
  1614. నిజం దాచుకోవచ్చు గాని నిప్పు దాచుకోలేము.
  1615. నిజం నిప్పులాంటిది, నీరు తల్లిలాంటిది
  1616. నిజం నిలకడ మీద తెలుస్తుంది.
  1617. నిజమాడితే నిష్టూరం.
  1618. నిండా మునిగిన వాడికి చలేమిటి.
  1619. నిండిన కడుపుకు అన్నం, బట్టతలకు నూనె.
  1620. నిండుకుండ తొణకదు.
  1621. నిత్య కల్యాణం పచ్చతోరణం.
  1622. నిత్యం చచ్చేవాడికి ఏడ్చేవాడెనడు.
  1623. నిద్ర సుఖమెరుగదు, ఆకరి రుచెరుగదు.
  1624. నిప్పుకు చెదలంటుతుందా.
  1625. నిప్పుకు చెదలుపట్టింది,నల్లికి తేలు కుట్టింది.
  1626. నిప్పుతొక్కిన కోతిలాగా.
  1627. నిప్పుతో చెలగాటం.
  1628. నిప్పు నెవరన్న గుడ్డను కట్టుకుంటారా?
  1629. నిప్పు ముట్టనిదే చెయ్యికాలదు.
  1630. నిప్పురాజినా మొగం రాజినా మండకనూనదు.
  1631. నిప్పులో ఉప్పులాగా.
  1632. నిమ్మకు నీరెత్తినట్లు.
  1633. నిరక్షర కుక్షి, విరూపాక్ష దీక్షితుల వారికి ఇరవై ఒక్క భక్ష్యం ఒక్క లక్ష్యమా అన్నట్లు
  1634. నిలువ వీడలేదు పట్టు కొమ్మాలేదు.
  1635. నివురు గప్పిన నిప్పు.
  1636. నివ్పల్ళో వుప్పేసినట్టుంది నా పని
  1637. నీ ఇల్లు నా ఇంటికి ఎంత దూరమో, నా ఇల్లు నీ ఇంటికి అంతే దూరం
  1638. నీ ఎడమ చెయ్యితియ్యి నా పుర్రచెయ్యి పెడతానన్నాడట.
  1639. నీకు, నాకు కాదంకు రోలెక్కి తలంబ్రాలు, పోయమన్నట్టు.
  1640. నీకు రానిది, నేను విననిది, లోకంలో లేనిదీ చెప్పమన్నట్టు.
  1641. నీటికి నాచు తెగులు, మాటకు మాట తెగులు.
  1642. నీటివై రాసిన మాట.
  1643. నీతిలేనిది కోతి, నీతి గలది నాతి
  1644. నీతిలేనివాడు కోతికంటు పాడు.
  1645. నీ నొసటనే పొద్దు పొడిచిందా.
  1646. నీ ముఖాన పొద్దు పొడిస్తే ,నాయింట కనకం గురుస్తుందన్నాట.
  1647. నీరు పల్లమెరుగు, నిజం దేవుడెరుగు.
  1648. నీరులేని వూరు దేవుడు లేని వూరు వున్నా ఒకకే లేకున్నా ఒకటే!
  1649. నీవు కాకపోతే నీ అబ్బ మరొకడు.
  1650. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష.
  1651. నీళ్ళు ఎవరు పోసినా అవి వల్లంలోకి పోతాయి
  1652. నీళ్ళు నీళ్ళ వంకను పారుతాయిగాని మిట్టలెక్కిపారతాయా.
  1653. నీళ్ళున్నచోటనే బురద.
  1654. నీళ్ళు పల్లం చూపుతాయి కన్నీళ్ళు బాధ చూపుతాయి
  1655. నుగ్రీవాజ్ఞ.
  1656. నున్నం పుట్టని ఊళ్ళో అన్నం పుట్టునా.
  1657. నుబ్బి పెళ్ళి వెంకి చావుకొచ్చింది.
  1658. నుష్టాష్టమం.
  1659. నూకలిస్తే మేకలు కాస్తానన్నాట్ట.
  1660. నూటికి ఒక్కటి చెబ్లమాట.
  1661. నూటికి వెట్టి కోటికి గొరిగించేవాడు.
  1662. నూరు అబద్దాలాడినా ఒక వెళ్ళి చేయాలి.
  1663. నూరు కల్లలాడైనా ఒక ఇల్లు నిలపాలి.
  1664. నూరు కాకులు ఓ కోయిలను బతకనిస్తాయా?
  1665. నూరు కాకుల్లో ఒక కోకిలేం చేస్తుంది.
  1666. నూరు గొడ్లు తిన్న రాబందుకు ఒకటే గాలిపెట్టు.
  1667. నూరు నోములు నోచి ఒక రంకు పోయిందట.
  1668. నూరుమంది గుడ్డివాళ్ళు పోగై ఒకపాడు నూతిలో పడ్డట్టు.
  1669. నూరు మాటలైనా ఒక వ్రాతకు ఈడుకావు.
  1670. నెమలికంట నీరు కారితే వేటగాడికి ముద్దా అన్నట్లు.
  1671. నెమలిని చూచిన కాకి ఫింఛం పెట్టుకుంటుందట.
  1672. నెమలిని చూచి నక్క నాట్యమాడినట్లు.
  1673. నెయ్యానికై నా కయ్యానికైనా సమానత్వం ఉండాలి.
  1674. నెలకు మూడు వానలు నిండారుపంటలు.
  1675. నెల తక్కువైనా రాజింట వుట్టమన్నట్లు.
  1676. నెలబాలుడికి నూలుపోగు.
  1677. నెలబొలునికో నూలుపోగు, పూర్ణచంద్రునికి నమస్కారం.
  1678. నేడు చస్తే రేపటికి రెండు.
  1679. నేతి బీరకాయలాగా.
  1680. నేను మందు తింటా, నీవు పత్యం ఉండు అన్నట్టు.
  1681. నేను వుట్టకపోతే నీకు వెళ్ళామే లేకపోవును అంటే నీవు వుట్టకపోతే నీ తల్లినే పెళ్ళాడి ఉందును అన్నాట్ట.
  1682. నేనూ ఒక్క పొద్దే, వా మొగుడూ ఒక్క పొద్దే, పిండీ బియ్యమూ లేక పిల్లలూ ఒక్కపొద్దే.
  1683. నేరేళ్ళు పండితే నేలలు పండుతాయి.
  1684. నేర్చి బ్రతికినవాడ్సు నేర్వక చెడ్డవాడూ లేడు.
  1685. నేల విడిచి సాము చేసినట్లు,
  1686. నొసటన వ్రాసిన వ్రాలుకన్న గలదా నూరేళ్ళు చింతించినన్‌.
  1687. నోటికీ చేతికీ అడ్డులేదు.
  1688. నోటిముత్యాలు రాలిపోతాయా.
  1689. నోట్టో వేలుపెడితే కొరక నేరడు.
  1690. నోట్లో చక్కెర, కడుపులో కత్తెర.
  1691. నోట్లో నువ్వుగింజ దాగదు.
  1692. నోట్లో పిప్పినన్ను - కంట్లో వుసి కండ
  1693. నోరా వీపుకు దెబ్బలు చేకే అన్నాట్టు.
  1694. నోరుగల వాడిదే రాజ్యం.
  1695. నోరు గలవాడిదే రాజ్యం కర్రగలవాడిదే బర్రె,
  1696. నోరు నుంచిదైతే ఊరు మంచిదవుతుంది.
  1697. నోరు మాట్టాడుతుంటేు నొసలు ఎక్కిరిస్తుంది.
  1698. పక పక నవ్వేవాడు, గబగబ అరచేవాడు కపట మెరుగడు.
  1699. పక్క ఇంట పోరంకే, పండగంత వేడుక
  1700. పగటి నిద్ర పనికి చేటు, మాపు జాగరణ పెయ్యికి చేటు.
  1701. పగడం లేని ఇల్లు జగడం లేని ఇల్లు ఉండవు.
  1702. పగలెల్లా బారెడు నేశాను దివ్వె తేవె దిగవేస్తాను అన్నట్టు.
  1703. పగవాణ్ణి పంచాగం అడిగితే మధ్యాహ్నానికి మరణమన్నాట్ట.
  1704. పంచపాండవులు అంతే మంచపు కోళ్ళలాగా ముగ్గురు కారని రెండంటూ ఒకటి చూపబోయి సున్నా చుట్టాట్ట.
  1705. పంచాంగం పోయిందని తిధివారాలు పోతాయా?
  1706. పంచాంగాలు పోతే నక్షత్రాలు పోతాయా.
  1707. పంచాగ్ని మధ్య మందున్నట్టు.
  1708. పచ్చగడ్డికి నీళ్ళు ఆగుతాయా?
  1709. పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది.
  1710. పచ్చని వరహాకంటే పుచ్చిన గింజమేలు.
  1711. పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్టు.
  1712. పంటకు పెంటు, వంటకు మరటు.
  1713. పట్టపగలు కన్నమేస్తావేమిరా అంటే నా కడుపు కక్కుర్తి నీకేం తెలుసు అన్నాట్ట,
  1714. పట్టపగలే చుక్కలు పొడిపిస్తాట్ల.
  1715. పట్టిందల్లా బంగారం, ముట్టుందల్లా ముత్యం,
  1716. పట్టింది బంగారం, ముటింది ముత్యం.
  1717. పట్టి పట్టి పంగవామాలు దిద్దితే గోడచాటు కెళ్ళిగోకిచేశాడట.
  1718. పట్టి విడిచిన మండ, మబ్బు విడిచిన ఎండ, మొగుడు విడిచిన ముండ.
  1719. పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు.
  1720. పట్టెడన్నం కావాలిగాని గంపెడు గడ్జెందుకు?
  1721. పట్టేవర్ధనం పెట్టేను పాదపూజ చేయమన్నాడట
  1722. పండగ నాడు కూడా పాత మొగుడేనా.
  1723. పండని ఏడు పాటు ఎక్కువ.
  1724. పండని నేల పదులు కంటే పండే నేల కొంచెం చాలు.
  1725. పడమర మెరిసింది , ఉత్తరం ఉరిమింది పిడుగులు పడ్డాయీఅన్నాట్ట.
  1726. పడమర మెరిస్తే పది గడియలకు వర్షం.
  1727. పండిత వుత్రః పరమ శుంఠఈ
  1728. పండినా ఎండినా పన్ను తప్పదు.
  1729. పడిశం పదిరోగాల పెట్టు.
  1730. పడుచుల కాపురం, చితుకుల మంట.
  1731. పండుటాకును చూసి పసరాకు నవ్వినట్టు.
  1732. పడ్డచోటనే వెతుక్కోవాలి.
  1733. పడ్డ వారెప్పుడూ చెడ్డవారు కారు.
  1734. పండ్ల చెట్టు కాసేవాడికీ ఆ దెబ్బలు తప్పవు.
  1735. పండ్ల చెట్టు క్రింద ముళ్ళ కంప ఉన్నట్టు.
  1736. పంతులు గింతులు పావుశేరుమెంతులు ఎగరేసి కొడితే ఏడు గంతులు.
  1737. పత్యం చెడరాదు సత్యం తప్పరాదు.
  1738. పదం తప్పినా ప్రాస తప్పరాదు.
  1739. పందికేం తెలునురా పన్నీరు వాసన.
  1740. పందిని పొడిచినవాడే బంటు, కంద చెప్పిన వాడే కవి.
  1741. పదిమంది చావు పెళ్ళితో సమానం
  1742. పదిమంది చావు పెళ్ళితో సమానం.
  1743. పదిమంది నడిచింది బాట, పదిమంది పలికింది మాట.
  1744. పంది మెచ్చేది బురద, పడతి మెచ్చేది పన్నీరు.
  1745. పందిరి ఇల్లూ కాదు, పరదేశి మొగుడూ కారు.
  1746. పందిరి మంచంమీద పడుకున్ననే పందిరి గుంజా పనిచెయ్యి అన్నాట్ట.
  1747. పదిరోజులు పస్తున్న వాడింటికి మూడురోజులు పస్తున్నవాడు వెళ్ళాడట
  1748. పదుగురాడు మాట పాటియై ధర చెల్ల.
  1749. పందుం తిన్నా పరగడుపే, ఏదుం తిన్నా ఏకాదశే.
  1750. పద్మవ్యూహం.
  1751. పనరాదు, కనరాదు, అనరాదు(చెడు)
  1752. పనసకాయ దొరికినప్పుడే తద్దినం పెట్టాలి.
  1753. పనిచెయ్యని వాడికి ప్రగల్పాలెక్కువ.
  1754. పని, పాట లేదు పట్టుత్తా నీ కొళ్ళకైనా మొక్కు తానన్నాట్ట,
  1755. పనిలేని మంగలి పిల్లితల గొరిగినట్టు.
  1756. పప్పులేని వెళ్ళి ఉప్పులేని కూర.
  1757. పరుగెత్తి పాలు తాగేకన్నా నిల్చొని నీళ్ళు తాగడం మేలు.
  1758. పరుత్తే వాణ్ణి చూస్తే తరిమేవాడికి లోకువ,
  1759. పరుల సొమ్ము పాపిష్టి సొమ్ము.
  1760. పవ్పులేని వెళ్ళి ఉప్పులేని కూర.
  1761. పసిబిడ్డకు ,పాలకుండకు దృష్టి తగలకుండా చూడాలి.
  1762. పాచిపళ్ళ దాసరికి కూటిమీదే లోకువ.
  1763. పాటిమీద గంగానమ్మకు కూటిమీదే లోకం.
  1764. పాటీమీద దేవరకు కూడిమీడే లోకం
  1765. పాటు పడితే కూడికి కొదవా.
  1766. పాడిందే పాడరా పాచిపళ్ళ దాసరి.
  1767. పాడూళ్ళో పోత రాజు.
  1768. పాతచుట్టం పాత చింతకాయ పచ్చడి.
  1769. పాతొక రోత కొత్తొక వింత.
  1770. పాత్రమెరిగి దానం క్షేత్రమెరిగి విత్తనం.
  1771. పానకంలో వుడకలాగా.
  1772. పానకంలో వుడక - వడపప్పులో గరిక
  1773. పాపమని పట్టెడంబలి పోస్తే, కారం లేదని కచ్చేరికి ఎక్కినట్లు.
  1774. పాపముంటే భయం,
  1775. పాపి చిరాయువ్వు వుజ్యే గతాయువు.
  1776. పాపీ చిరాయువు.
  1777. పాముకు పాలుపోసి పెంచినట్టు.
  1778. పాముకు బదనిక చూపినట్లు.
  1779. పాము చావా చావదు,బడితె విరగా విరగదు.
  1780. పాలకు వచ్చి ముంత దాచినట్లు.
  1781. పాలపొంగు, పడుచు పొంగు.
  1782. పాలు తాగి రొమ్ము గుద్దినట్టు.
  1783. పాసిన అన్నం పక్వానికొస్తుందా.
  1784. పిచ్చి కుదిరితే గాని పెళ్ళికాదు. పెళ్ళైతే గొని పిచ్చికుదరదు.
  1785. పిచ్చి కుదిరింది రోకలి తలకు చుట్టుమన్నాట్టు.
  1786. పిచ్చుకమీద బ్రహ్మాస్త్రం.
  1787. పిట్టకొంచెం కూత ఘనం.
  1788. పిట్టపోరు పిట్టుపోరు పిల్లి తీర్చినట్లు.
  1789. పిండికొద్ది రొట్ట, తిండికొద్దీ గొడ్డు.
  1790. పిడుక్కు, బియ్యానికి ఒకటే మంత్రమా.
  1791. పినతండ్రి పెళ్ళాం పినతల్లికాదు, మేనమామ వెళ్ళాం మేనత్తకాదు.
  1792. పిలవని పేరంటం, చెప్పని ఒక్క పొద్దు.
  1793. పిల్చి పిల్లనిస్తామంకే కులం తక్కువ అన్నట్టు.
  1794. పిల్లకాకి కేమి తెలుసురా ఉండేలు దెబ్బ.
  1795. పిల్ల చచ్చినా పీతికంపు పోదన్నట్లు.
  1796. పిల్లను చూచి చీరకొనాలి ,బావి చూచి చేద కొనాలి.
  1797. పిల్లను చూచి పీట వెయ్యమన్నళ్ళు.
  1798. పిల్ల పిడికెడు గూని గంపెడు.
  1799. పిల్లపోయినా వురిటికంపు పోలేదట.
  1800. పిల్లలేని కంపు, వానలేని వరద.
  1801. పిల్లలేని పియ్యి, వానలేని వరద అన్నట్టు.
  1802. పిల్లి కళ్ళు మూసుకొని పాలు త్రాగుతూ తననెవరూ ఎరుగరని ఎంచుకున్నట్లు.
  1803. పిల్లికి ఎలుక సాక్ష్యం.
  1804. పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం.
  1805. పిల్లిని చంకన బెట్టుకొని పెళ్ళికి పోయినట్టు.
  1806. పీనుగకు శృంగారంలాగా.
  1807. పీనుగ మీద పిండాకూడన్నట్లు.
  1808. పుట్టని బిడ్డకు పూసలు కట్టినట్టు.
  1809. పుట్టని బిడ్డకు పేరు వెతికాట్టు.
  1810. పుట్టినప్పుడు పురుడు.
  1811. పుండు మానినా మచ్చమానదు.
  1812. పుండు మీద కారం చల్లినట్లు.
  1813. పుణ్యం వుట్టెడు, పురుగులు తట్టెడు.
  1814. పుణ్యానికి పెల్టే అమ్మా నీ మొగుడితో సమానంగా పెట్టు మన్నట్టు
  1815. పుబ్బలో చల్లేదానికన్నా దిబ్బలో చల్లడం మేలు.
  1816. పురి మీసం పట్టుకొని ఉయ్యాల ఊగినట్టు.
  1817. పుర్రెకో ముద్ది, జిహ్వకో రుచి
  1818. పుల్లయ్య వేమవరం.
  1819. పూచిన పూలల్లా కాయలవుతాయా.
  1820. పూటకూళ్ళమ్మ పుణ్యమెరుగదట
  1821. పూలమ్మినచోట పుడకలమ్మరాదు.
  1822. పూలవాసన నారకు పట్టినట్లు.
  1823. పూసల్లో దారంలాగా
  1824. పెట్టిందంతా వైరూకాదు, పుట్టిన వాళ్ళంతా చిడ్డలూకారు.
  1825. పెట్టినవారికి వుట్టిందే సాక్షి.
  1826. పెట్టెపోతలు లేకపోయినా వట్టి కూతలు ఎందుకు.
  1827. పెడతానంటే ఆశ, కొడతానంటే భయం.
  1828. పెడితే వెళ్ళి పెట్టకపోతే పెటాకులు.
  1829. పెత్తనానికి పోతే దుత్త చేతికొచ్చిందట.
  1830. పెదవి దాటితే వృథివి దాటుతుంది.
  1831. పెద్ద ఇంటి రంకు,పెద్దమనిషి బొంకు తెలియవు.
  1832. పెద్దలమాట చద్దిమూట.
  1833. పెనానికేం తెలుసురా పెసరట్టు రుచి.
  1834. పెన్న దాటితే పెరుమాళ్ళ "సేవ.
  1835. పెరటి చెట్టు మందుకు పనికిరానట్లు.
  1836. పెరవలమానుకోరు.
  1837. పెళ్ళినాడే పరగడువైతే పైన పిల్లలు కూడానా.
  1838. పేగు చుట్టమా పెట్టు చుట్టమా.
  1839. పేచీలకు పెద్దకొడుకు.
  1840. పేడా, బెల్లం ఒకటి చేసినట్లు.
  1841. పేదవాడి కోపం పెదవికి చేటు.
  1842. పేదవాడి వెళ్ళాం వాడకంతా వదిన.
  1843. పేనుకు వెత్తనమిస్తే తలంతా తెగ కొరికిందట.
  1844. పేరుగాప్ప ఊరుదిబ్బ.
  1845. పేరులేని వ్యాధికి, పెన్నేరుగడ్డ మందు.
  1846. పేరొకరిది పెత్తన మొకరిది.
  1847. పొంగే పాలను, వెలిగే దీపాన్ని ఆర్బరాదు.
  1848. పొట్టివాడికి పుట్టడు బుద్దులు
  1849. పొట్టు కిచ్చినా బట్టకిచ్చినా భూదేవే.
  1850. పొండవుల వారి సంపాదన దుర్యోధనుల వారి పిండాకూళ్ళకు సరి.
  1851. పొడీ గుట్టు పంట రట్టు.
  1852. పొదుగు కోసి పాలు త్రాగినట్టు.
  1853. పొద్దున్నే వచ్చిన వాన పొద్దు తిరిగి వచ్చిన చుట్టం పోరు.
  1854. పొయ్యి ఊదినమ్మకు గుక్కెడైనా దక్కుతుంది.
  1855. పొరిగింటి పుల్లకూర రుచి.
  1856. పొరుగు పచ్చగా ఉంటే పొయ్యిలో నీళ్ళు పోసుకున్నట్లు.
  1857. పొరుగూరి చాకిరి. పొరుగూరి వ్యవసాయం తనను తినేవే కొని తాను తినేవికొవు.
  1858. పోతే మొగుడు పొయ్యాడు కాని పొన్నకాయలా కుదిరింది తల
  1859. పోరీ, పోలీ నీ భోగమెన్నాళ్ళే అంటే మా అత్త మాలపల్లి పోయొచ్చిందాకా అన్నదట.
  1860. పోరు నష్టం, పొందులాభం.
  1861. పౌందర్యానికి ఒంటె, సంగీతానికి గాడిద.
  1862. ప్రయాణం అబద్ధం, ప్రసాదం నిబద్ది.
  1863. ప్రసూతి వైరాగ్యం, పురాణ వైరాగ్యం, స్మశాన వైరాగ్యం,
  1864. ప్రాణం పోయినా మానం దక్కించుకోవాలి
  1865. ప్రాణం మీడ తీపా, బెల్లం మీద ప్రీతా.
  1866. ప్రారబ్ధం బాగా లేకపోతే పై బట్టే పామై కరుస్తుంది.
  1867. ప్రాస కోసమేడ్చానే కూసుమొండా అన్నట్టు.
  1868. ప్రీతితో పెట్టింది పిడికెడు చాలు.
  1869. ప్రీతిలేని కూడు పిండా కూటితో సమానం.
  1870. బకాసురుడు. (--)
  1871. బంగారమంటి కోమటి సంగీతము మరిగి బేరసారము లుడికెన్
  1872. బంగారు పిచ్చుక,
  1873. బట్టతలకు, మోకాళ్ళకు ముడి వేసినట్టు.
  1874. బతకని బిడ్డ బారెడు
  1875. బర్రె చస్తే పాడి బయటపడుతుంది.
  1876. బాదరబందిరి.
  1877. బాదరాయణ
  1878. బాలల తుమ్ము, బాలింత తుమ్ము మంచిది.
  1879. బాలవాక్కు బ్రహ్మవాక్కు.
  1880. బావ మరుదుల బ్రతకకోరును, దాయాదుల చావు కోరును.
  1881. బిడ్డ వచ్చిన వేళ, గొడ్డు వచ్చిన వేళ.
  1882. బీరకాయ పీచు.
  1883. బుణము, వ్రణము ఒకటే
  1884. బుద్ది భూములేలుతుంటే కర్మ గాడిదలు కాస్తానందట.
  1885. బుధవారం నాడు పులికూడా , బయలుదేరదు.
  1886. బూడిదలో పోసిన పన్నీరు
  1887. బెండ్లు మునిగి గుండ్లు తేలినట్టు.
  1888. బెల్లం కొట్టిన రాయిలాగా.
  1889. బెల్లమున్నచోట చీమలు చేరుతాయి
  1890. బెల్లమున్న చోటే, ఈగలు ముసురుతాయి
  1891. బోగందానికి వలపు, బొగ్గుకు తెలుపులేదు.
  1892. బ్రతికుంటే బలుసాకు తినొచ్చు.
  1893. బ్రహ్మకైనా పుట్టు రిమ్మ తెగులు.
  1894. బ్రహ్మచారి ముదిరినా, బెండకాయ ముదిరినా పనికిరాదు
  1895. బ్రహ్మచారి శతమర్కటః.
  1896. బ్రహ్మ ద్వేషం పుట్టినా, అన్న ద్వేషం పుట్టినా ఎక్కువ కాలం బ్రతకడు
  1897. బ్రహ్మాల్లొ చిన్న, బెస్తాల్లొ పెద్ద
  1898. బ్రహ్మాస్త్రం
  1899. బ్రహ్మాస్త్రానికి తిరుగులేదు
  1900. భగీరథ ప్రయత్నం.
  1901. భరతుడికి పట్టం, రాముడి రాజ్యం.
  1902. భరద్వాజ విందు.
  1903. భలేభలే అంటాడు ముఖం తెలుసా అన్నాట్ట.
  1904. భల్లూకపు పట్టు
  1905. భిక్షాధికారికి లక్షాధికారికి ఎందుకు పోలిక?
  1906. భిక్షాధికారైనా కావాలి, లక్షాధికారైనా కావాలి
  1907. భోజనానికి ముందు, స్నానానికి వెనుక
  1908. భోజనానికి వచ్చి గొయ్యి త్రవ్వినట్టు.
  1909. భోజనానికి వద్దంకే పట్టుచీర కట్టుకొస్తానన్నట్లు.
  1910. భోజరాజులాంటి రాజు ఉంటే, కాళిదాను లాంటి అప్పుడే ఉంటాడు
  1911. మక్కాకు పోయి కుక్క మలం తెచ్చినట్లు, (--)
  1912. మక్కికిమక్కి.
  1913. మఖలో వుట్టి, పుబ్బలో పోయినట్లు.
  1914. మంగలంలోని పేలాలలాగా.
  1915. మంగలి పాత, చాకలి కొత్త,
  1916. మంగలి వని గొరగడం చాకలివని ఉతకడం.
  1917. మగవాడు తిరక్క చెడ్డాడు. ఆడది తిరిగి చెడింది
  1918. మంచం అల్లలేని మగవాడు, మజ్జిగ చిలకలేని ఆడది.
  1919. మంచం క్రింద మంతరసాని, మంచంపైన దొంగచూలాలు.
  1920. మంచమున్నంత వరకే కాళ్ళు చాచుకోవాలి
  1921. మంచమెక్కి వరస అడికినట్టు
  1922. మంచి కాలానికి మామిళ్ళు, చెడు కాలానికి చింతలు కాస్తాయట.
  1923. మంచికి పోతే చెడు ఎదురైనట్లు.
  1924. మంచి గొడ్డుకో దెబ్బ మంచి మనిషికో మాట.
  1925. మంచి మనిషి లోతు ,పాడుగొయ్యిలోతు తెలియవు.
  1926. మట్టి దొరికిందని మాణిక్యం దొరుకుతుందా.
  1927. మట్టిలో మాణీక్యంలాగా
  1928. మడికి గట్టు ఇంటికి గుట్టు.
  1929. మతిలేనమ్మకు గతిలేని మొగుడు.
  1930. మతిలేని మాట, శృతిలేని పాట.
  1931. మతిలేని వెళ్ళం గతిలేని మొగుడు.
  1932. మంత్రసాని తనం ఒప్పుకున్న తర్వాత ఏదొచ్చినా పట్టాలి.
  1933. మంత్రసాని దగ్గర మర్మం దాచినట్టు.
  1934. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా.
  1935. మంది ఎక్కువైతే మజ్జిగ పల్చన.
  1936. మందుకు పత్యం, మాటకు సత్యం.
  1937. మందుకు పోయిన వాడు మాసికొనికొచ్చినట్లు.
  1938. మన దీవమని ముద్దాడితే మూతిమీద మీసాలు తెగకాలకుండా ఉంటాయా.
  1939. మనసుకు మనసే సాక్షి.
  1940. మనసులేని మనువులాగా.
  1941. మనస్సులోని మర్మం, నీళ్ళలోని లోతు ఎవరూ ఎరుగరు.
  1942. మనింటి దీపమేగదాని ముర్దుపెట్టు అన్నాట్ట.
  1943. మనిషి కడువున రాక్షసి పుట్టచ్చు. రాక్షసి కడుపున మనిషి పుట్టడు.
  1944. మనిషి కాటుకు మందులేదు.
  1945. మనిషికి ఉన్నది పుష్టి. వనరానికి తిన్నది వృష్టి.
  1946. మనుగడువు వెళ్ళి కొడుకులాగా.
  1947. మనుషులు పోయినా మాటలు నిలుస్తాయి.
  1948. మనోవ్యాధికి మందులేదు.
  1949. మన్నుతీన్న పాము.
  1950. మల్లిని చెయ్యబోతే పిల్లి అయినట్టు.
  1951. మసిగుడ్డతో మంచినీళ్ళు ఇచ్చాట్ట.
  1952. మసిపూసి మారేడుకాయ చేసినట్లు
  1953. మాఘమాసపు వాన మొగుడు లేని చాస.
  1954. మాచకమ్మకు ముత్యాల సరమేల.
  1955. మాచకమ్మ సమర్త మఖ అయినా ఒకటే పుబ్బ అయినా ఒకటే
  1956. మాచర్ల రాజులకు మీసాలు లేవంటే పల్నాటి రాజుల మిద్దెలకు వాసాలు లేవన్నాట.
  1957. మాచికమ్మ సమర్తాడిందట నాలుగు తాటాకు ముక్కలిమ్మానాట్టు.
  1958. మాచెర్ల దొరలకు మీసాలు లేవు, పల్నాటి దొరలకు వాసాలు లేవు.
  1959. మాటకు మాట తెగులు, నీళ్ళకు నాచు తెగులు
  1960. మాటలు కోటలు దాటుతాయి గాని కాళ్ళు గడప దాటవు
  1961. మాటలు తేటలు మా యింట ,మాపటి భోజనం మీ ఇంటు.
  1962. మాదిగ మంచానికి తలవైపు, కాళ్ళవైవు ఒకటే
  1963. మానింది మందు.
  1964. మానిన వుండును మళ్ళీ రేపినట్లు.
  1965. మామా ఒక ఇంటి అల్లుడే, అత్తా ఒక ఇంటి కోడలే.
  1966. మారుమనుం కోడలికి మలిమనుం అత్త సలహాలు
  1967. మారు మనువు చేసుకొని మొదటి మొగుడికి సుద్దులు చెప్పిందట.
  1968. మార్గశిరంలో మబ్బులు మాఘమాసంలో వానలు.
  1969. మార్గశిరంలో మాట్లాడ్డానికి పొద్దుండదు.
  1970. మాంసం తింటామని ఎముకలు గ్రుచ్చి మెళ్లో వ్రేసుకుంటామా
  1971. మింగమెతుకు లేదు తాగ గంగ లేదు.
  1972. మింగ మెతుకు లేదు, మీసాలకు సంపెంగ మానె అన్నాట్ట.
  1973. మిండగాడు డబ్బివ్వకపోతే మొగుడితో పోయినట్లు అనుకుంటాను పొమ్మన్నదట.
  1974. మిడతంభొట్టు జోన్యంలాగా.
  1975. మిండలను మరిగిన అమ్మ, మీగడ తిన్న అమ్మ ఊరుకుండదు.
  1976. మిద్దె మీద పరుగు మీసాలమీద మెరుగు.
  1977. మిన్ను విరిగి మీద పడ్డట్టు.
  1978. మీ ఇంటికొస్తాను నాకేం వెడతావు,నా ఇంటికొస్తావు నాకేం తెస్తావు.
  1979. మీ ఇంట్లో భోంచేసి మా ఇంట్లో చెయ్యి కడుక్కోమన్నట్లు.
  1980. మీకు మాట,మాకు మూట.
  1981. మీన మేషాలు లెక్క పెట్టినట్టు.
  1982. మీయింట ఇంగలం మాయింట మంగలం అన్నాట.
  1983. మీసాలు వచ్చేటప్పుడు దేశాలు కానరావు.
  1984. ముక్కున్నంత వరకూ పడిశం ఉండేదే.
  1985. ముక్కుపట్టిన ముత్యం, చెవు పట్టని కమ్మ.
  1986. ముక్కు, ముఖం తెలియనివాడు.
  1987. ముక్కు మూరెడు,శిగ బారెడు.
  1988. ముక్కు, మొగములేని బిడ్డ మొదలు తుదిలేని పాట.
  1989. ముక్కేదిరా అంటు తలతిప్పి చూపించాడట.
  1990. ముఖాలు చూచి బొట్టు పెడతారు, పీల్లను చూచి పీట వేస్తారు.
  1991. ముగ్గురు ఆడవాళ్ళు కూడైతే, పట్టపగలే చుక్కలు పొడుస్తాయి
  1992. ముగ్గురు బిడ్డల్ని కంటే ముసలాడికైనా కొరగాదు.
  1993. ముంజేతి కంకణానికి అద్ద మెందుకు.
  1994. ముట్లుడిగిన తర్వాత సమర్తె సారె పెట్టినట్టు.
  1995. ముండపెంచిన బిడ్డ ముక్కుతాడు లేని ఎద్దుతో సమానం
  1996. ముండ మొయ్యవచ్చుగాని నిందమొయ్యరాదు.
  1997. ముండమోపి బలువు, పాండుడురోగి తెలుపు.
  1998. ముండల ముఠాకోరు.
  1999. ముండాకాదు, ముత్తైదువా కాదు.
  2000. ముండె ముదిరినా లంజె ముదిరినా కొరగాదు.
  2001. ముడ్డికి తెలుస్తుందా కొప్పు అందం?
  2002. ముడ్డిమీద తన్నితే మూతివళ్ళు రాలినట్టు.
  2003. ముడ్డిలో పుండ్లు, మేనమామ వైద్యం, మానంలో పుండు మామగారి వైద్యం.
  2004. ముణ్ణాళ్ళ ముచ్చట.
  2005. ముందరి కాళ్ళకు బంధాలు.
  2006. ముందుకు వస్తే గొయ్యి, వెనక్కుపోతే నుయ్యి.
  2007. ముందు నడిచే ముతరాసువాణ్ణి, వెనుక వచ్చే ఏనాది వాణ్ణి నమ్మరాదు.
  2008. ముందున్నది ముసళ్ళ పండుగ.
  2009. ముందున్నది ముసళ్ళ పండుగ.
  2010. ముందే ముక్కెడి పైన పడిశం.
  2011. ముందొచ్చిన చెవులకన్నా వెనక వచ్చిన కొమ్ములు వాడి.
  2012. ముద్ద ముద్దకూ బిస్మిల్లా
  2013. ముద్దుచేసిన కుక్క మూతి కరిచిందట.
  2014. ముద్దుచేసిన కుక్క మూతి కరిచింది, చనువు చేసిన భార్య చంక కెక్కింది.
  2015. మున్నూరు శిఖలైనా కూడవచ్చును కాని మూడు కొప్పులు కూడరాదు.
  2016. ముప్పొద్దు తిన్నమ్మ మొగుడాకలెరుగదట.
  2017. మురిపెం తిరిపెం చేటు, ముసరి మొగుడు ప్రాణానికి చేటు.
  2018. ములక్కాయకు ముళ్ళెన్ని అంటే. కాకరకాయకు కళ్ళెన్ని అన్నట్టు.
  2019. ముల్లుతో తీస్తే పొయ్యేదానికి దబ్బనంతో తీసినట్లు.
  2020. ముల్లొచ్చి అరిటాకుమీద పడ్డా అరిటాకు వచ్చి ముల్లు మీద పడ్డా అరిటాకుకే మోసం.
  2021. మువ్పూట తిన్నమ్మ మూరృపోయిందట.
  2022. ముష్టిలో ముష్టి ధర్మ ముష్టి.
  2023. ముష్ఠికి మూడు సంచూలా
  2024. ముసలి కాలానికి కుసుమరోగం.
  2025. ముసుగులో గుద్దులాట.
  2026. ముళ్ళకంపమీద పడ్డ గుడ్డ మెల్లగా తీసుకోవాలి.
  2027. మూడునాళ్ళ ముచ్చట.
  2028. మూడునాళ్ళ ముత్తైదువతనానికి ఆరుజోళ్ళ లక్కాకులు.
  2029. మూడు నెలలు సాముచేసి మూలనున్న ముసలిదాన్ని కొట్టాట్టు.
  2030. మూడు పావలాల గుడ్డు ముప్పై రూపాయల కుట్టు.
  2031. మూడు మాటలు, ఆరు తప్పులు.
  2032. మూడురోజులుంటే మురికి చుట్టం.
  2033. మూడేళ్ళనాటి గుణం నూరేళ్ళ వరకూ ఉంటుందట.
  2034. మూదికోనం పోదికి పోతే కుంచెడు బియ్యం కుక్కముట్టింది.
  2035. మూరెడు ఇంట్లో బారెడు కర్ర ఎట్లా కొడతావు కొట్టరా మొగడా అందట.
  2036. మూల ముంచుతుంది, జ్యేష్ట తేలుస్తుంది.
  2037. మూల ముంచుతుంది విశాఖ విసురుతుంది,
  2038. మూలవిరాటుకు పూజలేనప్పుడు - ఉత్సవవిగ్రహాలకు హారతులెందుకు?
  2039. మూలవిరాట్టు ముసష్టెత్తుకుంటుంకే ఉత్సవిగ్రహాలకు దద్దో జనం కావాలన్నాడట.
  2040. మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్లు.
  2041. మూసి పెడితే పాసిపోయిందట.
  2042. మృగశిర కురిస్తే ముసలి ఎద్దు కూడా రంకె వేస్తుంది.
  2043. మెగుడంటే ముఖం మాడ్పు, రంకు మెగుడంటే రంగు మార్పు
  2044. మెచ్చి మేకతోలు కప్పమన్నాట్టు.
  2045. మెచ్చి మేక తోలు కప్పినట్టు
  2046. మెడలో రుద్రాక్షలు, మదిలో మధిరాక్షులు
  2047. మెతుకులు చల్లితే కాకులకు కొదవా?
  2048. మెత్తనివాణ్ణి చూస్తే మొత్తబుద్ది అయ్యిందట
  2049. మెరిలేని గొల్ల తీపిలేని చెణకు
  2050. మేకపిల్లను చంకన బెట్టుకొని మేడలన్నీ వెతికినట్లు.
  2051. మేకవన్నె పులి
  2052. మేడసానికుళానికి మంగసాని డోలు.
  2053. మేడిపండులాగా.
  2054. మేతకరణం, కూత కరణం, వ్రాత కరణం.
  2055. మేయబోయి మెడకు తగిలించుకున్నట్లు.
  2056. మేస్త్రీలు మేడగడితే కుక్కకాలు తగిలి కూలిపోయిందట.
  2057. మేహ జాడ్యం, తోట సేద్యం ఏనాటికి ఒగదెగవు.
  2058. మొక్కజొన్న కండె మొదలు,పాగాకు చివర.
  2059. మొక్కబోయిన దేవర ఎదురుగా వచ్చినట్లు.
  2060. మొక్కేవాడికి వెరవాలా మెట్టే వాడికి వెరవాలా.
  2061. మొక్కై వంగనిది మానై వంగుతుందా?
  2062. మొగబుద్ది మోటుబుద్ది, ఆడబుద్ది అవరబుద్ధి.
  2063. మొగుడు కొట్టినందుకు కాదు తోడికోడలు నవ్వినందుకు ఏడ్చిందట.
  2064. మొగుడు కొద్దీ వన్నెలు, సిరికొద్దీ చిన్నెలు.
  2065. మొగుడు చచ్చి మర్రో అంటుంటే మిండ మొగుడు వచ్చి బిడ్డ పుట్టిస్తాలే అన్నాడట
  2066. మొగుడు చచ్చి మొత్తుకుంటూ వుంటే రంకు మొగుడొచ్చి రాళ్ళేసాడట
  2067. మొగుణ్ణి కొట్టి మొగసాల కెక్కినట్టు.
  2068. మొగుణ్ణి గిల్లి మొయ్యో మొయ్యోమన్నదట.
  2069. మొండికి తగ్గ మిండడు.
  2070. మొండికెక్కిన దాన్ని మొగుడేం చేస్తాడు, రచ్చకెక్కిన దాన్ని రాజేం చేస్తాడు.
  2071. మొండికెత్తితే మొగుడేం చేస్తాడు. బండ కెక్కితే బావేం చేస్తాడు.
  2072. మొండివాడు రాజుకంకే బలవంతుడు.
  2073. మొండి శిఖండి.
  2074. మొదట మానెడు, దూడచస్తే దుత్తెడు.
  2075. మొదట మోదుగ పూస్తే కొసన సంపెంగ పూస్తుందట.
  2076. మొదటికి మోసం లాభానికి గుద్దులాట
  2077. మొదటిదానికి మొగుడేలేడు, కడదానికి కళ్యాణం కొవాలట.
  2078. మొదలే కుంటీకాలు, దానికితోడు షక్షవాతం.
  2079. మొరిగే కుక్క కరవదు.
  2080. మొలది విప్పి తలకు చుట్టినట్టు.
  2081. మొలబంటి దుఃఖం మోకాలి బంటి సంతోషం.
  2082. మొహమాటానికి పోతే ముండ గర్భిణి అయిందట.
  2083. మోచేతి క్రింద నీళ్ళు త్రాగినట్టు.
  2084. మోటువాడికి మొగలి పువ్విస్తే తాంబూలమా అన్నాట్ట.
  2085. మోటువాడికి మొగలి పువ్వు ఇస్తే మడిచి ముడ్డో పెట్టుకున్నాట్టు.
  2086. మోటువాడికేం తెలుసు మొగలిపువ్వు వానన?
  2087. మౌనం అర్హాంగీకారం.
  2088. యక్షప్రశ్నలు అక్ష హృదయం.
  2089. యతికోనం పోతే మతి పోయినట్లు.
  2090. యతి మతం మొగుడికి ఎత్తుభారపు పెళ్ళాం.
  2091. యదార్ధవాది లోక విరోధి.
  2092. యధా రాజా తథా ప్రజా.
  2093. యముడన్నా, శివుడన్నా వెరవని వాడుండడు.
  2094. యాదవ కులంలో ముసలం పుట్టినట్టు.
  2095. యుగయుగాలనాటి యుధిష్టరుడిలాగా
  2096. యోగికి, భోగికి రోగికి నిద్రరాదు.
  2097. రంకు చేర్చినమ్మ బొంకునేర్వదా?
  2098. రంకుతనం నేను వేస్తే నీకేం వచ్చిందే పోలేరమ్మ అన్నాట్ట,
  2099. రంకుతనంవల్ల బొంకుతనం వల్ల బతుకుతీరదు.
  2100. రంకునేర్చిన దానికి బొంకు నేర్చింది తోడు
  2101. రక్షించిన వాడ్నే భక్షించు అన్నాట్ట
  2102. రక్షించిన వాళ్లే భక్షించినట్టు.
  2103. రంగసానే దొరసాని దొరసానే రంగసాని .
  2104. రంగుల ఈక పక్షి పంజరానికి అందం.
  2105. రంగులు మార్చేది ఊసరవెల్లి.
  2106. రచ్చక్కినదాన్ని రాజయినా ఏం చేయలేడు.
  2107. రట్టు, రవ్వ రావిపాటి వారిది పుస్తె, పూన వూసపాటి వారిది.
  2108. రండ ముదిరితే రంగసాని, తొండముదిరితే వూసరవెల్లి
  2109. రండి రండి రావే అంటే ముండా వస్తావుందు అందట
  2110. రత్నానికి వాసనుంటుందా స్వార్థానికి రుచుటుందా.
  2111. రత్నాలన్నీ ఒకచోట, రాళ్ళన్ని మరొకచోట.
  2112. రత్నాలిన్నీ కోటలో రాళ్ళన్నీ పేటలో
  2113. రత్నాలు రాలాలి మంత్రాలు వెయ్యి అన్నాట్టు.
  2114. రథమెక్కింది దేవుడే అయినా కదిలించాల్సింది కనకాచారి.
  2115. రథసప్తమి నాటికి రథాలు తిరుగుతాయట,
  2116. రప్పవాల్చింది కొంపలార్భింది
  2117. రంభకోసం స్వర్గానికెళితే రాలుగాయే ఎదురయిందట!
  2118. రమ్మన్నారు తిమ్మన్న బంతికి.
  2119. రవి గాంచనిచోట కవి గాంచునే.
  2120. రహన్యంగా బుట్టలో పెడితే వీధిపాలైందిట
  2121. రహస్యం బట్టబయలు చేసి ప్రచారం మూసేశాడట.
  2122. రాక రాక అంటే పోకే పోకే అందట.
  2123. రాక్షసికి నరమాంసం ముద్దు, పండుకోతికి పుండుముద్దు.
  2124. రాగం తప్పిందిరా అంటే యతికి మతిలేదురా అన్నాట్ట
  2125. రాగంతీస్తే గవయ్య చిడతలు కొడితే రాఘవయ్య.
  2126. రాగంరాని వాడికి పాటమోజు, తాళంరాని వాడికి భజన మోజు
  2127. రాగం రానివాడు, రోగం లేనివాడు లేడు.
  2128. రాగల వసంతాన్ని కాకులు ఆపగలవా?
  2129. రాగాలు తీసి తీసి గవయ్య అయినాడు.
  2130. రాగిగొట్టం అయితే తాయిత్తు బంగారు గొట్టమైతే భుజకీర్తి
  2131. రాగిడబ్బు సంపాదనలేదు వెండిరూపాయి అప్పా?
  2132. రాగులు చల్లితే రేగులు మొలిచాయట
  2133. రాచ పీనుగ తోడు లేకుండా పోదు.
  2134. రాచి రంపాన పెట్టే రకం
  2135. రాజన్నా, రెడ్డన్నా ఒకటే,
  2136. రాజా వారు ముష్టిదాన్ని మెచ్చారేమంటే నాకళ్ళతో చూడు మంత్రీ అన్నాట్ట.
  2137. రాజుకంటే మొండివాడే బలవంతుడు
  2138. రాజుగారి కొడుకైనా కావాలి, లేదా సాని దానికి తమ్ముడైనా కావాలి.
  2139. రాజుగారి బావమరిది హోదా, సానిదాని తమ్ముడుసోకు.
  2140. రాజుగారి బావమరిదైన, బోగందాని తమ్ముడైన అన్నీ లాభాలే!
  2141. రాజుగారి భార్య మేడెక్కితే కుమ్మరి వాడి కోడలు గుడిసెక్కిందట.
  2142. రాజుగారి మేడలో గువ్వ చేరింది,రాణీగారి మేడమీద గోరింక చేరింది.
  2143. రాజుగారి మొదటి భార్య పతివ్రత అంటే రెండో భార్య ...
  2144. రాజుగారి మోజు భోగందానికి భోగం.
  2145. రాజుతలచుకుంకే రాళ్ళచేలో రత్నాలు పండుతాయి
  2146. రాజు తలిస్తే దెబ్బలకు కొదవా.
  2147. రాజును చూచిన కంట మొగుణ్ణి చూస్తే మొట్టబుద్ది అయిందట.
  2148. రాజు మెచ్చింది మాట, మొగుడు మెచ్చింది రంభ.
  2149. రాజు మెచ్చిన భోగంది రాజ్యానికి సాని అయిందిట.
  2150. రాజురాజు అంటే తిండికా, పనికా అని అడిగాట్ట.
  2151. రాజులదగ్గర ఉంటే రత్నాలు 'పేదల దగ్గరుంటే పలుకురాళ్ళు
  2152. రాజులసొమ్ము రాళ్ళపాలు.
  2153. రాజులేని ఊళ్ళు, వూజలేని గుళ్ళు.
  2154. రాజు వలచిన రంభ,రాజు విడిచిన తుంబ
  2155. రాజెక్కింది గుల్హం చాకలెక్కింది గాడిద,
  2156. రాజ్యంకొలిపోయినా బోగందాని బురుజు నిలిచిందిట.
  2157. రాజ్యంపోయింది రాజసం పోయింది ఇంకేముంది పోవటానికి
  2158. రాజ్యం వీరభోజ్యం.
  2159. రాజ్యాలు పోయినా రాజసాలు పోలేదు
  2160. రాటం మీదరాగం ఘోటంమీద దరువు.
  2161. రాట్టల వాడికంటే తునకలవాడు ఘనుడు.
  2162. రాణినాసం వచ్చి మూలవాసం పీకిందట.
  2163. రాణీగారు వచ్చారు రాగి సంకటి వెట్టమన్నారట.
  2164. రాణీవానం వచ్చింది మూలవానం పీకమన్నాట్టు.
  2165. రాత పొడిచినా చావులేదు.
  2166. రాత ముడిచినా చావులేదు.
  2167. రాతరాసింది బ్రహ్మ, గీతగీసింది లక్ష్మణుడు.
  2168. రాతికుండ ఇసకతెడ్డు ఎక్కడన్న వుంటాయా?
  2169. రాతి కుండకు ఇనపతెడ్డు.
  2170. రాతికుండని చూసి మట్టికుండ పారిపోయిందిట
  2171. రాతిబొమ్మకు చక్కలిగింతలు పెట్టినట్టు
  2172. రాతిబొమ్మకు బంగారపు సొమ్ములు, బంగారు బొమ్మకు. ఆకులు,
  2173. రాతి ముగ్గు కోత్రి ముగ్గు
  2174. రాత్రంతా భజనచేసినా భక్తి పూజ్యమేనట
  2175. రాత్రికి వెన్నెల అందం చేనుకు కంకులు అందం
  2176. రాత్రికి వెన్నెల పస పైరుకు వెన్నులు పస.
  2177. రాత్రి జాగారం పగటి పని చెరిచిందట
  2178. రానిపాట పాడ వేడుక బోడితల అంట వేడుక.
  2179. రానున్నది రాకమానదు పోనున్నది పోకమానదు
  2180. రానున్న శని రామేశ్వరం పోయినా తప్పదు.
  2181. రాను రాను రాజు గుర్రం గాడిద అయిందట.
  2182. రాను రామ అంటే రామకోటి, కామ కామ అంటే కామ కోటి!
  2183. రానూ వచ్చి పోయే పోయే రాగులు విసిరి సంకటి చేయమన్నాడట
  2184. రానూ వచ్చె, పోనూపోయే, రాగులు విసరి సంకటి చేయండి అన్నాట్ట.
  2185. రాబందులకు చచ్చిన గొడ్డే ప్రీతి
  2186. రామకోటి రాశాట్టు తీటరోగం వచ్చిందిట
  2187. రామచిలక పలుకు, కోకిలమ్మ కులుకు.
  2188. రామచిలుక మాట మాట అంటే బూతుబూతు అందిట.
  2189. రామన్నకు భీమన్నకు వరస కలిసినట్టు.
  2190. రామరాజ్యంలో తిండికరువా?
  2191. రామరాజ్యంలో బంగారం కరువు భరత రాజ్యంలో భోజనం కరువు
  2192. రామరావణ యుద్ధం.
  2193. రామాపతి, సీతాపతి పొద్దున్నే లేస్తే పొట్టేగతి.
  2194. రామాయణం అంతా విని ఆంజనేయుడికి తోకుందా అన్నాట్ట
  2195. రామాయణమంతా విని రాముడికి సీతేం కావాలి అన్నాట్ట.
  2196. రామాయణమంతావిని రాముడి పెళ్ళాం సీతేనా అన్నాట్ట?
  2197. రామాయణం రంకు,భారతం బొంకు.
  2198. రామాయణం రాసింది బోయ,భారతంరాసింది కోయ.
  2199. రామాయణంలొ పిడకలవెట రంగసాని దిబ్బమీద రంకులాట.
  2200. రామాయణంలో పిడకలవేట.
  2201. రామాయణంలో భీముడెందుకు లేడు అన్నాట్ట.
  2202. రామా రామా అంటే ఏమిరా బూతులు అన్నాట్ట
  2203. రాముడి పాదాలు తగిలితే రాళ్ళు రమణులవుతారు.
  2204. రాముడిలాంటి రాజుంటే హనుమంతుడిలాంటి బంటు అప్పుడే పుడతాడు.
  2205. రాముడివంటి దేవుడు, రావణుడి వంటి రాక్షసుడు లేడు.
  2206. రాముడు కొలుతగిలి రాతినాతయితే నాకాలు రాయికి తగిలీ కోతివుండయింది.
  2207. రాముడులేని రామాయణనమూ?
  2208. రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పనట్లు.
  2209. రాయని భాస్కరుడు.
  2210. రాయని భాస్కరుడు గీయని చిత్రకారుడు.
  2211. రాయి ఏదయినా మానే పళ్ళూడకొట్టుకోవడానికి
  2212. రాయిగుద్దనేల చెయ్యినొవ్వనేల
  2213. రాయిదెబ్బతిన్నా,కర్రదెబ్బతిన్నా కడుపులోకి దొరికితే కైలాసం పోయినట్టే
  2214. రాయిరాయి రాసుకుంటే నిప్పురవ్వలు. కొమ్మా కొమ్మా రానుకుంటే నిప్పుమంటలు.
  2215. రాలిన పళ్ళు వేగినగుళ్ళు
  2216. రాలుగాయి వెళ్లాం పేచీకోరు మొగుడు
  2217. రావణ కాష్టం విభీషణ రాజ్యం
  2218. రావిచెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే బిడ్డలు వుడతారంటే చుట్లు చుట్టుకు పొట్ట చూనుకుందట.
  2219. రాసిన తప్పులు దిద్దుకోవచ్చు చేసిన తప్పులు దిద్దుకోలేము
  2220. రాసుకునేదినాకు వూసనుకూనేది నీకు అన్నాట్ట
  2221. రాహువు కేతువు కలిసి శనికి సహాయం చేశారట.
  2222. రాళ్ళ చేనే రత్నాలు పండుతుంది.
  2223. రాళ్ళన్నీ ఒకచోట రత్నాలన్నీ ఒకచోట
  2224. రాళ్ళు తిని రాళ్ళు అరిగించుకుంటాడు
  2225. రుచికి పుల్లకూర వాసనకు కరివేపాకు.
  2226. రుచి మరిగిన పిలి ఉట్టిమీద కెక్కినట్టు.
  2227. రుద్రాక్ష పిల్లి వంటివాడు (కపట సన్యాసి మోసగాడు).
  2228. రూకలేని వాడు పోక చేయలేడు.
  2229. రూపాయిలేని వాడు కాని లేనివాడి దగ్గరికి అప్పుకెళ్ళాట్ల
  2230. రూవం వల్ల స్త్రీలు, పరాక్రమం వల్ల పురుషులు రాణిస్తారు.
  2231. రెక్కలాడించిందే పక్షి
  2232. రెక్కలు తెగిన షక్షి.
  2233. రెక్కలేని షక్షి తోకలేని చుక్క
  2234. రెక్కాడితేకాని డొక్కాడదు.
  2235. రెక్కాడితేగాని డొక్కాడని వాడికి రత్నం దొరికితే రాయి అన్నాట్ట.
  2236. రెంటికి చెడ్డ రేవడులాగా.
  2237. రెండావుల పాలు తాగిన దూడలాగా.
  2238. రెండు చేతులతో కొడితేనే చప్పుడవుతుంది.
  2239. రెండుపూటలా తినడంభోగం ఒంటిపూట తింటం ఉపవాసం
  2240. రెండురెండే మెల్లంగారెండే
  2241. రెండూ రెండే, రెంటికీ కుళ్ళే.
  2242. రెండూ రెండే, రెంటికీ వుండే.
  2243. రెడ్డాచ్చె మొదలాడు రాజొచ్చెమళ్ళాడు అన్నాట్ట.
  2244. రెడ్డివచ్చె మొదలాడ మన్నట్టు.
  2245. రెడ్లల్లొ వడ్లలో రకాలు చెప్పలేం.
  2246. రెడ్లున్న ఊళ్ళో రేచులున్న కొండలో ఏమీ బతకవు
  2247. రెప్పలార్చేవారు కొంపలార్చుతారు, కళ్ళార్చే అమ్మ ఇల్లార్చుతుంది
  2248. రేగుచెట్టు క్రింద గ్రుడ్డివాడిలాగా.
  2249. రేపటికి రెండు అనుకుంటే ఎల్లుండికి మూడు
  2250. రేపు మాపు తురకేమాపు
  2251. రైతు శ్షేమం, రాజు భాగ్యం.
  2252. రైతేరాజు బుధుడేమంత్రి
  2253. రొట్టవిరిగి నేతిలోపడ్డా తినే అద్భష్ట్రముండాలి.
  2254. రొట్టె విరిగి నేతిలో పడినట్టు.
  2255. రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు.
  2256. రొయ్యకు లేదా బారెడు మీసం.
  2257. రొయ్యగాడికి బారెడు మీసం, రోషగాడికి మూరెడు మీసం
  2258. రొయ్యమీసాలు దోమనంగీతం ఎవరికోసం?
  2259. రోకలితేరా పిచ్చోడా అంకే తలకి చేట్టుకోనా అన్నాట్ట
  2260. రోగం ఒకటి మందొకటి
  2261. రోగం ఒకటైతే మందొకటిచ్చాట్టు.
  2262. రోగం రట్టు, నంసారం గుట్టు.
  2263. రోగం సంగతి రట్టయింది సంసారం గుట్టుగా ఉంచు అన్నాట్ట
  2264. రోగాన పడీ పడీ నరకాన చేరాడు.
  2265. రోగానికి తగిన మందు పడితేనే రోగికి లాభం
  2266. రోగానికి, రాగానికి, భోగానికి అంతంలేదు
  2267. రోగాలు మనుషులకు కాక మానులకొస్తాయా.
  2268. రోగాలు రాగాలు ఎన్నెన్నో ఉన్నాయి
  2269. రోగాల్లో కెల్లా గురక ప్రమాదం.
  2270. రోగికి నిద్రరాదు, భోగికి కునుకురాదు
  2271. రోగికోరిన పత్యమే వైద్యుడు చెప్పాడు
  2272. రోగీ పాలే కోరాడు, వైద్యుడూ పాలే చెప్పాడు.
  2273. రోజూ చచ్చేవాడికి ఏడ్చేవాడెవడు.
  2274. రోజూతినేది తిండి. భక్ష్యంతో తినేది భోజనం
  2275. రోటికాడ రోకటిపాట ఇసుర్రాయికాడ అదేపాట.
  2276. రోటిపాట, రోకటి పాట.
  2277. రోట్లో తలవెట్టి రోకటి పోటుకు వెనుతీయడంలాగా.
  2278. రోలు వెళ్ళి మద్దెలతో మొర పెట్టుకున్నదట.
  2279. రోలెక్కిన చిన్నది వోలి ఇచ్చిరమ్మన్నదట
  2280. రోషంలేని బంటుకు మీసంలేని రాజుకు నష్టమే లేదు.
  2281. రోషంలేని బంటుకు మోసంలేదు.
  2282. రోషానికి పోయిన సందెగాడు రోలుమెళ్ళో కట్టుమన్నాట్టు
  2283. రోషానికి పోయి రోలు మెడకు కట్టుకున్నట్లు.
  2284. రోహిణీ కార్తె ఎండలకు రోళ్ళు పగులుతాయట.
  2285. రౌతుకొత్తైతే గుఱ్ఱం కుంటిదట
  2286. రౌతుకొద్ది గుర్రం.
  2287. రౌతు మెతక అయితే గుర్రం మూడుకాళ్ళతో నడిచిందంట,
  2288. లంకణం చేయమంటే వచ్చమేంటి అన్నాట్ట.
  2289. లంకణాల్లో తెచ్చుకున్న బలమంతా అపత్యంలో హరించుకు పోతుంది.
  2290. లంకంత కొంప.
  2291. లంకంత కొంపలో చెట్టంత చీపురు.
  2292. లంకను కాల్చిన వాడు రాముడి లెంక.
  2293. లంక మేతకు, ఏటి ఈతకు సరి.
  2294. లంకలో పుట్టిన వాళ్ళంతా రాక్షసులే.
  2295. లంకలో పుడితే రాక్షసుడు, కిష్కిందలో పుడితే కోతి.
  2296. లంకలో మేత తేవాలి ఏటికి అడ్డుకట్టైమన్నాడట
  2297. లంకలో విభీషణుడు అడవిలో సూర్పణఖ
  2298. లంకా దహనం.
  2299. లక్కజొచ్చిన నగ, నక్క జొచ్చిన ఇల్లు.
  2300. లక్ష నక్షత్రాలైనా ఒక చంద్రుడు కాడు.
  2301. లక్ష భక్ష్యాలు తినే కుక్షికి ఒక భక్ష్యం లక్ష్యమా.
  2302. లంఖణం పరమౌషధం.
  2303. లంఖణానికి పెడితే పత్యానికి దిగుతుంది.
  2304. లగ్గమంకే పగ్గమన్నట్టు.
  2305. లగ్గం ముందా పల్లకి ముందా అన్నాట్ట.
  2306. లంచమిస్తేగాని మంచమెక్కదు.
  2307. లంజకు నిగ్గు 'సంసారికి సిగ్గు ఉండాలి.
  2308. లంజకు పిల్ల తగలాటకం.
  2309. లంజ చస్తేనేం మంచ మిరిగితేనేం.
  2310. లవణం అంటే నాకు తెలియదా, సోమిదేవమ్మ కూతుర్ని దూడరేణం అన్నట్టు.
  2311. లాకేత్వము,దాకి కొమ్ము ఇవ్వని వాడు
  2312. లాఠీ లాలీ జో లారీ లారీ ఢీ
  2313. లాభం గూబలోకి వచ్చినట్టు.
  2314. లాభం గూబలో కొచ్చింది ఆవునెయ్యితో తలంటమన్నాట్ట
  2315. లాభం లేనిదే సెట్టి వరదనబడిపోడు.
  2316. లాభం లేని శెట్టి వరదన పోడనీ చెయ్యిచాచినా అందుకో లేదట.
  2317. లాభానికి వ్యాపారం జుట్టుపట్టుకోడానికి జూదం.
  2318. లేకలేక లోకాయి పుడితే చెవులు కుట్టడానికి గడ్డపార కావాలన్నాట్టు.
  2319. లేక లేక లోకాయి పుడితే లోకాయ కన్ను లోట్టు బోయిందట,
  2320. లేకుండా చూచి పోకుండా వట్టమన్నట్లు.
  2321. లేడికి లేచిందే ప్రయాణం.
  2322. లేడికి లేచిందే ప్రయాణం పందికి పడుకుందే నిద్ర.
  2323. లేని దాతకంటే ఉన్న లోభి నయం.
  2324. లేనిదానికోనం పోతే ఉన్నది కాస్తాపోయింది
  2325. లేనిదానికోసం పోతే ఉన్నది ఊడిపోయినట్టు.
  2326. లేనివాడు లేక ఏడిస్తే ఉన్నవాడు తినలేక ఏడ్చాడట.
  2327. లేవలేని అత్త ఒంగలేని కోడలు.
  2328. లేవలేని అత్తకి ఓపికలేని కోడలు సహాయం
  2329. లేస్తే మనిషికాడు కదిలే కోతికాడు
  2330. లేస్తే మనిషిని కాదు అన్నట్టు.
  2331. లోకం ఎరగనివాడు అలంకారం ఎరగని అడది కొరగారు
  2332. లోకం మెచ్చింది గొప్ప లోభిమెచ్చింది దిబ్బ.
  2333. లోకాజనాసుఖినో భవంతు అంటాడు విద్వానుడు, అనారోగ్యమే మహా భాగ్యం అంటాడు వెద్యుడు.
  2334. లోకాభి రామాయణం.
  2335. లోకాయికి మాటనస్ట్రం లోభికి మూటనష్టం.
  2336. లోకులు పలుగాకులు.
  2337. లోకో ఛిన్న రుచిః.
  2338. లోగుట్టు పెరుమాళ్ల కెరుక.
  2339. లోగుట్టు పెరుమాళ్ళకెరుక తెరగుట్టు సాతానికెరుక,
  2340. లోన లొటారం వైన పటారం.
  2341. లోభికి ఖర్చెక్కువ
  2342. లోభికి మూట నష్టం,
  2343. లోభిసామ్ము లోకులపాలు కానిసామ్ము కాకులపొలు.
  2344. లోభి సామ్ము లోకులపొలు.
  2345. వంకాయ కూరకు టేంకాయ మసాల.
  2346. వంకాయ దొంగిలించినవాడు టెంకాయ దాగా రాడా
  2347. వంకాయ వంటి కూరాలేదు, శంకరుడి వంటి దైవంలేదు.
  2348. వంగకు ముదురు నాటు, అరటికి లేత నాటు.
  2349. వగటిమాటలు పనికిచేటు, రాత్రి మాటలు నిద్రకుచేటు.
  2350. వంగతోటకాడ మాత్రం వదిన అని అనవద్దు అన్నట్లు.
  2351. వగలమారి వంకాయ శగ తాకగానే సగమైంది.
  2352. వగలాడీ నీ మొగులెందరే అంతే తొలి మొగుడితో తొంభైమంది అందట.
  2353. వగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తుందన్నట్టు.
  2354. వంచె కేడరా పత్తి ధర.
  2355. వచ్చిన నాడు వరా చుట్టం, మర్నాడు మాడచుట్టం,మూడవనాడు మురికి చుట్టం.
  2356. వచ్చినపేరు చచ్చినాపోదు.
  2357. వచ్చిన వాదు చచ్చిన పోదు.
  2358. వచ్చీరానీ మాటలు, ఊరీ ఊరని ఊరగాయ రుచి.
  2359. వచ్చేదల్హా రానీ పోయేదల్లా పోనీ.
  2360. వజ్రాయుధం.
  2361. వజ్రాయుధం వంటి మందు రామబాణం వంటి రోగం.
  2362. వంటఇంట కుందేలు కుంపటిదగ్గిర కోడి.
  2363. వంట ఇంటీ కుందేలు లాగా.
  2364. వంటిపూట రోగానికి వుట్టెడుమందులు.
  2365. వట్టిగొడ్డుకు అరువులెక్కువ, వానలేని మబ్బుకు ఉరుములెక్కువ.
  2366. వండనమ్మకన్న దండుకున్నమ్మ మేలు.
  2367. వండని కూడు, వడకని బట్ట.
  2368. వండమని అక్కకాళ్ళు మొక్కాలి, వినమని బావకాళ్ళు మొక్కాంలి.
  2369. వండలేనమ్మకు వలపులు మెండు. తేలేనమ్మకు తీపులు మెండు.
  2370. వడిశం పది రోగాల పెట్టు.
  2371. వండుకున్నమ్మకు ఒక్కటి కార అడుక్కు తినే అమ్మకు అరవై ఆరు కూరలు.
  2372. వండుకోడం చేతకానమ్మకు దండుకోడం చేతవ్వాలి.
  2373. వడ్డించేవాడు మన వాడేలే కడ బంతిన కూచో పరవాలేదు అన్నాట్ల
  2374. వడ్డువాగున పోతేనేం, గడ్డి గాలిన పోతేనేం.
  2375. వడ్డెరోడికి వెళ్ళాం పెద్దది ,కాపోడికి గొడ్డు పెద్దది కొవాలట
  2376. వడ్డై ఉప్పర, సభా మధ్యే, వైదీతః పండితోత్తమ.
  2377. వడ్ల గింజలోది బియ్యపు గింజ.
  2378. వనం విడిచిన షక్షి, జనం విడిచిన మనిషి
  2379. వనిత కాని, కవిత కాని వలచి రావలసిందే.
  2380. వనితక్కాని లతకుకాని కవితకుకాని సహాయం అవసరం.
  2381. వనుదేవుడు పోయి గాడిద కాళ్ళు పట్టుకున్నట్టు.
  2382. వంభం చాటుగాడొకడు, అదే పోతగాడు ఒకడు, పోతే రానివాడు మరొకడు.
  2383. వయసు తప్పినా వయ్యారం తప్పలేదు.
  2384. వయసువస్తే వంకలు తీరతాయి.
  2385. వయస్సు వస్తే సరసం వస్తుందా?
  2386. వరహా అసలుకన్నా మెహరు వడ్డీ ముద్దు.
  2387. వరహాకన్నా వడ్డీ ముద్దు, కొడుకుల కన్నా మనవడు ముద్దు.
  2388. వర్షంకురుస్తుంది అనుకుంటే వరద సూడేసిందట.
  2389. వర్షాకాలంలో వరదలు ఎండాకాలంలో వడగాలులు
  2390. వంశమెరిగి వనితను, వన్నె ఎరిగి పశువును కొనాలి.
  2391. వశిష్ఠుల వారు మంత్రాలు చదివితే పెళ్ళి అయిపోయినట్టేనా
  2392. వసంతం వచ్చింది కోకిల కూసింది.
  2393. వసుదేవుళ్ళాంటి వాడే అవసరానికి గాడిదకాళ్ళు పట్టాడు.
  2394. వస్తానన్నదాన్ని, ఇస్తానన్నవాణ్ణి నమ్మరాదు.
  2395. వస్తానయ్యా బావనయ్యా అంటే వద్దే ముండా వర్జ్యముంది అన్నాట్ట.
  2396. వస్తూ ఏం తెచ్చావు, పోతూ ఏ మిచ్చిపోతావు.
  2397. వాగుదాటేదాకా ఓడమల్లయ్య, వాగుదాటిన తర్వాత బోడి మల్లయ్య
  2398. వాడ వదిన కేలరా వావి వరుసలు.
  2399. వాతల అందం చూసి వాతరోగం పోయిందిట. (--)
  2400. వాతాపి జీర్ణం, వజ్ర శరీరం.
  2401. వాదినాశనం,ప్రతివాదిముదనష్టం, ప్లీడర్ల అద్భృష్టం,కోర్టు వారి ఇష్టం.
  2402. వానబడాయి చవిటి మీద, మాలబడాయి పాటి మీద, భర్త బడాయి భార్య మీద.
  2403. వాన రాకడ,ప్రాణం పోకడ ఎవరికీ తెలియదు.
  2404. వాన వుంటే కరువు, పెనిమిటి ఉంటే పేదరికం లేదు.
  2405. వాపు బలుపూ కాదు, వాత అందమూకాదు.
  2406. వాములు మింగే స్వాములకు పచ్చిగడ్డి ఫలహారమా.
  2407. వారకాంత కట్టిన చీర వారణాసిపట్టు, పేదరాలు కట్టిన చీర పిచ్చిపట్టు.
  2408. వారణాసిలో గంగశుద్ది జగన్నాధంలో కులంశుద్ది.
  2409. వావి వరుసలు తప్పి వర్తిస్తే చెడిపోతారు.
  2410. వాసనంటూ ఉంటే ఏ గుడ్డ కప్పినా ఆగదు.
  2411. వాసం పారు తప్పరాదు చుట్టరికం కులంతప్పరాదు
  2412. వాసానికి తగిన కూసం.
  2413. వాసి తరిగితే వన్నె తరుగుతుంది.
  2414. వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు తులాభారం తూగితే కారెర్డ కారెక్క వంకాయల భారం తూగిందట.
  2415. వాస్తుగలవారి కోడలు వరహా ఇచ్చి క్షవరం చేయించుకున్నదట.
  2416. వాళ్ళు పిల్ల నివ్వనన్నారు, నేను చేసుకోనన్నాను.
  2417. విగ్రహం పుష్టి నైవేద్యం నష్టి
  2418. విఘ్నేశ్వరుడి పెళ్ళికి వేయి విఘ్నాలు.
  2419. విజయభేరి మ్రోగించు అంటే రణభేరి మ్రోగిప్తానన్నాట్ట
  2420. వింటే బేగడ (ఒకరాగం) వినాలి తింటే మీగడ తినాలి.
  2421. వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి.
  2422. విడవమంటే పాముకు కోపం, పట్టమంటే కప్పకు కోపం.
  2423. విడిచింది వీధికి పెద్ద, బరితెగించింది బజారుకు పెద్ద.
  2424. విడిచిన ముండకు వీరేశలింగం, తెగించిన వాడికి తెడ్డే లింగం.
  2425. వింత లేకుండా ఆవలింతరాదు.
  2426. విత్తం కొద్ది నిభవం, విద్యకొద్దీ వినయం.
  2427. విత్తనం మర్రివృక్షానికెంత
  2428. విత్తు ఒకటి చేస్తే చెట్టు ఒకటే మొలుస్తుందా.
  2429. విదియనాడు కనపడని చంద్రుడు తదియనాడు తనంతట తానే కనపడతాడు.
  2430. విందైనా మందైనా మూన్నాళ్ళు.
  2431. విద్యలేని అయ్యగారికి వినయంలేని బంట్రోతు.
  2432. విద్యలేని బ్రాహ్మడు కత్తిలేనిక్షత్రియుడు.
  2433. విధవకు తల సుడులు వెతకేనట్లు.
  2434. విధవకు మొక్కితే నాలాగా నూరేళ్ళు వర్ధిల్లమందట. రెండో సారి మెక్కితే నా మెగుడిలాగా వర్ధిల్లమందట
  2435. విధవ ముండకైనా వేవిళ్ళు తప్పవు.
  2436. వినయం లోక వశీకరణం, విద్య రాజు వశీకరణం.
  2437. వినాయకుడి మీది భక్తా, ఉండ్రాళ్ళమీద భక్తా
  2438. విన్నమ్మకు వీపు కాలింది, కన్నమ్మకు కడుపు కాలింది.
  2439. విన్సన్న చెప్పిందే వేదం.
  2440. విప్రహస్తం, ఏనుగు తొండం ఊరుకోవు.
  2441. విభూతి పట్టెలు పెట్టుకుంటే విష్నుమూర్తీనుకున్నానే, ఒహో ఆంజనేయుడి వటోయ్ వెంకటేశ్వర్లు అన్నాడట
  2442. వియ్యపు రాలికి వీపుదెబ్బలు, నాకుతోవు దెబ్బలు.
  2443. వియ్యానికైన్నా కయ్యానికైనా సాటి వారుండాలి.
  2444. వియ్యువురాలి పేరు విసరమ్మ,నా పేరు దంచమ్మా.
  2445. విరజాజి పూదండ విధవకేల
  2446. విరుగుబాటు మానెపైన నూనె బొట్టు,విరిచి కట్టపైన పెరుగు బొట్టు
  2447. విరోధికి లోకం గిట్టదు, యదార్ధానికి అసత్యం గిట్టదు.
  2448. విశాఖ చూచి విడవర కొంప, ఉత్తర చూచి ఎత్తర గంప
  2449. విశాఖలో ఇల్లుకట్టద్దు, పుబ్బలో విత్తు చల్లద్దు అన్నాట్ట.
  2450. విశాఖ వరదలు, సంక్రాంతి మబ్బులు.
  2451. విశ్వామిత్రుడు సృష్టించినదే త్రిశంకు స్వర్గం
  2452. విశ్వేశ్వరుడైనా శని ప్రభావానికి లోకువ
  2453. విషపాళెపు విత్తు,నేపాళెపు గింజ.
  2454. విషం మాటలు తేనె వూతలు
  2455. విషంలో పుట్టిన వురుగు విషంలోనే జీవిస్తుంది.
  2456. విష్ణువు వుపేరుతో గంగిరెద్దు శివుడు పేరుతో ఆంబోతెద్దు.
  2457. విసరగా విసరగా రాయి, తిట్టగా తిట్టగా తిట్టు తగులుతుంది.
  2458. విసిరినమ్మకు బొక్కందే కూలి.
  2459. వీధిలో చేసుకున్నాడు ఇంట్లో ఉంచుకున్నాడు.
  2460. వీధిలో వీరంగం సంతలో సారంగం.
  2461. వీపు మీద కొట్టొచ్చుగాని కడువు మీద కొట్టురాదు.
  2462. వీరణం లేనిది కొలువు కాదు, వూరణం లేనిది బూరెకాదు.
  2463. వీరణానికి తోరణం కడితే తాతయ్యకు పెళ్ళా అందిట.
  2464. వీరభోగ వసంత రాయలు. .
  2465. వీరమ్మభోగం రాగమ్మరాగం.
  2466. వీలెరిగి మాటు, కీలెరిగి వాత.
  2467. వుట్టని బిడ్డకు పేరుపెట్టినట్టు.
  2468. వుట్టి చచ్చినా పుత్రుడే మేలు.
  2469. వుట్టింటి మీద ఆశ, పుచ్చుమీద
  2470. వుట్టుట గిట్టుట కొరకే పెరుగుట విరుగుట కొరకే,
  2471. వుండి వుండి వసంతమాడాలనుకుంటే అవ్వ ఎదురొచ్చింది
  2472. వుణ్యంకొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు, ప్రారబ్దంకొద్దీ వెళ్ళాం.
  2473. వురిట్లోనే నంధి కొట్టినట్టు.
  2474. వురైకో బుద్ది జిహ్వకోరుచి.
  2475. వులి కడుపున మేక పుడుతుందా.
  2476. వులిని చూచి నక్క వాత పెట్టుకున్నట్లు.
  2477. వులి మీద వుటలాగా.
  2478. వుల్లిలేని కూర పప్పులేని పెళ్ళి.
  2479. వువ్వుపుట్టగానే పరిమళిస్తుంది వుండు పుట్టగానే వాసనే స్తుంది.
  2480. వూజకొద్దీ పురుషుడు, పుణ్యం కొద్దీ పుత్రుడు.
  2481. వూజా పునస్కారాలు లేక బూజెక్కి ఉన్నానుగాని నైవేద్యం పెట్టి చూడు నా మహిమ చూపిస్తానన్నాడట.
  2482. వూడ్చలేని గొయ్యి, తీర్చలేనంత అప్పు చేయరాదు.
  2483. వూబోడి అంటే ఎవర్రా బోడి నీ అమ్మ బోడి, నీ అక్క బోడి అన్నదట.
  2484. వూరి గుడిసెకు చాందిని మంచం కావాలా.
  2485. వూరుకోలేక వురి పోనుకున్నట్టు.
  2486. వూర్ణంలేని బూరె, వీరణం లేని వెళ్ళి.
  2487. వృద్దనారీ పతివ్రత.
  2488. వృద్ద వైద్యం, బాల జోస్యం.
  2489. వెంకకేశ్వరుడికే తప్పలేదు వడ్డీలు కట్టడం.
  2490. వెక్కిరించబోయి బోర్లపడినట్లు.
  2491. వెంట రావద్దంటే ఎత్తుకోమని ఏడ్చాడట.
  2492. వెంట్రులున్నమ్మ ఏ కొప్పెనా పెడుతుంది.
  2493. వెతక పోయిన తీర్ణం ఎదురైనట్లు
  2494. వెనక ముందు చూచి మాట్లాడాలి,
  2495. వెనుక తుమ్ము ముందుకు లాభం.
  2496. వెన్న తిన్నవాడు వెళ్ళిపోగా చల్ల తాగినవాణ్ణి చావబాదిందట.
  2497. వెన్నపూస వొళ్ళో ఉంచుకొని నేతి కోసం తడుముకున్నట్టు
  2498. వెన్నలో వెంట్రుకలు తీసినట్టు
  2499. వెన్న వెడితే మింగలేడు, వేలు పెడితే కొరకలేడు.
  2500. వెన్ను వేస్తే వైరుకర్ర పొన్నువేస్తే చేతికర్ర
  2501. వెన్నెల అడవి కాచినా, వర్షం సముద్రంలో కురిసినా ఒకే.
  2502. వెన్నెల కాస్తే పున్నమి చుక్కలు కాస్తే అమాస.
  2503. వెన్నెల కొన్నాళ్ళు, చీకటి కొన్నాళ్ళు
  2504. వెంపలి చెట్లకు నిచ్చెన చేసినట్లు.
  2505. వెయ్యిళ్ళ పూజారి వెతికినా దొరకడు.
  2506. వెర్రికుదిరింది రోకలి తలకు చుట్టుమన్నాట్ట.
  2507. వెర్రిపెయ్యకు తొర్రిపెయ్య తోడు
  2508. వెర్రి మొద్దుకేల వేద శాస్త్రాలు.
  2509. వెర్రి వేయి విధాలు.
  2510. వెలమలున్న ఊరు కొంగలున్న మఱ్ఱి ఒకటే.
  2511. వెలయాలికిచ్చిన సొమ్ము, గోడకు వేసిన సున్నం తిరిగిరావు.
  2512. వెలయాలి మాట కలలో మూట.
  2513. వెలలేని మాణిక్యం.
  2514. వెల్లటూర్లో ఎద్దును, పర్బూరులో వడుచును ఇవ్వరాదు.
  2515. వెల్లికిలాపడుకుని ఉమ్మేస్తే తన ముఖంమీదనే పడుతుంది.
  2516. వెస్టవుడు గురువుసాతాని శిష్యుడు.
  2517. వెళ్ళాం బెల్లం తల్లి దయ్యం.
  2518. వెళ్ళినాటి భోగం లంఖణాలనాడు
  2519. వెళ్ళిపామ్మంకే చూరుపట్టుకు వ్రేళ్ళాడినట్లు.
  2520. వేగవేగని పెనరపప్పూ వెనక వచ్చిన వెళ్ళాము రుచి అంట.
  2521. వేగి వేగనమ్మ వేకువ ఝామున ముట్టయితే తెలవిగలమ్మ తెల్లవారు ఝామున ముట్టయిందట
  2522. వేట భారతం కంబ రామాయణం.
  2523. వేటికి వేస్తే మెలికె కాలికి వేస్తే బంధం
  2524. వేడి నీళ్ళ పక్కన చన్నీళ్ళు ఉండాలి.
  2525. వేడుక వెంకటేష్వరుడిది, గోల గోవిందుడిది
  2526. వేణ్ణీళ్ళకు చన్నీళ్ళు తోడైనట్టు
  2527. వేమన్న మాట వెర్రి మాట కాదు
  2528. వేములు కాస్తే భూములు పండుతాయట.
  2529. వేములో తీపుండదు అత్తరికంలో ప్రేమ ఉండదు.
  2530. వేయి వరహాలు వెట్టి ఏనుగుకోనేవాడు అరవీసం పెట్టి అంకుశం కొనడానికి పాలుమానతాడా.
  2531. వేరుకు అందాలి నీరు కంకికి అందాలి పైరగాలి.
  2532. వేరులో పురుగు పుడితే వృక్షానికే చేటు
  2533. వేర్లు వడ్డ కాపురం గట్టు పడ్డ పొలం
  2534. వేలం వారి పెళ్ళికొడుకు మారడగ నెరడు ఉన్నదంతా ఊడ్చిపెట్టమన్నట్టు
  2535. వేలం వెర్రి గొర్రిగాటు.
  2536. వేలంవేస్తే అధికారి దండోరావేస్తే ఊరికాపరి.
  2537. వేలుకు వేస్తే కాలికి కాలికి వేస్తే వేలికి వేసినట్టు.
  2538. వేలు మీద గోరు మొలిచింది,వేరే పోదాం రారా వెర్రి మొగడా అందట
  2539. వేలువాయి వేదాంతం.
  2540. వేలు వెట్టే సందు ఇస్తే కాలు దూర్చినట్టు.
  2541. వేల్పుల మొక్కులు వెయ్యేళ్ళు.
  2542. వేషాలెన్ని వేసినాగ్రాసాలకోసమే.
  2543. వైకుంఠం పోవాలనుందా నాచేతిమాత్ర ఒకటిస్తానన్నాట్ట,
  2544. వైద్యుడి పెళ్ళాం కూడా ముండ మోసేదే అన్నాట్ట.
  2545. వైన పటారం, లోన లొటారం.
  2546. వైరాగ్యంకోసం పురాణం వింటే పచ్చిశ్చంగారం వంటపట్టిందట.
  2547. వైసాలోనే పరమాత్ముడున్నాడు.
  2548. వొంటినిండా గంధం పంటినిండా వక్క
  2549. వొడికితే దారం, ఒణికితే రోగం
  2550. వ్యాఘ్రానికి దయలేదు కామధేనువుకు స్వార్థంలేదు.
  2551. వ్యాస ప్రోక్తమా, పరాశర ప్రోక్రమా అన్నట్టు.
  2552. వ్రతం చెడ్డా నుఖం దక్కాలి.
  2553. వ్రాసేవాణ్ణి, కో'సేవాణ్ణి, గీసేవాణ్ణి నమ్మరాదు.
  2554. శంకరగిరి మాణ్యాలకు దారి ఎటు అడిగాట్టు.
  2555. శంకరా శంకరా అంకే మూతి వంకర పోద్దాన్నట్లు
  2556. శంకినీ జాతికి పద్మినీ బుద్దులా?
  2557. శంకినీ జాతి పొతివ్రత్యం.
  2558. శకునంచూసి వెళ్ళి కెళితే పేలాలేగాయట
  2559. శకుని.
  2560. శంఖం ఊదేది శంకుపాతేది
  2561. శంఖంలొ పోస్తే తీర్ధం, పెంకులో పొస్తే నీళ్ళు
  2562. శంఖంలో పోస్తేకాని తీర్ధం కాదు
  2563. శగ తగిలితే పాకం కరుగుతుందట.
  2564. శఠగోపం లేకుంటే నా కంఠం పోయే, ఇంటికిపోయి గంట బోర్లించుకుంటా అన్నాడట
  2565. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు
  2566. శతకోటి లింగాలలో నా బోడి లింగం చూడమన్నాడట
  2567. శతకోటి లింగాలున్నాయంటే నాదెక్కడుంది అన్నాట్టు.
  2568. శతమర్కట తు విద్యార్దిని కాను అన్నాట్ట
  2569. శతమానం నాకెందుకూ ఒక మానంతో చస్తుంటే అన్నాట్ట
  2570. శతమానం భవతి అంటే ఒకటి చాల్లే అన్నదిట
  2571. శతృశేషం, ఋణశేషం, అగ్నిశేషం, రోగ శేషం మిగల్చరాదు
  2572. శతేరగా వచ్చింది ఊరికే పోతుంది.
  2573. శత్రువుని చూసి కోపం సంతుని చూసి శాంతం
  2574. శనగలు తిని చేయి కడుక్కున్నట్టు
  2575. శనిగ్రహం.
  2576. శనిగ్రహం చూపు భుధగ్రహం దయ.
  2577. శనిపడితే ఏడేళ్ళు, నేను పడితే పద్నాలుగేళ్ళు
  2578. శనేశ్వరుడికి నిద్ర ఎక్కువ, దరిద్రుడికి ఆకలెక్కువ
  2579. శంభులింగం కుప్పెకట్టు, రామలింగం కనికట్టు
  2580. శంభో శంభో అంటే మూతివంకరపోయింది అన్నాట్ట
  2581. శయనే కాదని తెలిపిన వాడే శాస్త్రకారుడు
  2582. శల్య సారధ్యం.
  2583. శవానికి చేసిన అలంకారం లాగా
  2584. శస్త్రానికి అంటులేదు. యజ్ఞానికి ఎంగిరి లేదు.
  2585. శాస్తుర్లవారు సంధ్య వారక పోతే పాద్దుకుంకదా
  2586. శాస్త్రుల వారింట జన్మించి సోమయాజుల ఇంట జొచ్చి లవణ మంటే దూడ రేణమని ఎరగనా అన్నట్లు.
  2587. శింగన్న అద్దంకి పోనూ పొయ్యాడు, రానూ వచ్చాడు.
  2588. శింగినాదం, జీలకర్ర.
  2589. శిరిపోయినా చిన్నెలు పోలేదు.
  2590. శిరోభారం ఎందుకొచ్చిందంకే ఆలి చెయ్యి తగిలిందన్నాట్ట
  2591. శిలాభోగం, స్థలాభోగం, స్టలాభోగం, నరభోగం కానరావు.
  2592. శివకాశిలో చేసింది ఆటంబాంబుకొదు రాజన్న చేసిందే రాకెటుకాదు.
  2593. శివ ఢివ అన్ననోటితో ఛీ ఛి అన్నాట్ట
  2594. శివమెత్తిన గంగిరెద్దులా చిందులు తొక్కినట్టు.
  2595. శివరాత్రికి చరి శివ శివ అని పోతుంది.
  2596. శివరాత్రికి చలి శ్రీరామనవమికి ఎండ.
  2597. శివరాత్రికి జంగొలు, సంక్రాంతికి హరిదాసులు.
  2598. శివరాత్రికి జీడిగింజలు ఉగాదికి ఊరగాయ.
  2599. శివశివ అని సిగపెంచితే గోవిందా అని గొరిగేశాట్ట.
  2600. శివార్చకుడు వెళ్ళి తంబళిని కొట్టాట్టు
  2601. శివుడంటే యముడికి కూడా భయమే
  2602. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు.
  2603. శిష్యుడు పెరిగితే గురువు
  2604. శీకాషా లెస్స అంటే గరుడాయ గరుడాయ లెస్స అన్నట్లు
  2605. శుక్రవారంనాడు తన సామ్ము మంగళవారం నాడు మంది సొమ్ము దాచుకోవాలట
  2606. శుక్రవారం శక్తిపూజ శనివారం శివపూజ.
  2607. శుంఠశుంఠ అంటే నాపేరెట్ల తెలుసు అన్నాట్ట.
  2608. శుద్దులు వందై నా ఒక్కముద్దు మిన్న
  2609. శుభం పలకరా పెళ్ళికొడకా అంకే పెళ్ళికూతురు ముండ ఎక్కడౌంది అన్నాట్ట
  2610. శుష్కు ప్రియాలు, శూన్యహాస్తాలు
  2611. శృతి మించి రాగాన పడినట్టు.
  2612. శెట్టిచేసిన ధర్మాలు సత్రంరాయిలో తెలుస్తాయిట
  2613. శెట్టి శింగారించేలోగా పట్నమంతా కొల్లబోయింది.
  2614. శేరుకు నవాశేరు.
  2615. శేరుదొరకు, మణుగు
  2616. శేషాయ బుసలు కొడితే గరుడాయి గాండ్రించాడట
  2617. శొంఠిలేని కషాయం లేదు
  2618. శోభనంనాటి ముచ్చట్లు లంఖణం నాడు తలచుకున్నట్టు,
  2619. శోభనం నాడు సంతోషం, పురిటి నొప్పుల్లో ఏడుపు తప్పవా
  2620. శ్యామలా కారుడమ్మా ఈ బిడ్డ శాన్నాళ్ళు బ్రతకడమ్మా.
  2621. శ్రావణ మేఘాలూ చిత్త జల్లులు.
  2622. శ్రీమహాలక్ష్మికి అవతారాలెక్కువ.
  2623. శ్రీరంగ నీతులు చెప్పెవారె కాని చేసేవారు లేరు.
  2624. శ్రీరామరక్ష, నూరేళ్ళు అయుష్ట
  2625. శ్రీవైప్లవులమధ్య రొయ్యల బుట్టళాళీ
  2626. శ్రుతిమించి రాగాన పడ్డట్లు.
  2627. శ్వాస ఉన్నంత వరకూ ఆశ ఉంటుంది
  2628. షండున కబ్బిన సాన వలె,
  2629. షండున కేలరా సతీ భోగం.
  2630. సంకటికోసం రాగులు గంజికోసం చోళ్ళు
  2631. సంకరజాతి అంటే. సజజ్ఞకర్రలాంటిదా అన్నట్టు.
  2632. సకల గుణాభిరాముడు.
  2633. సకలగుణాభిరాముడు అంటే కుంటిసీతమ్మ మొగుడా అన్నాడట
  2634. సకల శాస్త్రాలు, నిలబడి మూత్రాలు.
  2635. సగం చచ్చి సంగీతం, అంతా చచ్చి హాన్యం.
  2636. సగం పెట్టి మేనత్త అన్నట్లు.
  2637. సగం సాలనేత, సగం మాల నేత
  2638. సంగీతం నేర్చినకోమటి వ్యాపారం చేసినల్లు
  2639. సంగీతానికి గాడిదనడగాలి, అందానికి లొట్టినడగాలి
  2640. సంగీతానికి గార్ధభం హాస్యానికి కోతి
  2641. సంగీతానికి చింతకాయలు రాలుతాయా.
  2642. సంచిలేని వాడికి ముష్టిలేదు మల్లలేని వాడికి మూదాక్టవళం లేదు.
  2643. సంతకం బలికోరుతుంది సరసం చలి కోరుతుంది
  2644. సంతన లేం ఇల్లు సావడి లేని కొట్టం.
  2645. .సంత మెరుగు సాని ఎరుగు.
  2646. సంతలో సంసారం సానిదానికి పాతివ్రత్యం
  2647. సంతానానికి కుచేలుడు సత్యానికి హరిశ్చంద్రుడు.
  2648. సంతులేని ఇల్లు చావడి కొట్టం,
  2649. సంతులేని తల్లి, చింత లేని పెళ్ళి
  2650. సంతోషం లేనిదే బలంలేద్దు ధ్రైర్యంలేదు.
  2651. సంతోషం సగం బలం.
  2652. సత్యంగారు అసత్యం పలకమంటే మాయింటి 'పేరబద్ర మేగా
  2653. సత్యం తప్పినా పత్యం తప్పినా పాట్లు తప్పవు
  2654. సత్యభామ వేశం వేసి ఒక్కసారి చస్తానన్నాడట
  2655. సత్యమే జయం,
  2656. సత్యమే జయం అసత్యమే భయం.
  2657. సత్యహరిశ్చంద్రుడు.
  2658. సత్రం భోజనం, మఠం నిద్ర.
  2659. సందకాడ వచ్చిన మామ, సగం పొద్దున వచ్చిన చుట్టం పోరు
  2660. సందట్లే సడేమియా.
  2661. సందట్లే సమారాధన.
  2662. సందడిలేని పండగ తాళంలేని సంగీతం
  2663. సద్దెన్నం తిన్నమ్మ మొగుడాకలి ఎరుగదట.
  2664. సంధ్యా వందనం చెయ్యరా అంటే సూర్యుణ్ని ఆగమన్నాట్ట
  2665. సన్నబియ్యంతో అన్నం ముతక బియ్యంతో పులిహోర.
  2666. సన్నబియ్యం సాయపప్పు
  2667. సన్నాయి నొక్కులేగాని సంగీతం లేదు
  2668. సన్నెకల్లు దాస్తే వెళ్ళి ఆగుతుందా.
  2669. సన్నెకల్లులేక పోతే పెళ్ళి ఆగదు సంధ్యవార్చకపోతె సంధ్య ఆగదు.
  2670. సన్యానం వుచ్చుకున్నా కావడి బరువు తప్పదట.
  2671. సన్యాసి పెళ్ళికి “జుట్టు” దగ్గర నుంచి ఎరువే.
  2672. సన్యాసి వెళ్ళాం విధవా కాదు, పున్ని స్త్రీ కాదు.
  2673. సన్యాసి, సన్యాసి రాచుకుంటే బూడిద రాలిందట.
  2674. సంపదతెచ్చిన మెప్పులు దానితో పాకే పోతాయి
  2675. సంపదలో మరువులు ఆవదలో అరుపులు.
  2676. సబా అంటే ఆరునెల్లు
  2677. సభలో సోదరులు ఎన్నికల్లో మహాశయులు
  2678. సమయానికి లేంది చంక నాకనా.
  2679. సముద్రంలో కాకిరెట్టులాగా.
  2680. సముద్రంలో వానకురిసినా అడవిలో వెన్నిలకాసినా ఎవరి కోసం
  2681. సముద్రానికి ఏతం వేసినట్టు.
  2682. సముద్రాన్ని చంకన బెట్టుకొని చెలమకు చెయ్యి చాపీనట్లు.
  2683. సరసం విరసం కొరకే ధర హెచ్చుట తగ్గుటకొరకే.
  2684. సరాలకు ముత్యాలు గీతాలకు సరాలు.
  2685. సరాల్లొదాగింది దారం, పూదండలో దాగింది నార
  2686. సరిపి వచ్చిన సన్నీ వయసొచ్చిన పిల్లా
  2687. సర్పంకాదు పొము అన్నాట్టు
  2688. సర్వం కర్మాధనం.
  2689. సర్వంకష ప్రజ్ఞ కలవాడు.
  2690. సర్వం జగన్నాధం.
  2691. సర్వేజనాః సుఖినో భవంతు.
  2692. సలహా చెప్పటం సులభం పాటించటం కష్టం,
  2693. సవాకోటి లింగాలలో నా బోడి జంగం.
  2694. సంసారం లేని సిరి,పాండిత్యం లేని పేరు
  2695. సంసారం విడిస్తే సన్యాసం, స్వర్గం కాకుంటే కైలాసం,
  2696. సంసారాం వద్దని సన్యాసం పుచ్చుకుంటే గాడిదబరువు మీదపడింది.
  2697. సంసారి తిరిగి చెడతాడు, నవ్యాసి తిరక్క చెడతాడు.
  2698. సంసారి దుఃఖి సన్యాసి సుఖి.
  2699. సాక్షం చెపుతావా శెట్టి అంటే సందులో అడిగొస్తా అన్నాట్ట
  2700. సాక్షి కాళ్ళు పట్టుకోడం కన్నా వాదికాళ్ళు పట్టుకోవడం మిన్న.
  2701. సాక్ష్యం చెప్పవే మానసా అంటే నోరు మూసుకొని నిద్రపో అందెటు
  2702. సాగితే ఇడవలె జారితే పడవలె.
  2703. సాగితే నియోగం, సాగక పోతే చచ్చేయోగం.
  2704. సాగితే బండి సాగకపోతే మొండి.
  2705. సాగితే బొంకు, సాగకపోతే రంకు.
  2706. సాగినంతసేవు బొంకు సంబరంగానే ఉంటుంది
  2707. సాటి వారితో సరిగంగ స్నానాలు
  2708. సాతాని జియ్యరు మంత్రిత్యం, జాండ్ర ప్రభువు రాజ్యాంగం
  2709. సాతాని జుట్టుక్కు నన్యాసి జంద్యానికి ముడి పెట్టినట్టు.
  2710. సానికిచ్చిన సొమ్ము, గోడకు వేసిన సున్నం, చూడ్డానికే తప్ప తిరిగి రావు
  2711. సాని నీతి, సన్యాసి జాతి
  2712. సానుల్లో సంసారి సంసారుల్లో పాని.
  2713. సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు.
  2714. సాయిబాబా సాయిబా?దేవుడు హిందువా?
  2715. సాయిబు సంపాదన బిబీ కుట్టు పోగులకే సరి.
  2716. సాయిబూ సాయిబూ చిక్కిపోయినా వేమంటే ఇంకా చిక్కుతాం, ఇంకా చిక్కుతాం, మనసు వస్తే చచ్చిపోతాం, నీకేమిటి అన్నాట్ట.
  2717. సారె తెచ్చిన కోడలు ముల్లెతెచ్చిన అల్లుడు
  2718. సాలినేత పట్టుపంచె మాల నేత మడిపంచ
  2719. సాలెవాడితో మాలవాడితో సావాసం పనికిరాదు.
  2720. సాలేసిందే బట్ట, కుమ్మరి చేసిందే కుండ
  2721. సిగబారెడు దండమూరెడు
  2722. సింగారించుకున్నావేమే చిన్నదానా అంటే చలిగా ఉందిరా పులి మావ అందిట
  2723. సింగినాదం లో శృతి లేదు
  2724. సిగ్గు చిన్ననాడే పోయె పరువు పందిట్లో పోయె కొరవ,సరవా ఉంటే గదిలో పోయె.
  2725. సిగ్గుబోయే వేళ చేరలబ్బినట్టు.
  2726. సిగ్గులేని వాడు శ్రీరంగం పోతే ఎగ్గులేని వాడు వెంకటగిరి పోయాట్ట
  2727. సిగ్గు వెళ్ళినాడే పోయింది, కాస్త ఉంటే కార్యంతో పోయింది.
  2728. సిగ్లే స్త్రీకి సింగారం.
  2729. సిద్దఢి గురువు బ్రహ్మంగారు అబ్బడి గురువు అయ్యంగారు
  2730. సిద్దప్పలాంటి శిష్యుడు లేడు, బ్రహ్మంగారి లాంటి గురువు లేదు, వేమన లాంటి యోగి లేడు.
  2731. సిరాబుడ్డి తేరా అంటే మొహం అంతా, పూసుకున్నాట్ట
  2732. సిరిగలవాడే రాజు
  2733. సిరిరా మోకాలడ్డినట్టు.
  2734. సీతకు చెరలేక పోతే రావణాసురుడు లేడు
  2735. సీతపవుట్టుకపోతే. రామాయణంలేదు.కృష్ణుడు పుట్టకపోతే భారతంలేదు.
  2736. సీత పుట్టుక లంక చేటుకే.
  2737. సీతాపతి, రామాపతి పొద్దున్నే లేస్తే పొట్టేగతి, చివరకు చింకి చాపేగతి.
  2738. సీతిలేనివాడు కోతికంటే పాడు.
  2739. సుక్షేత్రం లో దొండ నల్లరేగడిలో నల్లేరు
  2740. సుఖ మెరగని నిద్ర,. ఆకలెరగని వంట
  2741. సుఖం స్వర్గం ఇహం దుఃఖం
  2742. సుఖాలు కష్టాల కోసమే,
  2743. సుతులు లేని వారికి గతులు లేవు.
  2744. సున్నకు నున్న, హళ్ళికి హళ్ళి.
  2745. సున్నాలో ఉన్నది నూక్ష్మం, సూక్ష్మంలో ఉంది మోక్షం,
  2746. సుబుద్దికి చేటులేదు అబుద్దికి అదుపులేదు.
  2747. సురసుర .మంశే నిప్పు జరజర మంళేనీరు
  2748. సులక్షణాల పెళ్ళికొడుకు అనుకుంటే, అవలక్ష్హణాలాన్నీ బయటపడ్డాయట
  2749. సువుత్రా కొంపపీకరా అన్నట్టు.
  2750. సూది కోసం సూదిపోతే ఏడితరాల రంకు బయటపడిందట
  2751. సూది బెజ్జం అంక గొంతు ఆకాశమంత ఆశ.
  2752. సూదిలావచ్చి దబ్బవంలా తేలినట్లు.
  2753. సూదిలోది దారం. దబ్బనంలోది తాడు
  2754. సూదేటుగాళ్లి, సుత్తేటుగాణ్లే, కండేటుగాల్లే నమ్మకూడదు.
  2755. సూరన్న చిన్నవాడు, 'పేరన్న వెద్దవాడు, అయ్య కెత్తరా కోళ్ళగంప.
  2756. సూరీడుకు తీరకలేదు, సారధికి కాళ్ళు లేవు
  2757. సూర్యుడా! నమస్కారం చేస్తాను అంటే ఆగుతాడా
  2758. సూర్యుడి ఆవేశం కవిగారికావేశం
  2759. సూర్యుడికి స్వర్గం, లోభికి నరకం,
  2760. సూర్యోదయాన కూర్చుండి శుకోదయాన లేచినట్టు.
  2761. సెగలేనిదే పొగరాదు.
  2762. సెంటు భూమి లేనివాడికి సెంటువాసన ఎందుకన్నట్లు.
  2763. సేద్యం చెయ్యనివాడికి నైవేద్యానికి కూడా దొరకదు
  2764. సైంధవుడు అడ్డు పడినట్లు
  2765. సొకులు చెప్పేసాదువు దీవించే. దెప్పుడు
  2766. సొంఠిముదిరి అల్లాన్ని వెక్కిరించిందంట
  2767. సొంఠిలేని కషాయం రాముడు లేని రామాయణం
  2768. సొమ్ము పోయి దిమ్మ పట్టిండి.
  2769. సొమ్ముల ఆశ పాపం తెచ్చింది చెడు ఆలోచన చేటు తెచ్చింది
  2770. సొమ్మొకడిది, సోకొకడిది.
  2771. సోదికి పోతే సుద్దులకు కొదవా.
  2772. సోదిచెప్తే సోదమ్మి, మంత్రమేస్తే మంత్రగత్తె
  2773. సోమరిపోతుకు సోకుచేస్తే సంతను ఇంటికి రమ్మన్నాట్టు
  2774. సోమలింగం సోమలింగం అంటే రామలింగం కొడుకా అన్నాట్ట
  2775. సోమవారం వాగ్దానం మంగళవారం తొంటిచెయ్యి
  2776. సోమవారం శుభలక్ష్మి మంగళవారం మహాలక్ష్మి
  2777. సోమారికి సోకులెక్కువ.
  2778. సోలిన అత్త సొగసు, కొత్త కోడల్ఇ గుణం సొగసు
  2779. సోవియట్‌ వాళ్ళది శాంతిఖర్చు అమెరికా వాళ్ళది యుద్ద ఖర్చు
  2780. స్టన శల్య పరీక్ష.
  2781. స్టాన బలిమి కాని తన బలిమి కాదయా,
  2782. స్తంభంలేచినంత మాత్రాన భవనం అవుతుందా
  2783. స్థానబలమేకాని తనబలం లేదన్నాడట
  2784. స్నానానికి ముందు సంభావనకు వెనుక పనికిరాదు.
  2785. స్వకార్య దురంధరుడు,స్వామికార్య వంచకుడు.
  2786. స్వయం రాజ్యా స్వయం మంత్రి.
  2787. స్వర్గంలో శనికీ భయపడి అరణ్యంలో దాక్కున్నాట్టు.
  2788. స్వర్గానికి నిచ్చెనలు వేసినట్టు.
  2789. స్వర్గానికి బెత్తెడు ఎడం.
  2790. స్వర్ణకలశంతో ఆవాహన మట్టికలశంతో ఉద్వాసన
  2791. స్వర్ణం చూసిన కంసాలి ప్రేమ
  2792. స్వర్ణం దగ్గరుంచుకొని బంగారం వెతికాట్టు.
  2793. స్వర్ణం బండెడున్నా చిటికెడు టంకంలేనిదే అతుకుపడదు.
  2794. స్వర్ణానికి వాసన రత్నానికి రుచి ఉండదు
  2795. స్వాతి వానకు ముత్యపు చిప్ప లాగా
  2796. స్వామికార్యం స్వకార్యం సత్వరం జరగాలి.
  2797. హడావుడేంటే కుక్క అంటే ఊళ్ళో పెళ్ళే నక్క అందిట
  2798. హద్దులో ఉంటే ఆడది, హద్దు మీరితే గాడిద.
  2799. హనుమంతుడి భక్తిగొప్పా? రాముడి రూపం గొప్పా?
  2800. హనుమంతుడి భక్తిబలం సీత కోసమా? రాముడుకోసమా!
  2801. హనుమంతుడి ముందు కుప్పిగంతులా.
  2802. హనుమంతుడు లేని లఅంకాదహనమా.
  2803. హన్త ఆదివారయొస్పే చచ్చేటంత వాన
  2804. హరిశ్చంద్రుడి నోటు అబద్దం రాదు, నానోట నిజం రాదు.
  2805. హంసను చూసిన కాకి కులికి కురికి నడిచిందట
  2806. హంసపాదులరాత ఆయాసంతో పాట
  2807. హంసరాయబారం కోకిల మేజబాణి
  2808. హస్త కార్తెలో చల్లితే అక్షింతలకైనా కావు.
  2809. హస్తకు ఆది పంట, చిత్తకు చివరి వంట.
  2810. హస్తిజాతి పెళ్ళాం మూషిక జాతి మొగుడు.
  2811. హస్తినిజాతిపుటక, శంకిణీ జాతి బుద్దులు
  2812. హస్తీచచ్చినా దంతాలు దొరికితే చాలు.
  2813. హిమగిరిలో ఉంటే నంది, గంగారంలో ఉంటే గంగిరెద్దు
  2814. హీనస్వరం పెళ్ళాం ఇంటికి చేటు.
  2815. ఒక నాడు ధారణ, ఒకనాడు పారణయ.
  2816. కంఠగత ప్రాణం.
  2817. కందకు లేని దురద చేమకెందుకు.
  2818. కలబందకు ఎండు, కోడలికి కొత్త లేదు.
  2819. కల్పవృక్షం క్రింద గచ్చపొద ఉన్నట్టు.
  2820. కాకి ముక్కుకు దొండపండులాగా.
  2821. కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు.
  2822. కొచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు..
  2823. కాలే కడువుకు గంజే పానకం.
  2824. కుంటికులానం ఇంటికి మోసం.
  2825. కుడవబోతూ కుర్రాకు రుచి అడిగినట్టు.
  2826. అడుసు తొక్కనేల, కాలు కడుగనేల.
  2827. అన్నపు చొరవేకాని ఆక్షరపు చారవలేదు.
  2828. తెలివిగల వాడికి మూడుచోట్ల అంటిందట.
  2829. ఆకాశ రామన్న,
  2830. దారిన పొయ్యే దానయ్య.
  2831. ఇస్తే చెడేది లేదు, చస్తే వచ్చేదీ లేదు.
  2832. ఉంటే ఊరు, పోతే పాడు.
  2833. ఉన్నమాటంకు ఉలుకెక్కువ.
  2834. ఏలడానికి ఊళ్ళులేక పోయినా ఎత్తుకు తినడానికి ఊళ్ళు లేక పోతాయా.
  2835. ఏనుగు చచ్చినా బ్రతికినా వెయ్యివరహాలే.
  2836. క్షేత్రమెరిగి విత్తనం పాత్రమెరిగి దానం.
  2837. ధైర్యే సాహసే లక్ష్మి.
  2838. లంఖణం పరమౌషధం.
  2839. గతజల సేతు బంధనం.
  2840. లోకో ఛిన్న రుచిః.
  2841. కష్టే ఫలి.
  2842. సూదేటుగాళ్లి, సుత్తేటుగాణ్లే, కండేటుగాల్లే నమ్మకూడదు.
  2843. స్వకార్య దురంధరుడు,స్వామికార్య వంచకుడు.
  2844. సుఖాలు కష్టాల కోసమే,
  2845. సర్వంకష ప్రజ్ఞ కలవాడు.
  2846. సత్యమే జయం,
  2847. సకల శాస్త్రాలు, నిలబడి మూత్రాలు.
  2848. న్వయం రాజ్యా స్వయం మంత్రి.
  2849. పౌందర్యానికి ఒంటె, సంగీతానికి గాడిద.
  2850. హద్దులో ఉంటే ఆడది, హద్దు మీరితే గాడిద.
  2851. అరచి గీవెట్టినా,
  2852. అఆడని కాచిన వెన్నెల.
  2853. ఆగ్రహాన అనపెట్టుకున్నట్టు.
  2854. ఆ తండ్రి కొడుకు కాడా.
  2855. ఉన్న మాటంటే ఊరు అచ్చిరాదు.
  2856. ఊరందరిదీ ఒక దోవైతే ఉలిపి కట్టదొకదోవ.
  2857. ఊరంతా ఉల్లీ, నీవెందుకే తల్లీ.
  2858. ఊక దంపుడు కబుర్లు.
  2859. కాశీకి పోయి గాడిద గుడ్డు తెచ్చినట్లు.
  2860. తాతకు దగ్గులు చేర్చినట్లు.
  2861. అక్షయపాత్ర,
  2862. అగస్త్య భ్రాత.
  2863. అజగరోపవాసం.
  2864. కంచిగరుడ సేవ.
  2865. ఊర్మిళ నిద్ర.
  2866. కబంధహస్తం
  2867. కుంభకోణం,
  2868. కందాల రాజు.
  2869. పద్మవ్యూహం.
  2870. ఉత్తరకుమార ప్రజ్ఞలు.
  2871. సత్యహరిశ్చందుడు.
  2872. నక్షత్రకుడిలా వెంటపడ్డాడు.
  2873. శనిగహం.
  2874. భరద్వాజ విందు.
  2875. దానకర్ణుడు.
  2876. కర్టుడులేని భారతం.
  2877. త్రిశంకు స్వర్గం,
  2878. భగీరథ ప్రయత్నం.
  2879. నర్వం జగన్నాధం.
  2880. నర్వం కర్మాధనం.
  2881. మొండి శిఖండి.
  2882. కుంభకర్ణుడి నిద్ర.
  2883. రామరావణ యుద్ధం.
  2884. ఉడుతాభక్తి.
  2885. శకుని.
  2886. దుష్టచతుష్టయం.
  2887. బకాసురుడు,
  2888. చేతిచమురు భాగోతం.
  2889. దైవాధీనం జగత్సర్వం.
  2890. ఇసుక తక్కెడపేడ తక్కెడ
  2891. గుడిపూడి జంగాలు.
  2892. పుల్లయ్య వేమవరం.
  2893. పెరవలమానుకోరు.
  2894. తుని తగువు.
  2895. మక్కికిమక్కి.
  2896. కాకిగోల.
  2897. పాముకు బదనిక చూపినట్లు.
  2898. నందోరాజా భవిష్యతి.
  2899. అంతా కంత.
  2900. నాగవల్లి నిమ్లారం.
  2901. అలకపాన్సు.
  2902. బాదరాయణ
  2903. బ్రహ్మాస్త్రం
  2904. తూ.చ. తప్పక.
  2905. చుక్కెదురు.
  2906. నుష్టాష్టమం.
  2907. ఒజ్జల వుచ్చకాయ.
  2908. గుంట ఓనమాలు.
  2909. గోడపెట్టు-చెంప పెట్టు.
  2910. కంచి గరుడ సేవ.
  2911. ఏటిదరిమాకు.
  2912. యక్షప్రశ్నలు అక్ష హృదయం.
  2913. చిదంబర రహస్యం.
  2914. తంబళ అనుమానం-తలతిక్క.
  2915. తుని తగవు.
  2916. తీతువు పిట్ట రాయబారం.
  2917. ఇక్ష్వాకుని కాలం.
  2918. అస్థరిత బ్రహ్మచారి.
  2919. మెచ్చి మేకతోలుకప్పు',
  2920. ఈనినపులి.
  2921. ఉట్టికట్టుకుని ఊరేగు.
  2922. తిలా పాపం, తలా పిడికెడు.
  2923. తోసిరాజు.
  2924. తెజచిరాజు.
  2925. కుచేల సంతానం.
  2926. అంతా మనమంచికే.
  2927. కాలనేమి జపం.
  2928. కొంగజపం,
  2929. నాస్తినారాయణమ్మ.
  2930. వేలువాయి వేదాంతం.
  2931. టెంకాయ కచ్చికొండ.
  2932. కప్పల తక్కెడ.
  2933. ఆటు-పోటు.
  2934. వజ్రాయుధం.
  2935. గౌతముడి గోవు.
  2936. అంగడిబొమ్మ గొంగడి గొన్నట్టు.
  2937. అంగడి వీధిలో అబ్బా అంటే ఎవడికి పుట్టావురా కొడకా అన్నటు.
  2938. అండలుంటే కొండలు దాటవచ్చు.
  2939. అంతకు తగిన గంత, గంతకు తగిన బొంత.
  2940. అంతం. లేని చోటులేదు ఆదిలేని ఆరంభం లేదు.
  2941. అంతా అయిన వాళ్ళే కాని మంచినీళ్ళు పుట్టవు.
  2942. అంతా తెలిసిన వాడులేడు. ఏమీ ఎరగని వాడు లేడు.
  2943. అంతా మా వాళ్ళేకాని, అన్నానికి రమ్మన్న వారు లేరు.
  2944. అంత్య నిష్టూరంకన్నా ఆది నిష్టూరం మేలు.
  2945. అందం చందం లేని మగడు మంచం నిండా ఉన్నట్లు.
  2946. అందం ఉంటే ఆయనా, అదృష్టం ఉండొద్దా!
  2947. అందరూ శ్రీవైష్టవులే బుష్టిడు రొయ్యలు ఏమైనట్టు.
  2948. అందితే జుట్టు, అందకుంటే కాళ్ళు.
  2949. అండపోయిన అల్లీసాయిబు పీలవబోయిన పీరుసాయిబూ పత్తాలేరు
  2950. అంబరితాగేవాడికి మీసాలు ఎగబట్ట వాడొకడు.
  2951. అంభంలో కుంభం ఆదివారంలో సోమవారం.
  2952. అకటా వికటపు రాజుకు,అవివేకపు ప్రధాని చాదస్తపుపరివారం,
  2953. అక్కన్న మారన్నలు అందలం ఎక్కితే, సాటికి సరసపు చెరువుగట్టు ఎక్కాడట.
  2954. అగడ్తలో పడ్డ పిల్లికి అదే వైకుంఠమట!
  2955. అగ్గి మీద గుగ్గిలం చల్లినట్లు!
  2956. అగ్నికి వాయువు తోడై నట్టు.
  2957. అచ్చమ్మ పెళ్ళిలో బుచ్చమ్మ శోభనం.
  2958. అచ్చివచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు వుట్టాడట.
  2959. అచ్చుపోసిన ఆబోతులాగా!
  2960. ఆటునుంచి ఇటు నరుక్కు రమ్మన్నారు!
  2961. అట్టువెట్టినమ్మకు అట్టున్నర!
  2962. అడిగితే చిరాకు, 'అడక్కపోతే వరాకు.
  2963. అడుక్కు తినేవాడికి ఆలు భాగ్యవంతుడికి బానిన అయింది .మేలు!
  2964. అణిగి మణిగి ఆకులో పిందెలాగ.
  2965. ఆలి రహన్యం బట్ట బయలు.
  2966. అతుకుల బొంత, గతుకుల బాట!
  2967. అత్తముండ కన్న ఉత్తముండ మేలు.
  2968. అత్తలేని కోడలుత్తమురాలు, కోడలులేని అత్త గుణవంతురాలు!
  2969. అదిగో పులి అంతే, ఇదిగో తోక అన్నట్టు.
  2970. అదృష్టం చెప్పరాదు, దురదృష్టం చెప్పీ పోదు.
  2971. అదృష్టవంతుల్ల చెడగొట్టేవాడు, దురద్భష్ట్రనంతుల్ల బాగువరిచే వారు లేరు!
  2972. అనిత్యాని శరీరాని అందరి సొమ్ము మనకేరాని!
  2973. అనుమానం ప్రాణ సంకటం.
  2974. అనుమానం ముందుపుట్టి ఆడది తర్వాత పుట్టిందట.
  2975. అనుమానం మొగుడు ఆలిని వీపుకు కట్టుకుంటే, పెళ్ళాం ముండ మొగుణ్ణి కొప్పులో వెట్టుకుందట.
  2976. అనుములు తింటూ మినుములు పెట్టినట్టు.
  2977. అనువుగాని చోట అధికుల మనరాదు.
  2978. అనూరాధలో తడిస్తే ఆడది మొగవాడవుతాడట.
  2979. అపశబ్ద భయం నాస్తి అప్పలాచార్య సన్నిధి, అనాచార భయం నాస్తి తిష్ఠన్మూత్రస్య సన్నిధౌ
  2980. అప్పుచేసి పప్పు కూడు.
  2981. అవ్రులున్న వాడి వెంట, చెప్పులున్న వాడి వెంట పోకూడదు.
  2982. అప్పులేకపోతే ఉప్పు గంజైన మేలే,
  2983. అవ్వులేని మనిషి పిప్పిలేని పగడం ' ఉండునా.
  2984. అబద్ధమాడితే అన్నంపుట్టుదు, నిజం చెపితే నీళ్ళు పుట్టవు,
  2985. అబద్ధమాడినా గోడ పెట్టినట్లుండాలి.
  2986. అబద్దాలాడితే ఆడపిల్లలు పుడతారు.
  2987. అభాగ్యుడికి ఆకలెక్కువ, నిర్భాగ్యుడికి నిద్ర ఎక్కువ.
  2988. అమావాస్యకు అట్టు, పున్నానికీ బూరెలు,
  2989. అమ్మ గూటికి, అయ్య కాటికి.
  2990. అమ్మాయి పుట్టిందంకే ఆయువు సగం మింగిన ట్లు.
  2991. అయిందన్మూ పెళ్ళి అణి గేనమ్మా రంధి.
  2992. అయితే ఆతుకూరు లేకపోతే పోలేపల్లి.
  2993. అయిపోయిన పెళ్ళికి మేళమెందుకు,
  2994. అయుష్న గట్టిదై తే అడివిలో ఉన్నా, అయోధ్యలో ఉన్నా ఒకలు.
  2995. అయ్యకు విద్యాలేదు, అమ్మకు గర్వంలేదు.
  2996. అయ్యవార్లవారి నట్టిల్లు లాగా.
  2997. అరచేతిలో వైకుంఠం చూపినట్టు. .
  2998. అరటిసండొలిచి చేతిలో పెట్టినట్టు.
  2999. అరవ చెరుచుు పాము కరుచు.
  3000. అరిష్టానికి అంగారకుడు, పాపానికి భైరవుడు,
  3001. అర్హరాత్రి వేళ మద్దెల దరువు.
  3002. అల్పుడెవుడు పలుకు ఆడంబరము గాను.
  3003. అల్లుడికి అత్తాశ, బాపడికి పప్పాశ, గొడ్డుకు దూడాశ.
  3004. అల్లుడికి బెట్టు, ఇల్లాలికి గుట్టు ఉండాలి.
  3005. ఆ ఇంటికి దడీలేదు ఈ ఇంటికి గడియలేదు.
  3006. ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో, ఈ ఊరు ఆ ఊరికి అంతే దూరం
  3007. ఆటాపాటా మాఇంట మాపటి భోజనం మీఇంట.
  3008. ఆత్మస్తుతి, పరనింద, అర్జాపేక్ష లేని వాడు మహానుభావుడే.
  3009. ఆపదలు కాపలాలుండవు.
  3010. ఆమడలు దూరమైతే అంతఃకరణాలు దూరమవుతాయా.
  3011. ఆముదపు విత్తులు ఆణిముత్యాలవుతాయా.
  3012. ఆముదాల బేరం, కామెర్ల రోగం నమ్మరాదు.
  3013. ఆరంభ శూరుడికి అర్భాటమెక్కువ.
  3014. ఆవాహన లేదు, విసర్ణన లేదు.
  3015. ఆవు తొలిచూలు,గేదె మలిచూలు.
  3016. ఆవలి'స్తే పేగులు లెక్క పెట్టినట్టు.
  3017. ఆశ ఆలి మీద పడక చాప మీద.
  3018. ఇంట గెలిచి రచ్చ గెలువు.
  3019. ఇంటింట ఇటుక పొయ్యి మాఇంట మట్టి పొయ్యి
  3020. ఇంటిగుట్టు లంకకు చేటు.
  3021. ఇంటి పేరు కస్తూరివారు, ఇంట్లో గబ్బిలాల కంపు.
  3022. ఇంట్లో ఇల్లారి పోరు బయట బాకీల పోరు.
  3023. ఇంత బతుకూ బతికి ఇంటి వెనకాల చచ్చినట్టు.
  3024. ఇక్కడ మునిగి అక్కడ తేలేవాడు.
  3025. ఇచ్చిన వాడు దాత ఇవ్వని వాడు రోత.
  3026. ఇరుగు ఇంగలం పొరుగు మంగలం
  3027. ఇఱ్ఱి కొమ్ము అంశు,బఱ్ఱె కొమ్ము అన్నట్టు.
  3028. ఇష్టమైన వస్తువు ఇంగువతో సమానం.
  3029. ఈదాడంటే కోదాడన్నట్లు,
  3030. ఈనగాచి నక్కల పాలైనట్లు.
  3031. ఉంటే ఊరు, పోతే పాడు.
  3032. ఉచ్చగుంటలో చేపలు పట్టినట్లు.
  3033. ఉద్యోగికి దూర భూమి లేదు.
  3034. ఉన్న ఊరు కన్నతల్లి లాంటిది.
  3035. ఉన్నది పోదు, లేనిది రాదు.
  3036. ఊళ్ళో వియ్యం కయ్యముల పాలు.
  3037. ఊరి ముందరి చేను కాకుల్ల పాలు,
  3038. ఊసరక్షేత్రంలో దూసరి తీగ.
  3039. ఊసర వెల్లిలా రంగులు మార్చేవాడు.
  3040. ఎంత చెట్టుకు అంత గాలి.
  3041. ఎంత వారైనా కాంత దాసులే,
  3042. ఎడ్డిమంటు తెడ్డెమన్నట్టు.
  3043. ఎద్దు పుండు కాకికి ముద్దా.
  3044. ఎనుబోతు మీద వాన కురిసినట్టు.
  3045. ఏ గాని ముండకు డబ్బున్నర క్షవరం.
  3046. ఏ గూటి చిలక్కు ఆ గూటి పలుకు.
  3047. ఏ చెట్టూ లేని చోట ఆముదపు చెట్టే మహావృక్షం.
  3048. ఏ ఎండకా గొడుగు పట్టినట్టు.
  3049. ఏ రాయి అయితేనేం పళ్ళూడగొట్టు కోవడానికి,
  3050. ఏరుముందా, ఏరువాక ముందా, ఏకాదశి ముందా,పున్నమి ముందా
  3051. తీగలాగితే డొంకంతా కదిలినట్టు.
  3052. ఒళ్ళు వంగనమ్మ కారిమెబ్టలకు కందిపోయిందట.
  3053. కంచం పొత్తేగాని మంచం పొత్తు లేదు.
  3054. ఈ కంటికి ఈ రెప్పలడ్డమా.
  3055. కట్టన ఇల్లు, పెట్టిన పొయ్యి.
  3056. అది కడుపా, చెరువా.
  3057. కడుపు కాలి ఏడుస్తుంటే మనోవర్తి ఏమిస్తావన్నదట,
  3058. కడువుచించు కుంటే కాళ్ళ మీద పడుతుంది.
  3059. కడుపులో చల్ల కదల కుండా.
  3060. కనుముకు కాకర్క భోగికి పొట్ట.
  3061. కనుమునాడు కాకైనా బయత్రేరదు.'
  3062. కాకులను కొట్టి గద్దలకు వేసినట్టు.
  3063. కాదు కాదు అంటే నాది నాది. అన్నాట్ట.
  3064. కాపుల జాతకాలు కరణాల కెరుక.
  3065. కాలికి చుట్టుకున్న పాము కరవక మానదు.
  3066. కాలు తొక్కిన వేళ కంకణం కట్టిన వేళ మంచిది కావాలి,
  3067. కింద పడ్డా పై చేయి నాదే అన్నట్టు.
  3068. కుక్కలు చింపిన విస్తరిలాగా.
  3069. కుందేటి కొమ్ము సాధించినట్లు.
  3070. కుక్కతోక ' పట్టుకొని గోదావరి ఈదినట్టు.
  3071. కులట బిడ్డ కొడుకవుతాడా, మెరుపుతీగ దీపమవుతుందా.
  3072. కులం తప్పిన వాడుబంతికి ముందు,కూరగాయల సంతకు ముందు
  3073. కృష్ణా స్నానానికి కొండు భొట్ట ఆజ్ఞా,
  3074. గంగా స్నానం తుంగా పానం.
  3075. గాలికి వుట్టి ధూళికి పెరిగినట్టు.
  3076. గుట్టు చప్పుడు కాకుండా.
  3077. గుడెద్దు చేలో పడ్డట్లు.
  3078. గుడ్డికన్నా మెల్ల మేలు.
  3079. గుడ్డి కన్ను తెరిచినా ఒకటే మూసినా
  3080. కలగూర గంప.
  3081. గోడమీది పిల్లి వాటం.
  3082. గుండెల మీద కుంపటి.
  3083. గోప్రదక్షణ భూ ప్రదక్షణ మంద ఫలమిచ్చినట్టు.
  3084. గోముఇఖ వ్యాఘ్రం,
  3085. ఘటాలెన్నైనా గగన మొకటే.
  3086. ఘోటక బ్రహ్మచారి.
  3087. చచ్చే కాలానికి సత్యభామ వేషమేసినట్టు.
  3088. చిన్ని నా పొట్టకు శ్రీరామరక్ష.
  3089. చిలుము వదిలితే గాని ఛిద్ర మొదలదు.
  3090. చీకట్లో చిందులాట.
  3091. చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరవైనయట్టు.
  3092. చెడ్డాపడ్డా చేబ్రోలే(శ్రికాకుళమే) గతి.
  3093. చెప్పడం సులభం చేయడం కష్టం.
  3094. చెప్పుతో కొట్టి శఠగోపం పెట్టినట్టు.
  3095. చెప్పులోని రాయి, చెవిలోని జోరీగ, ఇంటిలోని పోరు ఇంతింత కాదయా.
  3096. చెరపకురా చెడేవు.
  3097. చేట భారతం.
  3098. చేటు కాలానికి చెడ్డ బుద్దులు.
  3099. చేసిన పాపం చెపితే పోతుంది.
  3100. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ.
  3101. చొప్పదంటు ప్రశ్నలు.
  3102. తంగేటి జున్ను.
  3103. తంగేడు పూసినట్టు.
  3104. తలప్రాణం తోక కొచ్చినట్లు.
  3105. తల్లికి బొల్లి ఉంటే పిల్లకు చుక్కెవా ఉంటుంది.
  3106. కుక్క మూతి పిందెలు.
  3107. తల్లిదైవం, తండ్రి ధనం.
  3108. తాను తవ్వుకున్న గోతిలో తానేపడ్డట్టు.
  3109. తానొకటి తలిస్తే దైవమొకటి తలచినట్లు.
  3110. తాత బొచ్చె తరతరాలు.
  3111. తిమ్నన్న బంతికి రమ్మన్నారు కాబోలు.
  3112. తిమ్నిని బమ్మిని, బమ్మిని తిమ్మిని చేసినట్టు.
  3113. తుమ్మితే ఊడిపోయే ముక్కు.
  3114. తురక మరక తిరగేసి నరక,
  3115. బీరకాయ పీచు.
  3116. దారిన పోయే దానయ్య,
  3117. దినదిన గండం నూరేళ్ళాయుష్తు.
  3118. దొంగ చేతికి తాళాలిచ్చినట్టు.
  3119. దొంగలు దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్టు.
  3120. ధర్మానికి పోతే కర్మం చుట్టుకున్నదట.
  3121. నట్టేట ముంచినట్టు.
  3122. నోట్లో చక్కెర, కడుపులో కత్తెర.
  3123. నోట్టో వేలుపెడితే కొరక నేరడు.
  3124. పొండవుల వారి సంపాదన దుర్యోధనుల వారి పిండాకూళ్ళకు సరి,
  3125. పాచిపళ్ళ దాసరికి కూటిమీదే లోకువ.
  3126. పాపి చిరాయువ్వు వుజ్యే గతాయువు.
  3127. పీనుగ మీద పిండాకూడన్నట్లు.
  3128. వుండు మీద కారం చల్లినట్లు.
  3129. వూరి గుడిసెకు చాందిని మంచం కావాలా.
  3130. పూలవాసన నారకు పట్టినట్లు.
  3131. గూటిలోని రామచిలుక.
  3132. పేరు పెద్ద ఊరు దిబ్బ.
  3133. పేరులేని వ్యాధికి, “పెన్నేరుగడ్డ మందు.
  3134. బుధవారం నాడు పులికూడా , బయలుదేరదు.
  3135. బెండ్లు మునిగి గుండ్లు తేలినట్టు.
  3136. బ్రహ్మచారి శతమర్కటః.
  3137. బ్రహ్మకైనా పుట్టు రిమ్మ తెగులు.
  3138. భోజనానికి వచ్చి గొయ్యి త్రవ్వినట్టు.
  3139. భోజనానికి వద్దంకే పట్టుచీర కట్టుకొస్తానన్నట్లు.
  3140. మంగలంలోని పేలాలలాగా.
  3141. మనిషి కాటుకు మందులేదు.
  3142. మనోవ్యాధికి మందులేదు.
  3143. మాచకమ్మకు ముత్యాల సరమేల.
  3144. కడివెడంత గుమ్మడి కాయ కత్తిపీటకు లోకువ.
  3145. మిడతం భొట్టు జోన్యంలాగా.
  3146. మిన్ను విరిగి మీద పడ్డట్టు.
  3147. మీకు మాట,మాకు మూట.
  3148. మీన మేషాలు లెక్క పెట్టినట్టు.
  3149. ముండ మొయ్యవచ్చుగాని నిందమొయ్యరాదు.
  3150. ముందరి కాళ్ళకు బంధాలు.
  3151. బాదరబందిరి.
  3152. ముక్కేదిరా అంటు తలతిప్పి చూపించాడట.
  3153. ములక్కాయకు ముళ్ళెన్ని అంటే. కాకరకాయకు కళ్ళెన్ని అన్నట్టు.
  3154. ముష్టిలో ముష్టి ధర్మ ముష్టి.
  3155. బ్రహ్మచారి ముదిరినా, బెండకాయ ముదిరినా పనికిరాదు
  3156. మెత్తనివాణ్ణి చూస్తే మొత్తబుద్ది అయ్యిందట
  3157. మెచ్చి మేక తోలు కప్పినట్టు
  3158. మొలభంటి దుఃఖం లో మెకాల్బంటి సంతోషం
  3159. యుగయుగాలనాటి యుధిష్టరుడిలాగా
  3160. రాళ్ళన్నీ ఒకచోట రత్నాలన్నీ ఒకచోట
  3161. రాత ముడిచినా చావులేదు
  3162. రానూ వచ్చి పోయే పోయే రాగులు విసిరి సంకటి చేయమన్నాడట
  3163. రెడ్లున్న ఊళ్ళో రేచులున్న కొండలో ఏమీ బతకవు
  3164. రెప్పలార్చేవారు కొంపలార్చుతారు, కళ్ళార్చే అమ్మ ఇల్లార్చుతుంది
  3165. రేపు మాపు తురకేమాపు
  3166. రాయిగుద్దనేల చెయ్యినొవ్వనేల
  3167. రాళ్ళు తిని రాళ్ళు అరిగించుకుంటాడు
  3168. రెక్కాడితేగాని డొక్కాడదు
  3169. లాకేత్వము,దాకు కొమ్ము ఇవ్వని వాడు
  3170. లోభికి ఖర్చెక్కువ
  3171. రాజు వలచిన రంభ,రాజు విడిచిన తుంబ
  3172. రాతిబొమ్మకు చక్కలిగింతలు పెట్టినట్టు
  3173. రొట్టె విరిగి నేతిలో పడినట్టు
  3174. వంకాయ దొంగిలించినవాడు టెంకాయ దాగా రాడా
  3175. వనం విడిచిన షక్షి, జనం విడిచిన మనిష.
  3176. వాళ్ళు పిల్ల నివ్వనన్నారు, నేను చేసుకోనన్నాను.
  3177. వీరభోగ వసంత రాయలు. .
  3178. వెంట రావద్దంటే ఎత్తుకోమని ఏడ్చాడట.
  3179. వెర్రిపెయ్యకు తొర్రిపెయ్య తోడు
  3180. వెలమలున్న ఊరు కొంగలున్న మఱ్ఱి ఒకటే.
  3181. శా స్తానికి అంటులేదు. యజ్ఞానికి ఎంగిరి లేదు.
  3182. బంగారమంటి కోమటి సంగీతము మరిగి బేరసారము లుడికెన్
  3183. సిగ్గుబోయే వేళ చేరలబ్బినట్టు.
  3184. సూరన్న చిన్నవాడు, 'పేరన్న వెద్దవాడు, అయ్య కెత్తరా కోళ్ళగంప.
  3185. సోమారికి సోకులెక్కువ.
  3186. హీనస్వరం పెళ్ళాం ఇంటికి చేటు.
  3187. క్షణం చిత్తం క్షణం మాయ అన్నట్టు.
  3188. క్షేమంగా పోయి లాభంగా రమ్మన్నట్టు.
  3189. అత్త బుద్ధి కోడలు బుద్ది. ఒకటవుతాయా?
  3190. అత్త అవున్నదీ లేదు కోడలు కాదన్నాదీ లేదు!
  3191. అత్తను అమ్ముకోమన్నారు కోడల్ని కొనుక్కోమన్నారు
  3192. అత్తా అత్తా ఎప్పుడు నిద్రపోతావంశే నిన్ను చూసిపోతా అందట
  3193. అత్తను ఏడిపించిన కోడలు అత్త అయితే బలేగుందట
  3194. అత్త చచ్చిందని అత్త చీరకట్టుకుంకే చచ్చినాక దయ్యమైపట్టిందట
  3195. అన్నీ తెలిసిన అత్త అమావాస్యనాడు చచ్చిందట.
  3196. అత్త ఆడమంది, కోడలు కుంటమంది.
  3197. అత్తతనంలో మంచితనం, ఆడంగిలో మగతనం వుంటాయా?
  3198. అత్తా అత్తా రోకలి ఎత్తమంటే అమావాసరానీమందట
  3199. అత్తకి అట్లతద్ది సరదా! కోడలికి కోటప్పకొండ సరదా
  3200. అడవిలో వెన్నెల సముద్రంలో వాన ఒకటే
  3201. అమ్ముకో అమ్ముకో అంటే కొనుక్కో కొనుక్కో అన్నట్టు
  3202. అడుసులో హంస ఆడింది,అడవిలో అమ్మ పాడింది ఒకటే!
  3203. అండలుంశే కొండలు దాటచ్చు.
  3204. ఆడండి ఆడండి అంటే పాడండి. పొడండి అన్నారట.
  3205. అందని ద్రాక్షలు వుల్లనన్నట్లు
  3206. అంబరి దాగే వాడికి మీసాలెగరేసినట్లు
  3207. అసలే కోతి అద్దం చూపిస్తే వూరుకుంటుందా?
  3208. ఆలస్యం చేస్తే అమృతం విషమవుతుందట?
  3209. అనువయిన భూమి అరచేయంత చాలు
  3210. ఆడలేని అమ్మాయిలు మద్దెల ఓటిదన్నారట
  3211. ఆడదయిపు స్టుకంకే అడవిలోమానయి పుట్టటం మేలు
  3212. ఆస్తిపంపకంతో చావులు, అయ్య చావుతో విందులు '
  3213. అప్పిగా చెప్పులెక్కడరా అంఠే ఆకాశాన కనపడలేదన్నాట్ట
  3214. ఆకాశవీధిలో కొంగలు, అంగడి వీధిలో దొంగలు .
  3215. అగ్గిని మండించవచ్చు గాని మూర్చుణ్ణి మార్చలేమట!
  3216. అడవిలో చెట్టుకాయ ఊరిలో ఉప్పురాయి కలిస్తే ఊరగాయ
  3217. అత్త పగలగొడితే పాత కుండ కోడలు పగలగోడితే కొత్త కుండ
  3218. అత్తదానం న్వర్గానికి కోడలి దానం నరకానికి
  3219. అత్తను చూసి దాచుకోవడం, పిల్లని చూసి పారేసుకోవడం.
  3220. అప్ప ఆరాటమే గాని బావ బతికే లక్షణం కనపడలేదట.
  3221. అన్నీ తెలిసినవాడు అమావాస్య నాడుచస్తే, ఏమీ తెలియని వాడు ఏకాదశి నాడు చచ్చాట్టు
  3222. ఆడదాని అబద్దం గోడ కట్టినట్లు వుందట
  3223. అమావాస్య నాడు అట్టు పెట్టాను పున్నమి నాడు పూర్ణాలు పెట్టాను. నాగులచవితికి నాకేం వెడతవన్నట్లు
  3224. అరచేతిలో వైకుంఠం కలత నిద్రలో కైలాసం
  3225. అత్తగారి ఆరళ్ళు కోడరి గారి వేవిళ్ళు.
  3226. అంట్లుతోమచే అంకాక్షి అంకే అత్తరు రానుకోనీవే కుంకాక్షి అందట.
  3227. అత్తా అత్తా అన్నం పెట్టత్తా అంటే సున్నం పెడతానే అందట.
  3228. అరువు బేరంవాడు ఆత్మీయులు వసూలునాడు బూతులు
  3229. అక్కరకు రాని చుట్టము అక్కరలేదు. మొక్కితే వరమీని దేవుడ క్కరలేదు.
  3230. ఆరు దుక్కల వర్షం కురిస్తే ఆరువేల కప్పలు అరుస్తాయట
  3231. అంచుల అందాలు చూసి అందరూ మోసాల పాలయినట్టు
  3232. అన్నదమ్ముల కలహం బావ మరుదుల సరసం
  3233. ఆకు కందక పోకకు పొందక ఏమవుతుంది?
  3234. అడ్డం తప్పుకో అంటే గడ్డం పట్టుకో అన్నట్టు
  3235. అమ్మా తల్లి అంతే అప్పాలన్నీతినేసిందట
  3236. అరికాలి ముల్లు అరచేతి వుండు
  3237. అరవబోకే చెల్లీ అంటే కరవబోకే అక్కా అన్నదట
  3238. ఆరుద్రలో వర్షం అమృతంతో సమానం
  3239. అరుంధతి కనవడలేదంటే ఆరువేలప్పు కనిపించిందా అన్నట్టు
  3240. అబ్బడి నెత్తిన సుబ్బడు కొడితే. సుబ్బడి నెత్తి సూరీడు కొట్టాడట
  3241. ఆ వూరివారు ఈ వూరికి రారంకే ఈ వూరివార్సు ఆ వూరు పోరన్నారట,
  3242. ఆ ఇంటి కాకి ఈ ఇంటి మీద వాలదు ఈ ఇంటి కాకి ఆ ఇంటి మీద వాలదు
  3243. అలిగిన కోడలు, సోలిన అత్త గుట్టుగా వుంటారు.
  3244. అరటాకు మీద ముల్లు పడ్డ, నుల్లు మీద అరటాకు పడ్డ అరటాక్కే నష్టం.
  3245. అలి నోట్లో ఆముదం మొగుడి నోట్లో మినపగింజ
  3246. ఆకాశాన వరద గూడు, అత్త గారింట్లో వానగోడు.
  3247. అత్తా అత్తా కొడుకును కంటానంటే,వద్దంటానా అందట
  3248. ఇల్లు గాలుతున్నది అంతే చుట్టముక్కలు కాలు కుంటానన్నట్టు
  3249. ఇంటి పేరు ఇంగువ వీధి పేరు గింగువ
  3250. ఇంటి దిసం గదా అని ముద్దాడితే కాలకుండా సుంట
  3251. ఇచ్చింది పోయింది అసలు రాదు.
  3252. ఇసుకలో తైలం వుండదు -.బంకలో బంగారం వుండదు.
  3253. ఇల్లరికం వద్దు కొడకా అంటే సన్నాసంవుంటా అన్నట్టు
  3254. ఇల్లరికితే పండకవుతుందా? తోరణం కడితే వెళ్ళవుతుందా?
  3255. ఇస్తానన్న వాణ్ణి వస్తానన్న దాన్ని నమ్మరాదు.
  3256. ఇంట్లో పొయ్యి. చావిట్లో నుయ్యి
  3257. ఇల్లు చూస్తే తెలుస్తుంది ఇల్లాలి అందం.
  3258. ఇచ్చిన దాతకు ఒక్క దణ్ణం నిలిచిన పీతకు వేయి దణ్జాలు
  3259. ఇసక తక్కెడే ఈరక్కా అంటే పేడతక్కెడ పేరక్క అందిట
  3260. ఇంటిలో పోరు వీధిలో జోరు.
  3261. ఇంటిలో ఈరక్క పెరటిలో 'పేరక్క
  3262. ఇంటదానికి ఇత్తడి గొలుసు, 'బజారుదానికి బంగారు గొలుసు
  3263. ఇష్టమయితె ఈపరాలు కష్టమయితే కంపరాలు
  3264. ఇదేంటీ రా తాడెక్కావంటే ఇదిగిదిగో దూడమేత అన్నాట్ట,
  3265. ఈశ్వరా ఈశ్వరా ఎన్నాళ్ళూ అంటే, పూజారిని చూడలేదా అన్నాడట
  3266. ఇంట్లో పిల్లలు మంచంలో నల్దులు
  3267. 2404, ఈదిలో ఈరంగం పేటలో పేరంటం
  3268. ఆసుకోలా ఆనుకోలా అంటే పరుగుతీ నావెంటరా అందిట.
  3269. కక్కిన కూటికి ఆశపడేరకం
  3270. కట్టె వంకర పొయ్యి, కుట్రబుద్ది కాష్టం తీరుస్తాయి.
  3271. కాలితే మచ్చపడుతుంది. కాచితే మెత్తపడుతుంది
  3272. కర్ర ఎవడిదో బర్రె వాడిది
  3273. కలిగిన వారి పిల్లకు కాలి చెప్పు అరువా?
  3274. కలతల మారి కొంప జగడాల మారి వూరు
  3275. కన్నతల్లి కాదన్నా కట్టుకున్నది కాదన్నా (బ్రతుకే వ్యర్థం,
  3276. కల్పవృక్షం "పెరట్లో, పాదు వాకిట్లో
  3277. కత్తికి ఎదురు లేదు. మాటకు తిరుగులేదు.
  3278. కదురాడినన్నాళ్ళు కరువుల్లేవు
  3279. కదురుకు ఆరాటం పుటితే ఏరాటానా నిలవదు.
  3280. కలిగిన నాటి చుట్టాలు, కావాలన్నప్పుడు కనపడరు
  3281. సరిపి వచ్చిన సన్నీ వయసొచ్చిన పిల్లా
  3282. కష్టసుఖాలు కావడి కుండలవంటిీవి
  3283. కన్నతల్లి అంతే కడుపుచూచేది,కొంటె పిల్ల అంటే కన్ను కొట్టేది
  3284. కన్న తల్లికి కంటతడి, చవతితల్లికి కన్నుకుట్టు
  3285. కాకి కూసేవి కారుకూతలు, కోకిల కూసేవి కవితలు
  3286. కాకి తన్నిందంటే కీడు మూడినట్టు
  3287. కాకి తన్నిందంటే పేగు కదులుతుంది.
  3288. కాకి చావు కనకమ్మ చావు
  3289. కారం రాస్తే మంట, వెన్న రాస్తే తంట,
  3290. కలో గంజో దొరికిందే అదృష్టం
  3291. కలలో పరమాన్నం ఇలలో గంజినీళ్ళు
  3292. కలలో కనిపించింది కోట, ఇలలో దొరికింది గొయ్య
  3293. కల నిజమవుతుందా? కాకి కోకిలవుతుందా!
  3294. కాకి గూట్లోకోకిల పిల్ల రెక్కలు రాగానే ఎగిరిపోతుంది.
  3295. కాకుల్లో జెముడు కాకి-కూతల్లో కోకిల కూత గొప్ప
  3296. కాకులు నూరు కూసిన ఒక కోకిల కూత మేలు
  3297. కన్నంలో దొరికిన దొంగ గతి
  3298. కన్నం వేసిన దొంగకు తేలు కుట్టినట్టు
  3299. కురిస్తే వానై కురవాల, వేస్తే పైరు వేయాల
  3300. కుమ్మరికి కుండల కొదవన్నట్లు
  3301. కమ్మరి ఇంట్లో బొగ్గులు దొరకనట్టు
  3302. కంసారి పెంచిన గుర్రం చక్క పెళ్ళుతిన్నదట
  3303. కాంతాన్ని కనకాన్ని కోరనిదెవరు.
  3304. కలిమి వస్తే బలం వస్తుంది. కలిమి పోతే బలం పోతుంది.
  3305. కన్నాన బోయి కన్నాన వచ్చేరకం
  3306. కాకి చస్తే కొకులు ఎన్నో ఏడుస్తాయి. కొనివాడు చస్తే ఏడ్చేవాడుండడు
  3307. కులం లేని వాడికి గుణం లేని వాడికి పిలిచి పిల్లనిస్తారా
  3308. కూటికిలోకువయితే, కులానికి ' లోకువా
  3309. కులం కట్టు కలం పట్టు
  3310. కరువులో అధిక మాసం లేమిలో అధిక సంతానం
  3311. కాదంటే కర్రా బుర్రా నాకు పారేయండి.
  3312. కన్నె తనం పోయినా, అన్న మాట పోయినా బతుకే భారం
  3313. కన్నె సిగ్గు కనడం కోసం.
  3314. కాకిలా తిరిగాడు, హంసలా ఈదాడు.
  3315. కాకులలెక్క కరణాల లెక్క
  3316. కల ఫలించిందంటే అదృష్టం మనదే
  3317. కలువు తీయక పోతే పైరుకు చేటు
  3318. కష్టే ఫలి అన్నారు పెద్దలు
  3319. కాకి తెలుపు తోలు తెలుపు ఎక్కడన్నా వుందా?
  3320. కార్యం గదిలో పెళ్ళికొడుకు అలకట!
  3321. కారి దూరం వేరు కంటి దూరం వేరు
  3322. కాలిలో ముల్లు చెవిలో జోరీగ
  3323. కాలికి ఆనె, చెంబుకు చిల్లి.
  3324. కంటికి కలక వంటికి పోటు
  3325. కౌగిలించుకుంటే (ప్రియురాలు, కసిరి కొడితే కిర్రాలు.
  3326. కాలికి చుట్టుకున్న పాము కరిచి తీరుతుంది.
  3327. కాడు రమ్మంటుంది. ఊరు పొమ్మంటుంది.
  3328. కాలు కాలిన పిల్లి నోరు గాలిన కుక్క
  3329. కాలు చెయ్యి తిన్నగా వున్నంత కాలం మహరాజే
  3330. కాలు జారిన పిల్ల బతుక్కు నోరు జారిన పెద్ద బతుకు వ్యర్థం
  3331. కర్మ తప్పించటం బ్రహ్మతరం కూడా కాదు.
  3332. కమ్మలు నప్పేవాడుపైన తాళ్ళుపొడిచే వాడు కింద.
  3333. కల్లు తాగిన కోతిలాగా
  3334. కోతికి కొబ్బరి కాయ దొరికినట్టు
  3335. కాశీలో కొబ్బరికాయ కాని అన్నట్టు
  3336. కాగితంతో పులి, ఏకుల్తో ఏనుగు,
  3337. కాశీకి పోయినా శనీశ రం వదల్లేదట
  3338. కొంప కాలుతోందిరా అంటే నీళ్ళు కాచుకుందాం అన్నాట్ట
  3339. కీలు ఎరిగి వాత పెడితే వైద్యం,
  3340. కోడల్ని కొట్టినవాడు అత్తని కొట్టలేడా?
  3341. కులికేది కోడలు, అరిచేది అత్త
  3342. కో అంబే కోటి మంది.
  3343. కొకమ్మది కాకి బలగం, కోటయ్యది కోతి బలగం
  3344. కోతి కోతీ నీ పిల్లలెందరు అంటే ఆకాశంలో చుక్కలన్నీ నాపిల్లలే అతదట
  3345. కాని కాలం లో కాని డబ్బు అప్పు పుట్టదు
  3346. కార్తెలు మోసం చేస్తే కరువులు వస్తాయి.
  3347. కరణం మోసం చేస్తే కొంపలు కూల్తాయి.
  3348. కూచమ్మ కూడ బెట్టింది. మాచమ్మ మాయం చేసింది
  3349. కుక్క ముట్టె చల్లన, కోతి ముట్టె వెచ్చన
  3350. కుక్క. తోక పట్టి ఎదురీద మన్నట్టు
  3351. కుక్క సింహం కాదు, కుందేలు తోడేలు గాదు
  3352. కుక్క పని గాడిద చేస్తే నడ్డి విరిగిందట
  3353. కుక్క బుద్ధి దాలిగుంటకు తెలుసు
  3354. కుక్క మాసం తినే రకం
  3355. కుక్కని కొడితే బుద్దొస్తుంది. కూూలిని కొడితే బుద్దాస్తుందా
  3356. కుక్క దాలిగుంట సామెత
  3357. కులం కులం అని కూడు పోగొట్టు కుండే కులం పిలిచి కూడు పెట్టలేదట.
  3358. కూడిందమ్మ గుణం, కుదిరిందమ్మా పెళ్ళి
  3359. కోడరికి కొడుకు ముద్దు, అత్తకి అల్లుడు ముద్దు
  3360. కుమ్మరి, కంసాలి పాలికి వేసిన పొలం పంటలాగా
  3361. కోటి దండాలు పెట్టొచ్చు కోరిక తీరితే
  3362. కోటి మొక్కినా మొగుడి బుద్ది మారలేదట
  3363. కుక్కనడిగితే కుంకుమ పెడుతుందా?
  3364. కొడుకు మిన్న కోడలు సన్న
  3365. కొడుకుల్నికంటానత్తమ్మా అంటే వద్దంటానా కోడలమ్మా అందట.
  3366. కడుపునింపినవాడు కొడుకు,కడతేర్చిన వాడు కుంక
  3367. కుక్క తెచ్చేవన్నీ బొమికళే.
  3368. కుక్కల నక్కల పెళ్ళికి కుందేలు మంత్రాలు చదివిందట
  3369. కుంకాక్షి పెళ్ళికి ఏంకాక్షి ఆశీస్సులు
  3370. కుందనపు బొమ్మరూపు, కాలభైరవుడుబుద్ది.
  3371. కులం గుణంలేని రంభకన్నా కులం వున్న కోతిమేలు.
  3372. కుంటకట్టమీద కుర్చీ వేస్తేకూచొని లేచేసరికి కట్ట మింగింది.
  3373. కులం తక్కువని కూడెట్టనన్నారట,
  3374. కుక్క బదులుగా గాడిద మొరిగిందట.
  3375. కోటికి పడగెత్తిన భోగం కొరివి కాలిన రోగం సమానం,
  3376. కొండ వెనక అరువు లేంటి అంశే కోమట్లు రహస్యము అన్నాట్టు.
  3377. కొండ కదలదు, కోననీరు నిలవదు.
  3378. కొంప ఏకుతావురాసుపుత్రా అంటే సందేహమెందుకు నాన్న అన్నాట్ట
  3379. కొంప తగలడుతున్నది తమ్ముడూ అంటే చలికొచుకుందాం అన్నాట్ట.
  3380. కూతురు మీద ప్రేమ కోడలి మీద ఉంటుందా?
  3381. కొత్త ఆవకాయ మోజు, కొత్త పెళ్ళాం మోజు,
  3382. కొత్త శ్రీమంతుణ్ణోయి బంగారు కత్తితో బరుకు అన్నాట్ట.
  3383. కొత్త ఒక వింత పాత ఒక రోత,
  3384. కొప్పు వుంటేనేగా పూలు పెట్టుకునేది.
  3385. కొప్పులేని సతికి పిలకలేని పంతులు
  3386. కోతిపుండు బ్రహ్మరాక్షసి, నాలిముచ్చు వుండు రంపరాక్షసి.
  3387. కోర్టుకెక్కి ఓడినవాడు కోర్టులో ఏడిస్తే, గెలిచినవాడు ఇంటికొచ్చి ఏడ్చాట్టా.
  3388. గంజిలోకి ఉప్పులేదు మావా అంటే పాలల్లోకి పంచదార తెమ్మన్నాట్టు.
  3389. గచ్చపొదలాగా గలగలలాడే రకం.
  3390. గాడితప్పిన బండి వూబిలో దిగిందట.
  3391. గాడిదకు గడ్డి ఆవుకు కుడితి,
  3392. గాడిద గుద్దు వెడుతుందా? గద్ద పిల్లని కంటుందా?
  3393. గాలిని మాట కట్టువచ్చుగాని గయ్యాళి నోరు కట్టులేము.
  3394. గాలిలో మాటరాశాడు నీటిలో మూటకట్టాడు.
  3395. గతిలేని వాడికి. మతిలేని వెళ్ళాం,
  3396. గాడిద సంగీతం ఒంటె అందం.
  3397. గుడిని మింగేవాడు గుడిని, గోపురాన్ని, ధ్వజస్తంభాన్ని మింగేవాడికి తక్కువ.
  3398. గుడిలో దేవుడికన్నా గుడి పూజారి ముఖ్యం.
  3399. గువ్వ గూడెక్కితే రాజు మేడెక్కెడంట
  3400. గొరెల గోత్రాలు గొల్లల గోతాలు, తోడేళ్లు చూస్తాయి.
  3401. గోవు లేదురా గోపన్నా అంటే గోదారిలో ఉన్నాయి పాపన్నా
  3402. గోరీ దగ్గర వెళ్ళి గోడ పక్క గర్భాదానం.
  3403. గోడపెట్టు చెంప పెట్టు.
  3404. చంక నెత్తుకుంటే ముద్దు, నెత్తినెత్తుకుంటే నడమంత్రం.
  3405. చచ్చినాడి అందం బతికినోడి బంధం
  3406. చస్తే ఒక ఏడుపు బతికితే బతుకంతా ఏడుపు.
  3407. చచ్చినవాడికి పిండివంటలు, బతికినవాడికి బండెడు అప్పులు.
  3408. చచ్చేటప్పుడు నారాయణా అనమంటే సీసా అన్నట్టు.
  3409. చక్కనమ్మ చిక్కినా చక్కనయ్య సొక్కిన అందం చందం.
  3410. చచ్చినవాడి కళ్ళు చారెడేసి అన్నారట.
  3411. చదువు కంటే తెలివి - చాకిరేవుకు బానకి తెలుసు
  3412. చాపమీద జరిగింది సరసం, పస్టైమంచంమీద జరిగింది ప్రణయం.
  3413. చాప సరసంతో సాతాని దంపతులు తెల్లారి వున్నట్టు.
  3414. చిన్న ఇంట్లో పెద్ద కాపురం.
  3415. చిన్నత్త చిన్న పిశాచి పెద్దత్త పెద్ద పిశాచి,
  3416. చిల్లర కొట్టు శ్రీమహోలక్త్మీ అన్నట్టు.
  3417. చింతచెట్టుకు చిగురొచ్చింది. చిన్నదానికి పొగరొచ్చింది.
  3418. చిత్తడి చేల చినుకులు. చిన్నదాని చిందులు.
  3419. చిదంబర రహస్యం ఎవరికి తెలుస్తుంది?
  3420. చిలక చిలకా పేరు సెప్పు అంటే కీ కీ అందంట.
  3421. చిలకల కొలిక్కి సిగ్గులేదు, చిర్రె త్తిందానికి ఎగ్గులేదు.
  3422. చీకటి రహస్యం, వెన్నెల్లో బయట పడింది.
  3423. చుట్టుంగదా అని చూడబోతే దయ్యమై పట్టుకుందట.
  3424. చెప్పుతో రాస్తే గాని ధనియాలు జాతి మొలవదు
  3425. చెప్పేవానికి సిగ్గులేదు, వినేవాడికి ఎగ్గులేదు.
  3426. చెరుకు తీపి వెన్ను ఎండితే 'పోతుంది.
  3427. చెరుకు పిప్పికి చీమలు మూగినట్టు.
  3428. చూసి మురుసుకుంది చెప్పి ఏడ్చుకుంది.
  3429. చెప్పుడు మాటలు చేటు, చక్కని మాటలు ఘాటు.
  3430. చెరువు మీద 'అలిగితే ఎవరికి నష్టం?
  3431. చెవిలో జోరిగా, కాలిలో ముల్లు,
  3432. చిత్తలో తొలకరైతే తట్ట తగలెయ్యాలి
  3433. చెట్టును బట్టి కాయ - చేనును బట్టి పంట.
  3434. చెట్టు (క్రింద కులం కూటి దగ్గర బలం
  3435. చేతులో పనివుంటే 'కడుపులో బువ్వుంటుంది.
  3436. చేతులో పనివున్న నోటిలో నాలుకుండాలా.
  3437. చెయ్యి తిరగ చేసినా చాటనిండా .పెట్టరు.
  3438. చాకిరేవుకి వెనకపడింది. బంతి కూటికి ఏడిసింది.
  3439. జియో జియో. అంటే కుయ్యో కుయ్యో అందట.
  3440. జగమెరిగిన (బ్రాహ్మణుడికి జంధ్యమేల అన్నాట్ట.
  3441. జనని పాలు త్రాగి ధరణి నీళ్లు త్రాగి ధన్యుడవాలి
  3442. జాతి బుద్ధి జాతిది - కులం బుద్ధి కులానిది
  3443. జుట్టుంటే ఏకొప్పయినా పెట్టుకోవచ్చు.
  3444. జొన్నగింజ ఊచదియ్యం, వరిగింజ అటుకు బియ్యం
  3445. జిల్లేళ్ల సీమలో మల్లేతోట అందమట.
  3446. జీడి తింటే జివ్వుమంది గారె తింటే గావుమంది.
  3447. జిల్లేడు చెట్టుకు మామిడి కాయాలా?
  3448. జంగమాయన తాళం దాసరాయన సంగీతం
  3449. జోలె భుజాన వుంటే జగమంతా తిరగవచ్చు.
  3450. జానెడు పొట్టకోసం జన్మంత ఆరాటం.
  3451. టంగుటూరి మిరియాలు తోకమిరియాలు.
  3452. టంగుటంగు మంటుంది కుండ కంగుకంగు మంటుది బిందె
  3453. టక్కరి బావకు జిత్తులమరదలి సైగ.
  3454. టక్కరి మరదలకు జిత్తులబావ సైగ
  3455. డబ్బు వుంటే ఏడబ్బా వాయించినా ఫరవాలేదు.
  3456. డబ్బు లేదంటే తొరగా పొమ్మన్నాట్టు.
  3457. డబ్బుగలవాడిది బంగారు వుంగరం డబ్బు లేదంటే ఇత్రడి వుంగరం.
  3458. డబ్బులేనివాడి' బడాయి చేతగాని బడాయి.
  3459. డబ్బుంటే ఢిల్లీ భోగాలు, డబ్బు లేకుంటే ఎలవడాలు.
  3460. డబ్బును చూసి భయంగాని, బుద్దిచూసిగాదు.
  3461. తన్నులాటలూ వద్దు - గుద్దులాటలూ వద్దు.
  3462. తలగుడ్డకు తక్కువ గోచిపాతకు ఎక్కువ.
  3463. తనతో వచ్చింది తనియాలు, రానన్నది వెలయాలు
  3464. తుక్కు తుక్కుగా కోస్తే తట్టకెత్తేస్తా అన్నది.
  3465. తనువు చేసింది - మనను చేసింది మంచిదే అయింది.
  3466. తనువిచ్చింది , మనసిచ్చింది - ఇంకేముంది ఇవ్వటానికి.
  3467. దానిమ్మ చెట్టుకు మడిగుడ్డ కాపాలిక!
  3468. దారినపోయో ధర్మయ్య దర్మం చద్దువు రావయ్య
  3469. దారి తెలియని వాడు బాటసారి కాడు.
  3470. దాసిదాని కొడుకు అప్పుడు - దానకర్ణుడు యిప్పుడు
  3471. నయానభయాన చెప్పాలిగాని నాలుకకోస్తే ఎలా?
  3472. నడమంతరపు సిరిగాడు సింహాలబండి అడిగాట్ట,
  3473. నల్లరాయిమీద బొగ్గుగీత - తెల్లరాయిమీద సున్నవుగీత,
  3474. నంగనాచి నవ్వు నాలుగంధాల చేటు.
  3475. నా మొగుడు గిల్లింది నాబుగ్గ - నీ మొగుడు గిల్లింది నీ బుగ్గ
  3476. నిప్పుకు చెదలుపట్టింది - నల్లికి తేలు కుట్టింది.
  3477. నీళ్ళు. పల్లం చూపుతాయి - కన్నీళ్ళు బాధ చూపుతాయి
  3478. నీతిలేనిది కోతి, నీతి గలది నాతి
  3479. నిజం చెప్పరావమ్మా అంటే కూనకు పీల్లపుట్టింది అన్నట్టు.
  3480. నిజం దాచుకోవచ్చు గాని నిప్పు దాచుకోలేము.
  3481. నివ్పల్ళో వుప్పేసినట్టుంది నా పని
  3482. నీళ్ళు ఎవరు పోసినా అవి వల్లంలోకి పోతాయి
  3483. నిజం నిప్పులాంటిది, నీరు తల్లిలాంటిది
  3484. నీరులేని వూరు దేవుడు లేని వూరు వున్నా ఒకకే లేకున్నా ఒకటే!
  3485. నవ్వే నోటిలో ముత్యాలు, 'ఏడ్చేనోటిలో బొగ్గులు,
  3486. నెలబొలునికో నూలుపోగు, పూర్ణచంద్రునికి నమస్కారం.
  3487. నోట్లో పిప్పినన్ను - కంట్లో వుసి కండ
  3488. నీ ఇల్లు నా ఇంటికి ఎంత దూరమో, నా ఇల్లు నీ ఇంటికి అంతే దూరం
  3489. నందిని చెయ్యవయ్యా. ఆచార్య అంటే పందిని చేసాట్టా.
  3490. నక్క పోయిన తరువాత బొక్క నట్టుకుని ఏడ్చాడట.
  3491. నక్క జిత్తులు నారదుడి. ఎత్తులు.
  3492. నట్టేట్లొ వేసినా ఎంచి మరీ వెయ్యాలి.
  3493. నన్ను నమ్ము నారాయణ అంటే నక్కను నమ్మతా అన్నాట్ట.
  3494. నలుగురు నడిచేది దారి పదుగురు చెప్పేది నీతి.
  3495. నరుడు కన్ను వడితే నల్లరాయి బద్రలవుతుంది.
  3496. నాతికి వయసొచ్చిందంటే కనీసం కోతి మొగుడన్నా కావాలి.
  3497. నాదం లేని గంట నాములేని పంట.
  3498. నానాప చేనుగదా అనుకుంళకే వుంగడి తగిరిందంట.
  3499. కాకిగూట్లో కోయిలగుడ్డు.
  3500. నామాల కాకి, విభూది గద్ద, సిద్దుడి కయినా దొరకవు.
  3501. నూరు కాకులు ఓ కోయిలను బతకనిస్తాయా?
  3502. నపుంసకుడికి రంభ. దొరకదు, గొడ్రారికి నంతాముండదు.
  3503. నామాలు పెట్టినంత మాత్రనే చావు బుద్దులు పోతాయా?
  3504. వెమలిని చూచిన కాకి ఫింఛం పెట్టుకుంటుందట.
  3505. నత్తనడక తాబేలు షరుగు.
  3506. నోరు గలవాడిదే రాజ్యం కరగలవాడిదే బర్రె,
  3507. నిప్పు నెవరన్న గుడ్డను కట్టుకుంటారా?
  3508. నీ ముఖాన పొద్దు పొడిస్తే - నొయింట కనకం గురుస్తుందన్నాట.
  3509. పంచాంగం పోయిందని తిధివారాలు పోతాయా?
  3510. పండ్ల చెట్టు కాసేవాడికీ ఆ దెబ్బలు తప్పవు.
  3511. పంది మెచ్చేది బురద - పడతి మెచ్చేది పన్నీరు.
  3512. పందిరి మంచంమీద పడుకున్ననే పందిరి గుంజా పనిచెయ్యి అన్నాట్ట.
  3513. పచ్చగడ్డికి నీళ్ళు ఆగుతాయా?
  3514. పదిరోజులు పస్తున్న వాడింటికి మూడురోజులు పస్తున్నవాడు వెళ్ళాడట
  3515. పడమర మెరిసింది - ఉత్తరం ఉరిమింది పిడుగులు పడ్డాయీఅన్నాట్ట.
  3516. పానకంలో వుడక - వడపప్పులో గరిక
  3517. పట్టేవర్ధనం పెట్టేను పాదపూజ చేయమన్నాడట
  3518. పట్టెడన్నం కావాలిగాని గంపెడు గడ్జెందుకు?
  3519. పిల్లను చూచి చీరకొనాలి - బావి చూచి చేద కొనాలి.
  3520. పిల్లపోయినా వురిటికంపు పోలేదట.
  3521. బెల్లమున్నచోట చీమలు చేరుతాయి
  3522. భిక్షాధికారికి లక్షాధికారికి ఎందుకు పోలిక?
  3523. మొగుడు చచ్చి మొత్తుకుంటూ వుంటే రంకు మొగుడొచ్చి రాళ్ళేసాడట
  3524. భలేభలే అంటాడు ముఖం తెలుసా అన్నాట్ట.
  3525. మీయింట ఇంగలం మాయింట మంగలం అన్నాట.
  3526. మంగలి వని గొరగడం చాకలివని ఉతకడం.
  3527. మంచం క్రింద మంతరసాని, మంచంపైన దొంగచూలాలు.
  3528. మతిలేని వెళ్ళం గతిలేని మొగుడు.
  3529. మనింటి దీపమేగదాని ముర్దుపెట్టు అన్నాట్ట.
  3530. మంచి మనిషి లోతు - పాడుగొయ్యిలోతు తెలియవు.
  3531. మట్టి దొరికిందని మాణిక్యం దొరుకుతుందా.
  3532. మనిషి కదువున రాక్షసి పుట్టచ్చు. రాక్షసి. కడుపున మనిషి పుట్టడు..
  3533. మాచికమ్మ సమర్తాడిందట నాలుగు తాటాకు ముక్కలి మ్మానాట్టు.
  3534. మాచర్ల రాజులకు మీసాలు లేవంటే పల్నాటి రాజుల మిద్దెలకు వాసాలు లేవన్నాట
  3535. మార్గశిరంలో మబ్బులు మాఘమాసంలో వానలు.
  3536. మూల ముంచుతుంది విశాఖ విసురుతుంది,
  3537. మూలవిరాటుకు పూజలేనప్పుడు - ఉత్సవవిగ్రహాలకు హార. తులెందుకు?
  3538. మింగమెతుకు లేదు తాగ గంగ లేదు.
  3539. మొగుణ్ణి గిల్లి మొయ్యో మొయ్యోమన్నదట.
  3540. మోటువాడికి మొగలి పువ్విస్తే తాంబూలమా అన్నాట్ట.
  3541. మారుమనుం కోడలికి మలిమనుం అత్త సలహాలు
  3542. ముడ్డికి తెలుస్తుందా కొప్పు అందం?
  3543. మెగుడంటే ముఖం మాడ్పు, రంకు మెగుడంటే రంగు మార్పు
  3544. రాజుగారి. మేడలో గువ్వ చేరింది,రాణీగారి మేడమీద గోరింక చేరింది.
  3545. రామాయణంలొ పిడకలవెట రంగసాని దిబ్బమీద రంకులాట.
  3546. రాతికుండ ఇసకతెడ్డు ఎక్కడన్న వుంటాయా?
  3547. రోతు మెతక అయితే గుర్రం మూడుకాళ్ళతో నడిచిందంట,
  3548. రాక రాక అంటే పోకే పోకే అందట.
  3549. రాజుగారి బావమరిదైన, బోగందాని తమ్ముడైన అన్నీ లాభాలే!
  3550. రంభకోసం స్వర్గానికెళితే రాలుగాయే ఎదురయిందట!
  3551. రాయిరాయి రాసుకుంటే నిప్పురవ్వలు. కొమ్మా కొమ్మా రానుకుంకే నిప్పుమంటలు,
  3552. రాగాలు తీసి తీసి గవయ్య అయినాడు.
  3553. రోగాన పడీ పడీ నరకాన చేరాడు.
  3554. రాచి రంపాన పెట్టే రకం
  3555. రాగిడబ్బు సంపాదనలేదు వెండిరూపాయి అప్పా?
  3556. రండి రండి రావే అంటే ముండా వస్తావుందు అందట
  3557. రాజునుజూసిన కంట మొగుణ్ణి మొత్త బుద్దయిందట
  3558. రామా రామా అంటే ఏమిరా బూతులు అన్నాట్ట
  3559. రామాయణమంతావిని రాముడి పెళ్ళాం సీతేనా అన్నాట్ట?
  3560. రాను రామ అంటే రామకోటి, కామ కామ అంటే కామ కోటి!
  3561. రావణ కాష్టం విభీషణ రాజ్యం
  3562. రామన్నకు భీమన్నకు వరస కలిసినట్టు
  3563. రాలుగాయి వెళ్లాం పేచీకోరు మొగుడు
  3564. రాయి ఏదయినా మానే పళ్ళూడకొట్టుకోవడానికి
  3565. రాతి ముగ్గు కోతి ముగ్గు
  3566. రాముడు కొలుతగిలి రాతినాతయితే నాకాలు రాయికి తగిలీ కోతివుండయింది.
  3567. రండ ముదిరితే రంగసాని, తొండముదిరితే వూసరవెల్లి
  3568. రహన్యంగా బుట్టలో పెడితే వీధిపాలైందిట
  3569. రంకుతనంవల్ల బొంకుతనం వల్ల బతుకుతీరదు.
  3570. రాగులు చల్లితే. రేగులు మొలిచాయట
  3571. రథమెక్కింది దేవుడే అయినా కదిలించాల్సింది కనకా చారి.
  3572. రప్పవాల్చింది కొంపలార్భింది
  3573. రాసిన తప్పులు దిద్దుకోవచ్చు చేసిన తప్పులు దిద్దుకోలేము
  3574. రౌతుకొత్తైతే గుఱ్ఱం కుంటిదట
  3575. రెండుపూటలా 'తినడంభోగం ఒంటిపూట తింటం ఉపవాసం
  3576. రానున్నది రాకమానదు ఫోనున్నది పోకమానదు
  3577. రాక్షసికి నరమాంసం ముద్దు పండుకోతికి పుండుముద్దు.
  3578. రాగిగొట్టం అయితే తాయిత్తు బంగారు గొట్టమైతే భుజకీర్తి
  3579. రచ్చకెక్కీ నదాన్ని రాజయినా ఏం చేయలేడు
  3580. రోజూతినేది తిండి. భక్ష్యంతో తినేది భోజనం
  3581. రాగంతీస్తే గవయ్య చిడతలు కొడితే రాఘవయ్య
  3582. రాచపీనుగ తోడులేనిదే పోదట
  3583. రాజులదగ్గర ఉంటే రత్నాలు 'పేదల' దగ్గరుంటే పలుకురాళ్ళు
  3584. రామాయణ మంతావిని ఆంజనేయుడికి తోకుందా అన్నాట్ట
  3585. రామకోటి రాశాట్టు తీటరోగం వచ్చిందిట
  3586. రంకుతనం నేను వేస్తే నీకేం వచ్చిందే పోలేరమ్మ అన్నాట్ట,
  3587. రేపటికి రెండు అనుకుంటే ఎల్లుండికి మూడు
  3588. రామచిలుక మాట మాట అంటే బూతుబూతు అందిట
  3589. రాజ్యంకొలిపోయినా బోగందాని బురుజు నిలిచిందిట.
  3590. రాసుకునేదినాకు వూసనుకూనేది నీకు అన్నాట్ట
  3591. రోలెక్కిన చిన్నది వోలి ఇచ్చిరమ్మన్నదట
  3592. రాబందులకు చచ్చిన గొడ్డేప్రీతి
  3593. రాటం మీద రాగం ఘోటంమీద దరువు.
  3594. రాత్రి జాగారం పగటి పని చెరిచిందట
  3595. రాగం తప్పిందిరా అంటే యతికి మతిలేదురా అన్నాట్ట
  3596. రోకలితేరా పిచ్చోడా అంకే తలకి చేట్టుకోనా అన్నాట్ట
  3597. రాతిబొమ్మకు బంగారపు సొమ్ములు . బంగారు బొమ్మకు. ఆకులు,
  3598. రుచికి పుల్లకూర వాసనకు కరివేపాకు.
  3599. రాజురాజు అంటే తిండికా, పనికా అని అడిగాట్ట.
  3600. రత్నాలు రాలాలి మంత్రాలు వెయ్యి అన్నాట్టు
  3601. రాజుకంకే మొండివాడే బలవంతుడు
  3602. రోగికి నిద్రరాదు భోగికి కునుకురాదు
  3603. రాలిన పళ్ళు వేగినగుళ్ళు
  3604. రోగాలు రాగాలు ఎన్నెన్నో ఉన్నాయి
  3605. రాజా వారు ముష్టిదాన్ని మెచ్చారేమంటే నాకళ్ళతో చూడు మంత్రీ అన్నాట్ట.
  3606. రెక్కలాడించిందే పక్షి
  3607. రాముడులేని రామాయణనమూ?
  3608. రంకునేర్చిన దానికి బొంకు నేర్చింది తోడు
  3609. రాహువు కేతువు కలిసి శనికి సహాయం చేశారట.
  3610. రామాయణంలో భీముడెందుకు లేడు అన్నాట్ట
  3611. రాతికుండని చూసి మట్టికుండ పారిపోయిందిట
  3612. రూపాయిలేని వోడు కానిలేనివాడి దగ్గరికి అప్పుకెళ్ళాట్ల
  3613. రామాయణం రాసింది బోయ,భారతంరాసింది కోయ
  3614. రామరాజ్యంలో బంగారం కరువు భరత రాజ్యంలో భోజనం కరువు
  3615. రెడ్డాచ్చె మొదలాడు రాజొచ్చెమళ్ళాడు అన్నాట్ట
  3616. రాజు మెచ్చిన భోగంది రాజ్యానికి సాని అయిందిట
  3617. రంగసానే దొరసాని దొరసానే రంగసాని .
  3618. రత్నాలిన్నీ కోటలో రాళ్ళన్నీ "పేటలో
  3619. రాజుగారి బావమరిది హోదా, సానిదాని తమ్ముడుసోకు.
  3620. రాజుతలచుకుంకే రాళ్ళచేలో రత్నాలు: పండుతాయి '
  3621. రొయ్యగాడికి బారెడు మీసం రోషగాడికి .మూరెడు మీసం
  3622. రోగం సంగతి రట్టయింది సంసారం గుట్టుగా ఉంచు అన్నాట్ట
  3623. రోసానికి పోయిన సందెగాడు రోలుమెళ్ళో కట్టుమన్నాట్టు
  3624. రాయని భాస్కరుడు గీయని చిత్రకారుడు.
  3625. రత్నానికి వాసనుంటుందా స్వార్థానికి రుచుటుందా.
  3626. రైతేరాజు బుధుడేమంత్రి
  3627. రోగికోరిన పత్యమే వైద్యుడు చెప్పాడు
  3628. రోలు వెళ్ళి మద్దెలతో మొర పెట్టుకుందట
  3629. రోషంలేని బంటుకు మీసంలేని రాజుకు నష్టమే లేదు.
  3630. రెక్కాడితేగాని డొక్కాడని వాడికి రత్నం దొరికితే రాయి అన్నాట్ట.
  3631. రాజెక్కింది' గుల్హం చాకలెక్కింది గాడిద,
  3632. రెండురెండే మెల్లంగారెండే
  3633. రోటికాడ రోకటిపాట ఇసుర్రాయికాడ అదేపాట.
  3634. రక్షించిన వాడ్నే భక్షించు అన్నాట్ట
  3635. రాగంరాని వాడికి పాటమోజు తాళంరాని వాడికి భజన మోజు
  3636. రాత్రంతా భజనచేసినా భక్తి పూజ్యమేనట
  3637. రాణీగారు వచ్చారు రాగి సరకటి వెట్టమన్నారట.
  3638. రెక్కలేని షక్షి తోకలేని చుక్క
  3639. రాజ్యంపోయింది రాజసం. పోయింది ఇంకేముంది పోవటానికి
  3640. రాణీవానం వచ్చింది మూలవానం పీకమన్నాట్టు
  3641. రాత్రికి వెన్నెల అందం చేనుకు కంకులు అందం
  3642. రంగుల ఈక పక్షి పంజర్లానికి అందం.
  3643. రాతరాసింది బ్రహ్మ గీతగీసింది లక్ష్మణుడు
  3644. రోగానికి తగిన మందు పడితేనే రోగికి లాభం
  3645. రోగం ఒకటి మందొకటి
  3646. రోగానికి, రాగానికి, భోగానికి అంతంలేదు
  3647. రాయిదెబ్బతిన్నా,కర్రదెబ్బతిన్నా కడుపులోకి దొరికితే కైలాసం పోయినట్టే
  3648. రాజుగారి మోజు భోగందానికి భోగం.
  3649. రహస్యం బట్టబయలు చేసి ప్రచారం మూసేశాడట.
  3650. రంగులు మార్చేది ఊసరవెల్లి,
  3651. రామచిలకవలుకు, కోకిలమ్మకులుకు
  3652. రొట్టవిరిగి నేతిలోపడ్డా తినే అద్భష్ట్రముండాలి.
  3653. రొయ్యమీసాలు దోమనంగీతం ఎవరికోసం
  3654. రాగల వసంతాన్ని కాకులు ఆపగలవా?
  3655. లాఠీ లాలీ జో లారీ లారీ ఢీ
  3656. లోకాజనాసుఖినో భవంతు అంటాడు విద్వానుడు, అనారోగ్యమే మహా భాగ్యం అంటాడు వెద్యుడు.
  3657. లంకలో విధీషణుపు అడవిలో సూర్పణఖ
  3658. లేనిదానికోనం ఫోతే ఉన్నది కాస్తాపోయింది
  3659. లోకం ఎరగనివాడు అలంకారం ఎరగని అడది కొరగారు
  3660. లంకణాల్లో తెచ్చుకున్న బలమంతా అపత్యంలో హరించుకు పోతుంది.
  3661. లాభం లేని శెట్టి వరదన పోడనీ చెయ్యిచాచినా అందుకో లేదట.
  3662. లాభానికి వ్యాపారం జుట్టుపట్టుకోడానికి జూదం
  3663. లంకలో మేత తేవాలి ఏటికి అడ్డుకట్టైమన్నాడట
  3664. లంకలో పుడితే రాక్షసుడు, కిష్కిందలో పుడితే కోతి.
  3665. లంకణం చేయమంటే వచ్చమేంటి అన్నాట్ట.
  3666. లగ్గం ముందా పల్లకి ముందా అన్నాట్ట.
  3667. లేవలేని అత్తకి ఓపికలేని కోడలు సహాయం
  3668. లేస్తే మనిషికాడు కదిలే కోతికాడు
  3669. లాభం గూబలో కొచ్చింది ఆవునెయ్యితో తలంటమన్నాట్ట
  3670. లేకలేక లోకాయి పుడితే చెవులు కుట్టడానికి గడ్డపార కావాలన్నాట్టు.
  3671. లేడికి లేచిందే ప్రయాణం పందికి పడుకుందే నిద్ర.
  3672. లోగుట్టు. పెరుమాళ్ళకెరుక తెరగుట్టు సాతానికెరుక,
  3673. లోభిసామ్ము లోకులపాలు కానిసామ్ము కాకులపొలు.
  3674. లంకంత కొంపలో చెట్టంత చీపురు.
  3675. లోకాయికి మాటనస్ట్రం లోభికి మూటనష్టం.
  3676. లవణం అంటే నాకు తెలియదా, సోమిదేవమ్మ కూతుర్ని దూడరేణం అన్నట్టు.
  3677. లోకం మెచ్చింది గొప్ప లోభిమెచ్చింది దిబ్బ,
  3678. వెన్నెల అడవి కాచిన్కా వరర్షం సముద్రంలో కురిసినా ఒకే,
  3679. వేములో తీపుండదు అత్తరికంలో ప్రేమ ఉండదు.
  3680. విషం మాటలు తేనె వూతలు
  3681. వుండి వుండి వసంతమాడాలనుకుంటే అవ్వ ఎదురొచ్చింది
  3682. విశ్వేశ్వరుడైనా శని ప్రభావానికి లోకువ
  3683. వారణాసిలో గంగశుద్ది జగన్నాధంలో కులంశుద్ది,
  3684. వాసనంటూ ఉంటే ఏ గుడ్డ కప్పినా ఆగదు.
  3685. మెరిలేని గొల్ల తీపిలేని చెణకు
  3686. వేర్లు వడ్డ కాపురం గట్టు పడ్డ పొలం
  3687. వీరణం లేనిది కొలువు కాదు, వూరణం లేనిది బూరెకాదు.
  3688. వేఠికి వేస్తే మెలికె కాలికి వేస్తే బంధం
  3689. వారకాంత కట్టిన చీర వారణాసిపట్టు "పేదరాలు కట్టిన చీర పిచ్చిపట్టు.
  3690. వాసం పారు తప్పరాదు చుట్టరికం కులంతప్పరాదు
  3691. వేడి నీళ్ళ పక్కన చన్నీళ్ళు ఉండాలి.
  3692. వీధిలో చేసుకున్నాడు ఇంట్లో ఉంచుకున్నాడు.
  3693. విజయభేరి మ్రోగించు అంటే రణభేరి మ్రోగిప్తానన్నాట్ట
  3694. విశ్వామిత్రుడు సృష్టించినదే త్రిశంకు స్వర్గం
  3695. వుల్లిలేని కూర పప్పులేని పెళ్ళి.
  3696. వెస్టవుడు గురువుసాతాని శిష్యుడు.
  3697. వీరణానికి తోరణం కడితే తాతయ్యకు పెళ్ళా అందిట,
  3698. విద్యలేని బ్రాహ్మడు కత్తిలేనిక్షత్రియుడు.
  3699. వైకుంఠం పోవాలనుందా నాచేతిమాత్ర ఒకటిస్తానన్నాట్ట,
  3700. వర్షంకురుస్తుంది అనుకుంటే వరద సూడేసిందట.
  3701. వైరాగ్యంకోసం పురాణం వింటే పచ్చిశ్చంగారం వంటపట్టిందట.
  3702. విశాఖలో ఇల్లుకట్టద్దు, పుబ్బలో విత్తు చల్లద్దు అన్నాట్ట.
  3703. విరోధికి లోకం గిట్టదు, యదార్ధానికి అసత్యం గిట్టదు.
  3704. వంటఇంట కుందేలు కుంపటిదగ్గిర కోడి.
  3705. వండుకోడం చేతకానమ్మకు దండుకోడం చేతవ్వాలి.
  3706. వరహా అసలుకన్నా మెహరు వడ్డీ ముద్దు.
  3707. వసుదేవుళ్ళాంటి వాడే అవసరానికి గాడిదకాళ్ళు పట్టాడు.
  3708. వనితక్కాని లతకుకాని కవితకుకాని సహాయం అవసరం.
  3709. వడ్డించేవాడు మన వాడేలే కడ బంతిన కూచో పరవాలేదు అన్నాట్ల
  3710. వాతల అందం చూసి వాతరోగం పోయిందిట.
  3711. వెన్నెల కాస్తే పున్నమి చుక్కలు కాస్తే అమాస.
  3712. వెన్ను వేస్తే వైరుకర్ర పొన్నువేస్తే చేతికర్ర
  3713. వేలంవేస్తే అధికారి దండోరావేస్తే ఊరికాపరి.
  3714. వెంకకేశ్వరుడికే తప్పలేదు వడ్డీలు కట్టడం.
  3715. వేరుకు అందాలి నీరు కంకికి అందాలి పైరగాలి.
  3716. వర్షాకాలంలో వరదలు ఎండాకాలంలో వడగాలులు
  3717. వొంటినిండా గంధం పంటినిండా వక్క
  3718. వొడికితే దారం, ఒణికితే రోగం
  3719. వంటిపూట రోగానికి వుట్టెడుమందులు.
  3720. విష్ణువు వుపేరుతో గంగిరెద్దు శివుడు పేరుతో ఆంబోతెద్దు.
  3721. వజ్రాయుధం వంటి మందు రామబాణం వంటి రోగం.
  3722. విద్యలేని అయ్యగారికి వినయంలేని బంట్రోతు.
  3723. వ్యాఘానికి దయలేదు కామధేనువుకు స్వార్థంలేదు.
  3724. వంకాయ కూరకు టేంకాయ మసాల.
  3725. వీరమ్మభోగం రాగమ్మరాగం.
  3726. వశిష్ఠుల వారు మంత్రాలు చదివితే పెళ్ళి అయిపోయినట్టేనా
  3727. వీధిలో వీరంగం సంతలో సారంగం.
  3728. వయస్సు వస్తే సరసం వస్తుందా?
  3729. వసంతం వచ్చింది కోకిల కూసింది.
  3730. శంకినీ జాతికి పద్మినీ బుద్దులా?
  3731. శంకరగిరి మాణ్యాలకు దారి ఎటు అడిగాట్టు.
  3732. శంకరా శంకరా అంకే మూతి వంకర పోద్దాన్నట్లు
  3733. శతమానం నాకెందుకూ ఒక మానంతో చస్తుంటే అన్నాట్ట
  3734. శంభులింగం కుప్పెకట్టు, రామలింగం కనికట్టు
  3735. శకునంచూసి వెళ్ళి కెళితే పేలాలేగాయట
  3736. శ్రీవైప్లవులమధ్య రొయ్యల బుట్టళాళీ
  3737. శేషాయ బుసలు కొడితే గరుడాయి గాండ్రించాడట
  3738. శుద్దులు వందై నా ఒక్కముద్దు మిన్న
  3739. శంఖం ఊదేది శంకుపాతేది
  3740. శిష్యుడు పెరిగితే గురువు
  3741. శనిపడ్తితే ఏడేళ్ళు నేపడితే పద్నాలు గేళ్ళు
  3742. శ్రీమహాలక్ష్మికి అవతారాలెక్కువ.
  3743. శంభో శంభో అంటే మూతివంకరపోయింది అన్నాట్ట
  3744. శెట్టిచేసిన ధర్మాలు సత్రంరాయిలో తెలుస్తాయిట
  3745. శివ ఢివ అన్ననోటితో ఛీ ఛి అన్నాట్ట
  3746. శిరోభారం ఎందుకొచ్చిందంకే ఆలి చెయ్యి తగిలిందన్నాట్ట
  3747. శత్రువుని చూసి కోపం సంతుని చూసి శాంతం
  3748. శుక్రవారంనాడు తన సామ్ము మంగళవారం నాడు మంది సొమ్ము దాచుకోవాలట
  3749. శంఖుగంట వాయిస్తే జంగం తాషామార్నా వాయిస్తే స
  3750. శతమర్కట తు విద్యార్దిని కాను అన్నాట్ట
  3751. శివార్చకుడు వెళ్ళి తంబళిని కొట్టాట్టు
  3752. శుంఠశుంఠ అంకే నాపేరెట్ల తెలుసు అన్నాట్ట.
  3753. శగ తగిలితే పాకం కరుగుతుందట.
  3754. శివుడంటే యముడికి కూడా భయమే
  3755. శ్రావణ మేఘాలూ చిత్త జల్లులు.
  3756. శివరాత్రికి చరి శ్రీరామనవమికి ఎండ,
  3757. శోభనం నాడు సంతోషం, పురిటి నొప్పుల్లో ఏడుపు తప్పవా
  3758. శాస్తుర్ణవారు సంధ్య-వారక పోతే పాద్దుకుంకదా
  3759. శివకాశిలో చేసింది ఆటంబాంబుకొదు రాజన్న చేసిందే రాకెటుకాదు.
  3760. శుక్రవారం శక్తిపూజ శనివారం శివపూజ.
  3761. శనిగ్రహం చూపు భుధగ్రహం దయ.
  3762. శివరాత్రికి జంగొలు, సంక్రాంతికి హరిదాసులు.
  3763. శివశివ అని సీగపెంచితే గోవిందా అని గొరిగేశాట్ట,
  3764. శతమానం భవతి అంకే ఒకటి చాల్లే అన్నదిట
  3765. శతకోటి .లింగాలున్నాయంశే నాదెక్కడుంది అన్నాట్టు.
  3766. శంకినీ జాతి పొతివ్రత్యం.
  3767. సంకరజాతి అంటే. సజజ్ఞకర్రలాంటిదా అన్నట్టు.
  3768. న్వర్గంలో శనికీ భయపడి అరణ్యంలో దాక్కున్నాట్టు.
  3769. సుఖ మెరగని నిద్ర,. ఆకలెరగని వంట
  3770. సోమలింగం సోమలింగం అంటే రామలింగం కొడుకా అన్నాట్ట
  3771. సోమవారం వాగ్దానం మంగళవారం తొంటిచెయ్యి
  3772. సూది బెజ్జం అంక గొంతు ఆకాశమంత ఆశ.
  3773. సూర్యుడి ఆవేశం కవిగారికావేశం
  3774. సన్నాయి నొక్కులేగాని సంగీతం లేదు
  3775. సూది కోసం సూదిపోతే ఏడితరాల రంకు బయటపడిందట
  3776. సులక్షణాల పెళ్ళికొడుకు అనుకుంటే, అవలక్ష్హణాలాన్నీ బయటపడ్డాయట
  3777. సంసారాం వద్దని సన్యాసం పుచ్చుకుంటే గాడిదబరువు మీదపడింది.
  3778. సొంఠిలేని కషాయం రాముడు లేని రామాయణం
  3779. సాలేసిందే బట్ట, కుమ్మరి చేసిందే కుండ
  3780. సంగీతానికి గాడిదనడగాలి, అందానికి లొట్టినడగాలి
  3781. సత్యభామ వేశం వేసి ఒక్కసారి చస్తానన్నాడట
  3782. సంసారం లేని సిరి,పాండిత్యం లేని పేదు
  3783. సంతకం బలికోరుతుంది సరసం చలి కోరుతుంది
  3784. సింగినాదం లో శృతి లేదు
  3785. సేద్యం చెయ్యనివాడికి నైవేద్యానికి కూడా దొరకదు
  3786. సంతులేని తల్లి, చింత లేని పెళ్ళి
  3787. స్థానబలమేకాని తనబలం లేదన్నాడట
  3788. స్వర్ణం చూసిన కంసాలి ప్రేమ
  3789. సరాల్లొదాగింది దారం పూదండలో దాగింది నార
  3790. సిగ్గులేని వాడు శ్రీరంగం పోతే ఎగ్గులేని వాడు వెంకటగిరి పోయాట్ట
  3791. సత్యం తప్పినా పత్యం తప్పినా పాట్లు తప్పవు
  3792. సొమ్ముల ఆశ పాపం తెచ్చింది చెడు ఆలోచన చేటు తెచ్చింది
  3793. సింగారించుకున్నావేమే చిన్నదానా అంటే చలిగా ఉందిరా పులి మావ అందిట
  3794. సాక్షం చెపుతావా శెట్టి అంటే సందులో అడిగొస్తా అన్నాట్ట
  3795. సాక్ష్యం చెప్పవే మానసా అంటే నోరు మూసుకొని నిద్రపో అందెటు
  3796. సంచిలేని వాడికి ముష్టిలేదు మల్లలేని వాడికి మూదాకవళం లేదు.
  3797. సిగబారెడు దండమూరెడు
  3798. సీతకు చెరలేక పోతే రావణాసురుడు లేడు
  3799. స్వర్ణానికి వాసన రత్నానికి రుచి ఉండదు
  3800. సంకటికోసం రాగులు గంజికోసం చోళ్ళు
  3801. స్వర్ణం బండెడున్నా చిటికెడు టంకంలేనిదే అతుకుపడదు.
  3802. సిద్దడి గురువు బ్రహ్మంగారు అబ్బడి గురువు అయ్యంగారు
  3803. సొంఠిముదిరి అల్లాన్ని వెక్కిరించిందంట
  3804. సంతోషం లేనిదే బలంలేద్దు ధ్రైర్యంలేదు.
  3805. సంధ్యా వందనం చెయ్యరా అంటే సూర్యుణ్ని ఆగమన్నాట్ట
  3806. సంతలో సంసారం సానిదానికి పాతి[వత్యం
  3807. సంగీతానికి గార్హభం హాస్యానికి కోతి
  3808. సంసారం విడిస్తే సన్యాసం, స్వర్గం కాకుంటే కైలాసం,
  3809. సన్నదియ్యంతో అన్నం ముతక బియ్యంతో పులిహోర.
  3810. సన్నెకల్లులేక పోతే పెళ ఆగదు సంధ్యవార్చకపోతె సంధ్య ఆగదు.
  3811. సాతాని జియ్యరు మంత్రిత్యం, జాండ్ర ప్రభువు రాజ్యాంగం
  3812. సీతపవుట్టుకపోతే. రామాయణంలేదు.కృష్ణుడు పుట్టకపోతే భారతంలేదు.
  3813. సిరాబుడ్డి తేరా అంటే మొహం అంతా, పూసుకున్నాట్ట
  3814. సకలగుణాభిరాముడు అంటే కుంటిసీతమ్మ మొగుడా అన్నాడట
  3815. సూర్యుడా! నమస్కారం చేస్తాను అంటే ఆగుతాడా
  3816. సంపదతెచ్చిన మెప్పులు దానితో పాకే పోతాయి
  3817. సుబుద్దికి చేటులేదు అబుద్దికి అదుపులేదు.
  3818. సందడిలేని పండగ తాళంలేని సంగీతం
  3819. సాగినంతసేవు బొంకు సంబరంగానే ఉంటుంది
  3820. సాయిబాబా సాయిబా?దేవుడు హిందువా?
  3821. సాలినేత పట్టుపంచె మాల నేత మడిపంచ
  3822. సురసుర .మంశే నిప్పు జరజర మంళేనీరు
  3823. సిరిగలవాడే రాజు
  3824. సోవియట్‌ వాళ్ళది శాంతిఖర్ను అమెరికా వాళ్ళది యుద్ద ఖర్చు
  3825. సభలో సోదరులు ఎన్నికల్లో మహాశయులు
  3826. స్తంభంలేచినంత మాత్రాన భవనం అవుతుందా
  3827. సూదిలోది దారం. దబ్బనంలోది తాడు
  3828. సత్యంగారు అసత్యం పలకమంటే మాయింటి 'పేరబద్ర మేగా
  3829. సోమవారం శుభలక్ష్మి మంగళవారం మహాలక్ష్మి
  3830. సోదిచెప్తే సోదమ్మి, మంత్రమేస్తే మంత్రగత్తె
  3831. సాలినేత పట్టుపంచె, మాలనేత మడిపంచె.
  3832. స్వామికార్యం స్వకార్యం సత్వరం జరగాలి.
  3833. సత్యమే జయం అసత్యమే భయం.
  3834. సుఖం స్వర్గం ఇహం దుఃఖం
  3835. స్వర్షం దగ్గరుంచుకొని బంగారం వెతికాట్టు.
  3836. సంతానానికి కుచేలుడు సత్యానికి హరిశ్చంద్రుడు.
  3837. సోమరిపోతుకు సోకుచేస్తే సంతను ఇంటికి రమ్మన్నాట్టు
  3838. సూర్యుడికి స్వర్గం, లోభికి నరకం,
  3839. న్వర్షకలశంతో ఆవాహన మట్టికలశంతో ఉద్వాసన
  3840. సుక్షేత్రం లో దొండ నల్లరేగడిలో నల్లేరు
  3841. సలహా చెప్పటం సులభం పాటించటం కష్టం,
  3842. సరాలకు ముత్యాలు గీతాలకు సరాలు.
  3843. సొకులు చెప్పేసాదువు దీవించే. దెప్పుడు
  3844. సంగీతం నేర్చినకోమటి వ్యాపారం చేసినల్లు
  3845. సముద్రంలో. వానకురిసినా అడవిలో చెన్నిలకాసినా ఎవరి కోసం
  3846. సూరీడుకు తీరకలేదు, సారధికి కాళ్ళు లేవు
  3847. సోలిన అత్త సొగసు, కొత్త కోడల్ఇ గుణం సొగసు
  3848. సారె తెచ్చిన కోడలు ముల్లెతెచ్చిన అల్లుడు
  3849. సర్పంకాదు పొము అన్నాట్టు
  3850. హంసపాదులరాత ఆయాసంతో పాట
  3851. హడావుడేంటే కుక్క అంటే ఊళ్ళో పెళ్ళే నక్క అందిట
  3852. హిమగిరిలో ఉంపే నంది" గంగారంలో ఉంకే గంగిరెద్దు
  3853. హంసను చూసిన కాకి కులికి కురికి నడిచిందట
  3854. హంసరాయబారం కోకిల మేజబాణి
  3855. హనుమంతుడు లేని లంకాదహనమా.
  3856. హస్తీచచ్చినా దంతాలు దొరికితే చాలు.
  3857. హనుమంతుడి భక్తిబలం సీత కోసమా? రాముడుకోసమా!
  3858. హనుమంతుడి భక్తిగొప్పా? రాముడి రూపం గొప్పా?
  3859. హస్తిజాతి పెళ్ళాం మూషిక జాతి మొగుడు.
  3860. హస్తినిజాతిపుటక, శంకిణీ జాతి బుద్దులు
  3861. క్షీరసాగరంలో శేషావతారం, లవణసొగరంలో మత్స్యావతారం
  3862. క్షవరం చేస్తే మంగలి తిరుక్షవరంచేస్తే వెంగలి.
  3863. క్షేత్రయ్యలో వైరాగ్యం లేదు, సిద్దేంద్రుడులో శృంగారంలేదు.
  3864. శ్నేత్రయ్యవదం గోపాలుడికిష్టం త్యాగయ్యగేతం శ్రీరాముడి కిష్టం
Advertisement
Add Comment
Please, Sign In to add comment
Advertisement